Andhra Pradesh:ఏపీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతానికి భిన్నంగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో పెండింగ్లో ఉన్న అంశాలకు పరిష్కార మార్గం చూపుతోంది. అందులో భాగంగా ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయాలకు రూపకల్పన జరుగుతోంది. తాజాగా ఏపీ రాజధాని అమరావతి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు ఆమోదం లభించింది.
అమరావతి 2 హైదరాబాద్.. 4 అవర్స్
విజయవాడ, ఏప్రిల్ 10
ఏపీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతానికి భిన్నంగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో పెండింగ్లో ఉన్న అంశాలకు పరిష్కార మార్గం చూపుతోంది. అందులో భాగంగా ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయాలకు రూపకల్పన జరుగుతోంది. తాజాగా ఏపీ రాజధాని అమరావతి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం తగ్గనుంది. దాదాపు నాలుగు గంటల వ్యవధిలోనే గమ్యానికి చేరుకునే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 11 సంవత్సరాలు అవుతోంది. గతంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా రకాల విభజన సమస్యలకు పరిష్కారం దొరకలేదు. వాటన్నింటికీ ఇప్పుడు మోక్షం కల్పిస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం..రాష్ట్ర విభజనసమయంలో చాలా రకాల అంశాలు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా రవాణాకు సంబంధించి ప్రాజెక్టులు మంజూరుకు నిర్ణయించారు. కానీ వాటి విషయంలో ఎటువంటి కదలిక లేకపోయింది.
అయితే ఇప్పుడు అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కి పచ్చ జెండా ఊపింది కేంద్రం. ఈ మేరకు డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని హోం శాఖను ఆదేశించింది. అదేవిధంగా త్వరలో అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. మరోవైపు తెలంగాణలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలైంది. బిపిఆర్ కార్యరూపం దాల్చితే.. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణం కేవలం నాలుగు గంటలు మాత్రమే.అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. మరోవైపు రోడ్డు కం రైల్వే ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. ముఖ్యంగా రాజధానిని అనుసంధానం చేస్తూ రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. మరోవైపు ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం శాఖను కేంద్రం ఆదేశించింది.
విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు క్యారిడార్ల ఏర్పాటును రైల్వే శాఖ పరిశీలించనుంది. పలు సమస్యల పరిష్కారానికి పలు శాఖలకు హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పెట్రోలియం రంగంలో అవకాశాలు వినియోగించుకోవడంలో ఏపీ ముందంజలో ఉందని కేంద్రం చెబుతోంది.. గతంలో రెండు సార్లు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 2014లో తొలిసారిగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రాగా.. టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఏపీలో అధికారంలో ఉంది కూడా. అయితే రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. 2019లో మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చారు. అయితే అప్పట్లో జగన్ ఏపీలో అధికారంలోకి రాగలిగారు. అప్పుడు కూడా రాష్ట్రానికి కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు టిడిపి సహకారంతో మూడోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ. ఏపీకి ఎనలేని ప్రాధాన్యం ఇస్తుండడం ఇప్పుడు విశేషం.
కీలక రైల్వే ప్రాజెక్టుకు ఆమోదం
ఏపీ, తమిళనాడు మధ్య ముఖ్యమైన రైల్వేలైన్‌కు సంబంధించి కీలక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. రాయలసీమలో ముఖ్యంగా తిరుపతి నుంచి పాకాల చాలా ముఖ్యమైన రైల్వే లైన్‌గా మారిపోయింది. ఇప్పటికీ అక్కడ సింగిల్ లైన్ ట్రాక్ మాత్రమే ఉండడంతో రవాణాపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు. అలాగే ఎక్కువ రైళ్లను నడపడానికి కూడా సింగిల్ ట్రాక్ అనేది ఇబ్బందికరంగా మారింది. అలాగే పాకాల నుంచి కాట్పాడి వెళ్లే లైన్ పరిస్థితి అంతే. ప్రజారవాణా మాత్రమే కాకుండా సరుకు రవాణాకు కూడా ఇది చాలా ముఖ్యమైన లైన్. ఇప్పుడు తిరుపతి నుంచి పాకాల మీదుగా కాట్పాడి వరకు రైల్వే లైన్ డబ్బింగ్ చేయబోతున్నారు. దీనితో ఆ మార్గంలో రైల్వే రవాణాకు సంబంధించిన కష్టాలు తీరబోతున్నాయితిరుపతి నుంచి కాట్పాడి వరకూ డబ్లింగ్ పనులకు ఆమోదం తెలపడంతో ప్రధానమంత్రి మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ, రైలు-రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు కేంద్రప్రభుత్వం కీలక అడుగు వేసిందనీ తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే లైన్‌ను డబుల్ ట్రాక్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.1,332 కోట్లతో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపడం చాలా సంతోషాన్ని కలిగించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారుఈ లైన్ డబ్లింగ్ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుందని చెప్పిన మంత్రి అభిప్రాయపడ్డారు. విద్యా, వైద్య అవసరాల కోసం వెల్లూరుకు వెళ్లే ప్రయాణికులకు కూడా గొప్ప వరం కానుందని అన్నారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల వరకూ సరుకు రవాణా చేయడానికి ఈ రైల్వే ప్రాజెక్ట్ తోడ్పడనుంది. రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ సిమెంట్, స్టీల్ రంగాలకు మరింత చేయూతనివ్వబోతుందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఈ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే పలు ప్రాంతీయ అభివృద్ధి పనులు వేగం పుంచుకుంటాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు డబుల్ ఇంజన్ పాలన విజయాన్ని ప్రతిబింబిస్తోందని కూటమి నేతలు చెబుతున్నారు.
Read more:Andhra Pradesh:ఒంటిమిట్ట రాముడి కళ్యాణానికి అంతా సిద్ధం