Andhra Pradesh:టెన్త్ పూర్తిచేసుకొని ఇంటర్మీడియట్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ లో ఎంపీసీ, బైసీపీ, సీఈసీ వంటి కోర్సులు ఇప్పటి వరకు ఏపీలో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎంబైపీసీ గ్రూపు ఆప్షన్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఇంటర్ లో ఎంబైపీసీ
విజయవాడ, ఏప్రిల్ 10
టెన్త్ పూర్తిచేసుకొని ఇంటర్మీడియట్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ లో ఎంపీసీ, బైసీపీ, సీఈసీ వంటి కోర్సులు ఇప్పటి వరకు ఏపీలో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎంబైపీసీ గ్రూపు ఆప్షన్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది.పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థుల్లో సైన్స్, మెడిసిన్ పై ఆసక్తి ఉన్నవాళ్లు బైసీపీ గ్రూపును, గణితం, ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంపీసీ గ్రూపును ఎంచుకుంటుంటారు. మ్యాథ్స్, బయాలజీ కలిపి చదవాలనుకుంటే అందుకు సంబంధించిన గ్రూపు ఎక్కువగా కాలేజీల్లో అందుబాటులో ఉండేది కాదు. దీంతో విద్యార్థులు ఎక్కువగా బైసీపీ, ఎంపీసీ గ్రూపుల్లోనే చేరుతూ ఇంటర్ తరువాత ఆ గ్రూపులకు సంబంధించిన విభాగాల్లోకి వెళ్తుంటారు. కానీ, సైన్స్ తోపాటు మ్యాథ్స్ పై ఆసక్తి ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో కొత్తగా ఎంబైసీపీ గ్రూపును అందుబాటులోకి తెచ్చింది.ప్రస్తుతం ఎంపీసీ చదివితే.. ఇంటర్ తర్వాత దానికి తగ్గట్టుగా ఇంజినీరింగ్ వంటి కెరీర్ అవకాశాలే ఎంచుకునే వీలుంది.
బైపీసీ చదివితే వైద్యం, ఫార్మసీ వంటి రంగాలవైపు వెళ్లవచ్చు. ఎంబైపీసీ చదివితే విద్యార్థులు గణితం, జీవశాస్త్రం రెండింటిలోనూ పట్టు పెంచుకుంటే ఇంటర్ తరువాత వారికి నచ్చిన విధంగా కెరీర్ ను మల్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.ఎంబైపీసీ (మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమెస్ట్రీ) గ్రూపును ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు వర్తింపజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఇంటర్ తరువాత వారికి నచ్చి విధంగా కెరీర్ అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎంబైపీసీ గ్రూపు ఆప్షన్ ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్ లో ఎంబైపీసీ గ్రూపు తీసుకోవటం ద్వారా జేఈఈ లేదా నీట్ లలో ఏదో ఒకటి.. లేదంటే రెండూ రాయొచ్చునని.. తద్వారా విద్యార్థులు ఇంటర్ తరువాత వారికి ఆసక్తికి తగ్గట్టుగా కెరీర్ మలచుకోవచ్చునని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.అయితే, ఎంబైపీసీ గ్రూపును అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఎన్ని కాలేజీల్లో ఈ గ్రూపును అమలు చేస్తారనేది స్పష్టత లేదని, అందుకు తగిన విధంగా ప్యాకల్టీలను సమకూర్చడం కూడా ముఖ్యమని.. లేదంటే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు విద్యావేత్తలను అభిప్రాయ పడుతున్నారు