Andhra Pradesh:అప్పలరాజును వెంటాడుతున్న కేసులు

All politics in Srikakulam district now revolves around Seediri Appalaraj.

Andhra Pradesh:అప్పలరాజును వెంటాడుతున్న కేసులుశ్రీకాకుళం జిల్లాలో రాజకీయం అంతా ఇప్పుడు సీదిరి అప్పలరాజు చుట్టూనే నడుస్తోంది. ఒకప్పుడు మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మాజీ మంత్రి, పలాస నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ సీదిరి అప్పలరాజును పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఢిల్లీరావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతుందంటూ శుక్రవారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేసినందుకుగాను కేసు నమోదు చేశారు

అప్పలరాజును వెంటాడుతున్న కేసులు

శ్రీకాకుళం, ఏప్రిల్ 2
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం అంతా ఇప్పుడు సీదిరి అప్పలరాజు చుట్టూనే నడుస్తోంది. ఒకప్పుడు మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మాజీ మంత్రి, పలాస నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ సీదిరి అప్పలరాజును పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఢిల్లీరావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతుందంటూ శుక్రవారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేసినందుకుగాను కేసు నమోదు చేశారు పోలీసులు. విధులకు ఆటంకం కలిగించారంటూ అప్పలరాజుతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేశారు.రాష్ట్రంలో ఎప్పుడూ పొలిటికల్ హీట్ తో రగిలిపోయే నియోజకవర్గాలలో పలాస నియోజకవర్గం ఒకటి. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్న నిత్యం ఏదో ఒక అంశంపై రచ్చ జరుగుతూ వార్తలలో ఉంటుంది ఈ నియోజకవర్గం. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెడితే ఇక్కడి నేతలను పోలీసు కేసులు వెంటాడుతూ ఉంటాయి. ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు కేసులు నమోదయ్యాయి. వీటికి తోడు ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదు కావడంతో కేసుల సంఖ్య నాలుగుకి చేరింది.

తాజాగా పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదు చేశారు.పలాస మండలం నీలావతికి చెందిన ఢిల్లిరావు అనే పౌర హక్కుల సంఘం నేత అనుమానాస్పద మృతి కేసు విషయమై శుక్రవారం(మార్చి 28) మృతిని భార్య కమల, గ్రామ పెద్దలతో కలిసి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఢిల్లీ రావు మృతికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలలు గడిచినా ఇప్పటికీ పోలీసులు మృతికి కారణం ఏంటనేది చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, మాజీ మంత్రికి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దర్యాప్తు వేగవంతం చేసి నెల రోజుల్లో ఢిల్లి రావు మృతికి కారణం ఏంటనేది స్పష్టం చేస్తామని చివరకు పలాస DSP వెంకట అప్పారావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు అప్పలరాజు.అయితే అదే రోజు అదే పోలీస్ స్టేషన్ లో ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ జరగాల్సి ఉంది. కాసేపటిలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి SP చేరుకుంటారనగా మాజీ మంత్రి అప్పలరాజు నిరసనకు దిగారు. దీంతో గుంపుగా ధర్నా చేపట్టి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అప్పలరాజుతో సహా మరో 16 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ అభియోగాలపై జిల్లాలో మూడు కేసులు నమోదు కాగా తాజాగా ఇపుడు ఆయనపై మరో కేసు నమోదయింది.

తనపై పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేయటంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటుగానే స్పందించారు. మేము ధర్నా చేసామని మాపై FIR నమోదు చేస్తే.. ఢిల్లీ రావు మృతి చెంది మూడు నెలలైన కనీస వివరాలు వెల్లడించకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను ఏం చెయ్యాలని ప్రశ్నించారు. ఇది మీ రోజు.. తైతక్కలు ఆడండి మేం భరిస్తాం. కానీ మా రోజు వచ్చినపుడు మాత్రం ఇంతకన్నా గట్టిగా మీ చేత తైతక్కలాడిస్తాం అని మంత్రి పోలీసులను హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో తనపై నాలుగు కేసులు పెట్టారని, రానున్న నాలుగేళ్లలో ఇంకా తనపై ఎన్ని FIR లు వేయాల్సి వస్తాదో ఆని అన్నారు.తెప్పల ఢిల్లీరావు అనే ఉద్ధానం వాసి మృతి కేసులో నిజనిజాలు వెల్లడించండని అనేకసార్లు డిఎస్పీకి వినతిపత్రాలు ఇచ్చామన్నారు. పోలీసులు రెండు రోజుల్లో, వారం రోజుల్లో చెబుతామని చెప్పి ఎంతకీ తేల్చకపోతే తాము వెళ్లి స్టేషన్ ముందు ధర్నా చేశామని చెప్పారు. ప్రశ్నించే వారిపై FIR లు వేస్తామంటే అదేం పరిపాలన అని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్పే రోజు వస్తాదని అన్నారు. మరోవైపు, మాజీ మంత్రి అప్పలరాజు తోపాటు మరో 16 మందిపైన పోలీసులు కేసు నమోదు చేయటంపై మృతుడు ఢిల్లిరావు భార్య తెప్పల కమల సైతం స్పందించారు.

50 ఏళ్లకే నా భర్తను దారుణంగా చంపేశారని, దానిపై పోలీసుల నుండి సరైన రెస్పాన్స్ లేకపోతే ఎస్పీకి వినతి పత్రం ఇచ్చేందుకు గ్రామ పెద్దలు, మిగతా సర్పంచులతో కలిసి వెళ్ళానని కమల చెప్పారు. తనకు న్యాయం చేయండి అని ఎస్పీ కలిసి అడగడానికే తాము వెళ్ళామని చెప్పారు. తన భర్త చనిపోయాక 3నెలలుగా తాను, తన కొడుకు దిక్కులేని వారీగా ఉంటున్నామనిఆమె అవేదన వ్యక్తం చేశారు. ఇలా మాపై కేసులు పెట్టీ ఈరోజో రేపో మమ్మల్ని కూడా చంపేసేటట్టు ఉన్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఇదిలావుంటే, మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపారు. క్వార్ట్జ్ అక్రమంగా తరలించారా? లేదా? సోమిరెడ్డి ఆరోపణల్లో నిజమెంత? స్టేషన్‌కు వచ్చి సమాధానం ఇవ్వండి అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. నెల్లూరు జిల్లా తాటిపర్తిలో రుస్తుం మైన్స్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసు ఇచ్చిన పోలీసులు.. విచారణకు రావాలంటూ సూచించారు.

నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు కాకాని ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు.రుస్తుం మైన్స్ కేసులో ఇప్పటికే ఏడుగురిపై FIR నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కాకాని పేరును A4గా చేర్చారు. పోదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమంగా వైట్ క్వార్ట్జ్ తరలించారంటూ 2024లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పాటు క్వారీ వద్ద నిరసన చేపట్టారు. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ చేస్తున్న పోలీసులు.. కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణకు పిలిచారు. ఈ కేసులో కాకాని ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. తనపై తప్పుడు కేసు పెట్టారని ఇప్పటికే ఆరోపించిన కాకాని ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో కాకాని అందుబాటులో లేరు. మరి పోలీసుల నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారు? విచారణకు హాజరు అవుతారా లేదా ఉన్న ఉత్కంఠ నెలకొంది.

Read more:Andhra Pradesh: అమరావతి, విశాఖలపై ఫోకస్

Related posts

Leave a Comment