Andhra Pradesh:ఆక్వా రైతులకు గట్టి ఎదురుదెబ్బ

A key decision taken by US President Trump has dealt a severe blow to Andhra Pradesh's aqua farmers.

Andhra Pradesh:అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న కీలక నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా దిగుమతులపై సుంకాలను 3% నుండి 26% వరకు పెంచడంతో, ఏపీ నుంచి ఎగుమతి అయ్యే వనామీ రొయ్యల ధర ఒక్కసారిగా పడిపోయింది. దీని ప్రభావంతో రూ. లక్ష విలువైన రొయ్యలు ఇప్పుడు లక్షా 26 వేలు ఖర్చవుతుండగా, రవాణా, ప్యాకింగ్‌ తో కలిపి మొత్తం ఖర్చు 50% పెరిగిపోయింది.

ఆక్వా రైతులకు గట్టి ఎదురుదెబ్బ

ఏలూరు, ఏప్రిల్ 8
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న కీలక నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా దిగుమతులపై సుంకాలను 3% నుండి 26% వరకు పెంచడంతో, ఏపీ నుంచి ఎగుమతి అయ్యే వనామీ రొయ్యల ధర ఒక్కసారిగా పడిపోయింది. దీని ప్రభావంతో రూ. లక్ష విలువైన రొయ్యలు ఇప్పుడు లక్షా 26 వేలు ఖర్చవుతుండగా, రవాణా, ప్యాకింగ్‌ తో కలిపి మొత్తం ఖర్చు 50% పెరిగిపోయింది.ఇక ఎగుమతి దారులు ధరలు కేజీకి రూ. 30 నుంచి 50 వరకు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 100 కౌంట్‌ రొయ్య ధర రూ. 250 ఉండగా, ఇప్పుడు అది రూ. 210కి పడిపోయింది. ఈ నెల 9వ తేదీ నుంచి అమెరికా సుంకం అమల్లోకి రానుంది. ఏటా ఏపీ నుంచి 17.2 లక్షల టన్నుల వనామీ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతుండగా, ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే రోజుకు 2 వేల టన్నులు వెళ్తున్నాయి.

రైతుల ఆందోళనల నేపథ్యంలో, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ రాశారు. రొయ్యలపై సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మత్స్యరంగం ఏపీ జీడీపీలో 11% వాటాతో కీలకంగా ఉందని, ఈ సంక్షోభ సమయంలో రైతులకు అండగా ఉండాలని ఆయన లేఖలో వివరించారు. అధిక సుంకాల వల్ల విదేశీ ఆర్డర్లు రద్దవుతుండటంతో పాటు, గిడ్డంగుల్లో నిల్వ స్థలాలు కూడా లేవని ఆయన వెల్లడించారు.ఇక కేంద్రం ఆక్వా రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ భరోసా ఇచ్చారు. అయితే, రైతులు ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యాపారవర్గాలే ధరలు కుదించే సిండికేట్‌గా మారారని ఆరోపిస్తూ, రైతులకు అండగా పోరాడతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వమే దోచుకుంటుంది…
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. 100 కౌంట్‌ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- రూ.210కి పడిపోయిందని చెప్పారు.చంద్రబాబు నాయుడు ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్‌ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు?ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి, గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? రైతులంతా గగ్గోలు పెడితే, మీడియా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? 100 కౌంట్‌ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయింది.

ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్‌ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా ఇలా ప్రతి పంటకూ గిట్టూబాటు ధర లేకుండా పోయింది. దళారులు రైతుల కష్టాన్ని దోచుకుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను ప్రస్తావిస్తే మీ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది తప్ప ఎక్కడా బాధ్యత తీసుకోవడంలేదు. ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతే.ఎగుమతుల్లోనూ, అలాగే విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వారంగం దేశంలోనే నంబర్‌ వన్‌. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్‌ అథారిటీని మా హయాంలో ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్‌, ఫీడ్‌ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చాం. సిండికేట్‌గా మారి దోపిడీచేసే విధానాలకు చెక్‌ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం.కొవిడ్‌ సమయంలో దాదాపు ఐదేళ్ల క్రితం 100 కౌంట్‌కు, ఆ రోజుల్లో కనీస ధరగా రూ.210లు నిర్ణయించి రైతులకు బాసటగా నిలిచాం.

మూడుసార్లు ఫీడ్‌ ధరలు తగ్గించాం. ఇప్పుడు ఫిష్‌ ఆయిల్‌, సోయాబీన్‌ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15% నుంచి 5% తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్‌ ధరలు ఒక్కపైసా కూడా తగ్గలేదు. మేం ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నాసరే రేట్లు తగ్గడంలేదు.గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్‌ పరిధిలో కేవలం 80-90వేల ఎకరాలు ఉంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జోన్‌ పరిధిలోకి 4.22 లక్షల ఎకరాలు తీసుకువచ్చాం. ఆక్వా రంగంలో మొత్తం 64వేల విద్యుత్‌ కనెక్షన్లు ఉంటే అందులో జోన్‌ పరిధిలో ఉన్న 54వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్‌ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చుచేశాం. ఆక్వాజోన్స్‌లో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్‌ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి, ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం చూపించాం. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేసి, అత్యధికంగా ఆర్జిస్తున్న రంగాన్ని దెబ్బతీస్తున్నారు.చంద్రబాబు.. ఇప్పటికైనా కళ్లు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి, ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్‌లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయి. ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదు” అని వైఎస్‌ జగన్ ట్వీట్ చేశారు.

Read more:సంక్షిప్త వార్తలు:07-04-2025

Related posts

Leave a Comment