Andhra Pradesh:వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా మారాల్సి ఉంది. గత ఐదేళ్లలో తాను చేసిన తప్పులను ఆయన సమీక్షించుకోవాల్సి ఉంది. ప్రధానంగా జగన్ అధికారంలో లేనప్పడు అందుబాటులో ఉన్నట్లే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలకు, ముఖ్య కార్యకర్తలకు చేరువగా ఉండాల్సిన అవసరం ఉంది. గత ఐదేళ్లలో ఎమ్మెల్యేలను చివరకు మంత్రులను కూడా ఆయన కలవలేదు. కనీసం తమ నియోజకవర్గాల సమస్యలను చెప్పుకునేందుకు కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు.
ఇంకా ఆ ఫీలింగేనా.
విజయవాడ, ఏప్రిల్ 11
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా మారాల్సి ఉంది. గత ఐదేళ్లలో తాను చేసిన తప్పులను ఆయన సమీక్షించుకోవాల్సి ఉంది. ప్రధానంగా జగన్ అధికారంలో లేనప్పడు అందుబాటులో ఉన్నట్లే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలకు, ముఖ్య కార్యకర్తలకు చేరువగా ఉండాల్సిన అవసరం ఉంది. గత ఐదేళ్లలో ఎమ్మెల్యేలను చివరకు మంత్రులను కూడా ఆయన కలవలేదు. కనీసం తమ నియోజకవర్గాల సమస్యలను చెప్పుకునేందుకు కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. అంతా ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రమే ఎమ్మెల్యేలు, మంత్రులతో డీల్ చేసింది. నాడు ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి చెప్పిన ఫీడ్ బ్యాక్ ను మాత్రమే జగన్ పరిగణనలోకి తీసుకున్నారు.అంతే తప్పించి పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను, నేతలను పట్టించుకోలేదు. కనీసం 2014 నుంచి 2019 ఎన్నికల వరకూ పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయిన వారిని కూడా జగన్ గుర్తించలేదు. వారు తీవ్రంగా నష్టపోయారని తెలుసు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసు. కానీ వారిని ఆదుకునే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా జగన్ చేపట్టలేకపోయారు. జిల్లాలకు వెళ్లినా ఎమ్మెల్యేలు కలిసినా పెద్దగా వారితో మాట్లాడింది లేదు. ముఖ్యమైన కార్యకర్తలు, నేతలను కూడా దూరంగా ఉంచారు. ఐదేళ్ల పాటు వారు ఉన్నారని కూడా జగన్ గుర్తించలేదు. దీంతో మొన్నటి ఎన్నికల్లో తమ పవరేంటో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు జగన్ కు రుచి చూపించారు.తాము జగన్ పై అభిమానంతో కులాలను పక్కనపెట్టి పదవులు రాకపోయినా తాము ఇబ్బందులు పడలేదని, కానీ తమను పట్టించుకోకపోవడమే బాధించిందని కార్యకర్తలు చెబుతున్నారు.
ఎన్నికలకు ముందు వైసీపీ సోషల్ మీడియా కూడా బలహీనం కావడం కూడా నాటి జగన్ ఓటమికి ఒక కారణంగా చెబుతారు. అంతా ఐప్యాక్ టీం మీద ఆధారపడటం, కోటరీ చుట్టూనే ఆయన తిరుగుతుండటంతో వాస్తవ పరిస్థితులు జగన్ దృష్టికి వెళ్లలేదని, ఎన్ని పథకాలు అమలు చేసినా, ఎన్ని అభివృద్ధి పనులు నియోజకవర్గాల్లో చేసినా చెప్పే వారు లేక గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా దెబ్బతినిందన్న విశ్లేషణలు వెలువడ్డాయి.అదే సమమయంలో జగన్ ఒక్కడే తానే స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించడం కూడా పార్టీ పరాజయానికి కారణంగా చెబుతారు.జగన్ ఈసారైనా తాను మారాలి. కార్యకర్తలను చేరదీయాలి. వారి ఆర్థిక అవసరాలు తీర్చలేకపోయినా సరే… కనీసం వారు కోరుకునేది ఒక్క పలకరింపు మాత్రమేనని అంటున్నారు. సెక్యూరిటీ రీజన్ పేరుతో తమను దూరం పెడితే వచ్చే ఎన్నికల్లోనూ పరిస్థితుల్లో మార్పులు రాదని హెచ్చరిస్తున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలను పట్టించుకుంటానని, వారికి న్యాయం చేస్తానని చెబుతున్నా మళ్లీ కొందరికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఫీడ్ బ్యాక్ ఇవ్వడంలో కార్యకర్తలను మించిన వారు మరొకరు ఉండరు. ఈ విషయం గుర్తుంచుకోపోతే ఈసారి కూడా జగన్ ప్రతిపక్షానికే పరమితం కావాల్సి ఉంటుందన్న హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి.
Read more:Andhra Pradesh:పవన్ స్ట్రాటజీ తో జగన్ కు ఇబ్బందులు తప్పవా