తమ తల్లిదండ్రుల స్మారకార్థం చలివేంద్రం ప్రారంభం
రామగుండం :
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రమేష్ నగర్ చౌరస్తా ఆటో స్టాండ్ వద్ద ఆదివారం కాకతీయ నగర్ దర్బార్ నిర్వాహకులు నారదాసు సతీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ట్రాఫిక్ సిఐ బి. రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటిరోజు మజ్జిగ పంపిణీ చేశారు. నిర్వాహకులను సిఐ అభినందించారు.అనంతరం నిర్వాహకులు సతీష్ రావు మాట్లాడుతూ తన తల్లిదండ్రులు నారదాసు ప్రతిభారాణి- సురేందర్రావు స్మారకార్థం ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడి ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు, వాహనదారులకు దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఆటో యూనియన్ సహకారంతో ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో రమేష్ నగర్ చౌరస్తా అడ్డా ఆటో డ్రైవర్లతోపాటు పలువురు పాల్గొన్నారు.
Read more:కల్తి మద్యంపై పోలీసుల దాడులు
నల్గోండ
నల్గొండ జిల్లా చండూర్ ప్రాంతంలో కల్తీ మద్యం మాఫియా రెచ్చిపోయింది. ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఓ గ్యాంగ్ కు చెక్ పెట్టేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో, చండూర్, నాంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లోనే ఈ భారీ కల్తీ మద్యం ముఠా గుట్టు రట్టయింది. కల్తీ మద్యం సేవించి ఆసుపత్రి పాలైన బాధితులు, ఈ మద్యాన్ని తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ముఠా సభ్యుల కాల్ డేటా వివరాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ముఠాకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో వెలుగులోకొచ్చిన ఈ కల్తీ మద్యం తయారీకి బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వం వహించాడు. నలుగురు ఏజెంట్లు, డ్రైవర్లను ఉపయోగించి, కోళ్ల ఫారాల్లో స్పిరిట్ నిల్వ చేసి, అక్కడి నుండి స్థానికంగా సరఫరా చేయాలని ఈ ముఠా పన్నాగం పన్నింది. ఈ కోళ్ళ ఫారం యజమాని కూడా ఈ నేరంలో భాగస్వామిగా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. స్వాధీనం చేసుకున్న స్పిరిట్ బాటిల్ లను, మద్యం శాంపిల్స్ను ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఈ మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలపై వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read more:ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన..
వాషింగ్టన్ డీసీలో రోడ్లపైకి వేలాదిగా జనం మొత్తం 50 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అమెరికన్లు
ట్రంప్ నిర్ణయాలతో దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనలలో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు తెలిపాయి. ముందుచూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయంపైనా నిరసన వ్యక్తం చేశారు. ‘హ్యాండ్స్ ఆఫ్!’ పేరుతో దేశవ్యాప్తంగా 1,200 పైగా ప్రదేశాలలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘ట్రంప్ గో బ్యాక్’, ‘హాండ్స్ ఆఫ్ డెమోక్రసీ’, ‘మస్క్ వాస్ నాట్ ఎలెక్టెడ్’ వంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామీ వంటి నగరాల్లోని స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, టారిఫ్ ల విధింపు, మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ప్రజలు తమ ఆందోళనలను కేంద్రీకరించారు.
గ్రామాల్లో ప్రజల దాహార్తిని తీర్చండి
నీటి సమస్యను పరిష్కరించండి .
ఉపాధి హామీ ద్వారా 200 రోజులు పని దినాలు పెంచండి.
పెండింగ్లో ఉన్న ఉపాధి వేతనాలు చెల్లించండి
రైతు కూలి సంఘం డిమాండ్.
కౌతాళం
మండల పరిషత్ కార్యాలయం
ఎదుట రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ ఆర్ డి ఓ యోగేశ్వర్ రెడ్డి కి వినతిపత్రం ఇచ్చారు.అనంతరం రైతు కూలీ సంఘం మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న ప్రజా సమస్యలు మాత్రం పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు.మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని. పది రోజులు ఒకసారి త్రాగునీరు వదులుతున్నారని ప్రతి గ్రామంలో నిటి ఎద్దడి లేకుండా చూసుకోవలసిన బాధ్యత అధికారులదే అని గ్రామాల్లో చెడిపోయిన బోర్లుగానీ, భోరింగులు గాని మరమత్తులు చేపట్టాలని ఎండా కాలాన్ని దృష్టిలో ఉంచుకోని ప్రతి గ్రామంలో త్రాగు నీటి వసతిని కల్పించాలి కోరారు. త్రాగు నీటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వలస నివారణ చర్యలు చేపట్టాలి. కుటుంబంతో ప్రతి ఒక్కరికి 200 వందల రోజులు ఉపాధి పనులు కల్పించాలి. ప్రతి వీధి లెట్లు ఉండేటట్లు చూడాలి.గ్రామల్లో డ్రైనేజు కాలువ పూడికను తీయించాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ప్రతి 4 రోజుల ఒక సారి త్రాగునీరు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కులీ సంఘం నాయకులు రమేష్ , నాగేంద్రప్ప, గోపాల్ , నాగేంద్రప్ప , శరణప్ప తదితరులు పాల్గొన్నారు.