Andhra Pradesh:కాకాణి కోసం ప్రత్యేక బృందాలు

kakani-govardhan-reddy

Andhra Pradesh:వైసీపీ  ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. అందులో భాగంగానే క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకం, దోపిడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు.

కాకాణి కోసం ప్రత్యేక బృందాలు

నెల్లూరు, ఏప్రిల్ 12
వైసీపీ  ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. అందులో భాగంగానే క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకం, దోపిడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. విచారణకు హాజరుకాకపోవడంతో ఇక లాభంలేదని ఆయనపై లుకౌట్ నోటీసులు జారీచేశారట. దీంతో ఆయన విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల్లోనే అడ్డుకోవచ్చన్నది పోలీసుల ప్లాన్ గా తెలుస్తోంది.క్వార్డ్జ్‌ అక్రమ తవ్వకాల కేసులో కాకాణిపై కేసు నమోదు కావడం, విచారణకు రావాలని ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఆయన లెక్కచేయడంలేదట. నోటీసులను తీసుకునేందుకు కాకాణి ఇంట్లో ఉండడంలేదంట. అయితే ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడం.. తదితర పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజులుగా కాకాణి ఎవ్వరికీ కన్పించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట.ముఖ్యంగా హైకోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో..కాకాణిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో విస్త్రతంగా గాలిస్తున్నారంట.

కాకాణి కోసం దాదాపు 7 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని సమాచారం. ఏపీతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో సైతం వేటాడుతున్నట్లు సమాచారం. కాకాణి కన్పిస్తే చాలు వెంటనే అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారంట.ఇక వైసీపీ హయాంలో మద్యం స్కాం వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చుట్టే తిరుగుతోందట. దీంతో సిట్‌ విచారణకు రావాలంటూ కసిరెడ్డికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా..ఆయన కంటిన్యూస్‌గా డుమ్మా కొడుతున్నారంట. బుధవారం విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇచ్చారంట అధికారులు.మరి ఈసారైనా కసిరెడ్డి విచారణకు వెళ్తారా..ఒకవేళ వెళ్లకుంటే సిట్ అధికారులు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ మొదలైంది. 3రోజుల క్రితం కసిరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన సమయంలో కూడా హైదరాబాద్‌లో ఆయన లేరని అధికారులు గుర్తించారట. దీంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించి, ఆయన బంధువులకు కూడా నోటీసులు ఇచ్చారట పోలీసులు. ఇంతకుముందు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా కసిరెడ్డి మాత్రం విచారణకు హాజరుకాకుండా డుమ్మాలు కొడుతున్నారంట.వైసీపీ హయాంలో వేల కోట్ల లిక్కర్ అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్ స్కాంపై స్కాన్ చేయాల్సిందే అంటూ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.

ఐతే వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన విజయ సాయిరెడ్డి..పార్టీకి రాజీనామా చేసిన తర్వాత లిక్కర్ స్కాంలో కర్మ, కర్త, క్రియ అంతా కసిరెడ్డి అంటూ ఆరోపించి పెద్ద బాంబే పేల్చారు. దీంతో అధికారులు కసిరెడ్డిపాత్రపై ఫోకస్ పెట్టి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైఉన్నారంట.2019 ఎన్నికలకు ముందు జగన్‌తో కలసి పనిచేసిన కసిరెడ్డి…వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా వ్యవహరించారు. ఆ పదవిలో ఉంటూనే తెరవెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కసిరెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలోనే అక్కడ లిక్కర్ బిజినెస్ చేసినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.ఏ లిక్కర్ కంపెనీ నుంచి ఎంత సరుకు కొనాలో..ఏరోజు, ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో ఇదంతా కసిరెడ్డే నిర్ణయించేవారని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఐతే నోటీసులకు కూడా కసిరెడ్డి స్పందించకపోవడంతో ఇక ఆయనకు కూడా లుకౌట్ నోటీసులు జారీచేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారట. మరి కసిరెడ్డి పోలీసుల నోటీసులకు స్పందించి వాచారణకు హాజరవుతారా లేక కాకాణిలాగే అజ్జాతంలోనే ఉంటారా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.

Read more:Andhra Pradesh:సచివాలయ ఉద్యోుగల రేషనలైజేషన్

Related posts

Leave a Comment