Andhra Pradesh:జనసేనలో పెరుగుతున్న ఆశావహులు

Jana Sena came to power as an ally in the alliance.

Andhra Pradesh:జనసేనలో పెరుగుతున్న ఆశావహులు:జనసేన కూటమిలో మిత్రపక్షంగా ఉండి అధికారంలోకి వచ్చింది. పవన్ కల్యాణ్ తో పాటు ముగ్గురు మంత్రులు అయ్యారు. ఇద్దరికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే మరో ఇద్దరు కీలక నేతలు వెయిటింగ్ లో ఉన్నారు. జనసేన పార్టీ లో కీలకంగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణతో పాటు శివశంకర్ లు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికలలోనూ వారికి ఎక్కాడ ఎమ్మెల్యే సీట్లు దక్కలేదు.

జనసేనలో పెరుగుతున్న ఆశావహులు

విశాఖపట్టణం, ఏప్రిల్ 2
జనసేన కూటమిలో మిత్రపక్షంగా ఉండి అధికారంలోకి వచ్చింది. పవన్ కల్యాణ్ తో పాటు ముగ్గురు మంత్రులు అయ్యారు. ఇద్దరికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే మరో ఇద్దరు కీలక నేతలు వెయిటింగ్ లో ఉన్నారు. జనసేన పార్టీ లో కీలకంగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణతో పాటు శివశంకర్ లు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికలలోనూ వారికి ఎక్కాడ ఎమ్మెల్యే సీట్లు దక్కలేదు. అయితే అధికారంలోకి రావడంతో తమకు కీలకమైన నామినేటెడ్ పదవులు కానీ, ఎమ్మెల్సీ పదవులు కానీ వస్తాయని ఆశించారు. కానీ ఇద్దరు నేతలకు మాత్రం పది నెలల నుంచి పవన్ కల్యాణ్ నిర్ణయాలు నిరాశపరుస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వారిద్దరూ ఉత్తరాంధ్రలో పార్టీకి అండగా నిలిచిన వారిలో ముఖ్యులు కానీ ఇప్పటి వరకూ వారికి ఏ పదవి దక్కలేదు. అనేక నెలలుగా ఎదురు చూస్తున్న వారికి ప్రతి సారీ నిరాశ ఎదురవుతుంది. అసలు పవన్ కల్యాణ్ దృష్టిలో వీరున్నారా? లేదా? అన్నది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే సామాజికవర్గం తేడా కొడుతుందని చెబుతున్నారు.

ఇప్పటికే అన్ని పదవులు ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వడంపై కూడా ఇతర సామాజికవర్గాల వారు కొంత ఇబ్బంది పడే అవకాశముందన్న అంచనాలు వీరి పదవుల ఆశలపై నీళ్లు కుమ్మురిస్తున్నాయి. పవన్ కల్యాణ్ తమకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించినా సామాజికవర్గం అడ్డుగా వస్తుందేమోనన్న ఆందోళన వారిలో నెలకొంది. త్వరలో ఏ పోస్టు ఖాళీ అయినా వీరికి అవకాశం వస్తుందా? రాదా? అన్నది అనుమానంగానే ఉంది.శివశంకర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ 2018లో స్వచ్ఛంద పదవి విరమణ చేసి జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన తొలుత హైడ్రో జియాలజిస్ట్ గా పని చేశారు. 1995లో గ్రూప్ 1కు ఎంపికై వాణిజ్య పన్నుల శాఖలో పలు ముఖ్య బాధ్యతలను నిర్వర్తించారు. అంబేడ్కర్, ఫూలే సిద్ధాంతాలతో ప్రభావితమైన శివశంకర్ శ్రీకాకుళంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆలోచన విధానాలకు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకొంటూ, పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా ఉన్నారు.

కానీ శివశంకర్ కు ఇంత వరకూ పార్టీ పదవి తప్ప ఎలాంటి పదవి దక్కలేదు.మరో కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ. ఈయన విశాఖపట్నానికి చెందిన నేత. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంనుండి 16వ లోక్‌సభకు పోటీ చేయలేకపోయారు. ఆయన 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. ఆయన వృత్తి రీత్యా వ్యాపారవేత్త. తర్వాత జనసేనలో చేరి కీలకంగా మారారు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయనపార్టీలో చేరి ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశారు. పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు జనసేన గొంతుగా మారారు. పవన్ కల్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆయన సమర్ధించుకుంటూ వస్తున్నారు. కానీ గత పది నెలల నుంచి ఆయన పెద్దగా యాక్టివ్ లేకపోవడం గమనార్హం. ఎందుకంటే.. పదవి వస్తుందని ఆశపెట్టుకున్న బొలిశెట్టి సత్యనారాయణ గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంతో పాటు నామినేటెడో పదవి కూడా రాకపోవడంతో ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. అయినా ఆయన తాను జనసేనలోనే కొనసాగుతానని, పవన్ కల్యాణ్ వెంటే నడుస్తునానని చెబుతున్నారు.

Read more:Andhra Pradesh: ఎన్నాళ్లీ ఎదురు చూపులు

Related posts

Leave a Comment