సంక్షిప్త వార్తలు:04-15-2025

Brief news

సంక్షిప్త వార్తలు:04-15-2025:వివేకా హత్య కేసు నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్రపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్ ఖన్నా ఆరా తీశారు. వివేకా హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిలో ఉదయ్ కూడా ఉన్నారని సునీత తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు.

వైఎస్ వివేకా హత్య కేసు
 – నిందితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ
వివేకా హత్య కేసు నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్రపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్ ఖన్నా ఆరా తీశారు. వివేకా హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిలో ఉదయ్ కూడా ఉన్నారని సునీత తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, ఈ పిటిషన్లను అవినాష్‌రెడ్డి, ఇతర నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లకు జత చేస్తామని వెల్లడించింది. గత పిటిషన్లతో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని ఆదేశించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, తదుపరి విచారణను వాయిదా వేసింది.

నగరి బస్టాండ్ లో అగ్నిమాపక వారోత్సవాలు

visakhapatanam news: అగ్నిమాపక వారోత్సవాలు.. మరణించిన సిబ్బందికి నివాళి | general
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నగరి బస్టాండ్ లో విన్యాసాలు నిర్వహించారు. మంగళవారం  ఉదయం 10 గంటలకు అగ్నిమాపక వారోత్సవాలు నగరి బస్టాండ్ ప్రాంగణంలో ఫైర్ అవేర్నెస్ గ్యాస్ అవేర్నెస్ వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరి సబ్ డిస్టిక్ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ సయ్యద్ అజీజ్ అహ్మద్ హాజరయ్యారు . అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన వారోత్సవాలు అగ్నిమాపక కేంద్ర అధికారి సుబ్బరాజ్ ఆధ్వర్యంలో జరిగింది.  ఈ విన్యాసాల కార్యక్రమంలో ప్రతాప్ ప్రవీణ్ మోహన్ సత్య ప్రకాష్ రామచంద్రయ్య కోటేశ్వరరావు, మధు, లోకయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

ఆసుపత్రిలో రోగి మృతి..బంధువుల అందోళన

మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

హైదరాబాద్
లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో హై కేర్ హాస్పిటల్ లో రోగి మృతి చెందడం వివాదస్పదమయింది. కార్వాన్ భాంజావాడిలో ఉండే ఎల్లయ్య ఆయాసంగా ఉందని లంగర్ హౌస్ హై కేర్ హాస్పిటల్ కి చెక్ అప్ కోసం వచ్చాడు.  వైద్యులు ఈసీజీ చేసిన పిమ్మట ఎలాంటి ప్రమాదం లేదని 24 గంటలు అబ్జర్వేషన్ లో పెట్టాలని కుటుంబ సభ్యులకు తెలిపారు.  కాసేపు గడిచాక వ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించుకోగా తమ వద్ద కార్డియో స్పెషలిస్ట్ లేదని వెంటనే తీసుకొని పోవాలని బంధువులను కోరారు. అంతలోనే సదరు వ్యక్తి మృతి చెందడంతో హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున మృతుడి బంధువులు చేరుకొని ధర్నా నిర్వహించారు. .

Related posts

Leave a Comment