సంక్షిప్త వార్తలు:04-15-2025:వడ్డీలేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశం లభించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుకు ఫ్రీ లోన్లు ఇస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక గ్రూపులకు 20 వేల కోట్లకు పైగా లోన్లు ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తాజ్ డక్కన్ హోటల్ లో నిర్వహించిన స్త్రీ సమ్మిట్ 2.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భట్టీ.
మహిళా సాధికారత కోసమే స్త్రీ సమ్మిట్
ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్
వడ్డీలేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశం లభించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుకు ఫ్రీ లోన్లు ఇస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక గ్రూపులకు 20 వేల కోట్లకు పైగా లోన్లు ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తాజ్ డక్కన్ హోటల్ లో నిర్వహించిన స్త్రీ సమ్మిట్ 2.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భట్టీ. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం. మహిళా సాధికారత కోసమే స్త్రీ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఒకవైపు స్త్రీలను దేవతలుగా చూస్తేనే మరోవైపు కంట్రోల్ చేయాలనే ప్రయత్నం తరతరాలుగా జరుగుతూనే ఉందని అన్నారు. హిందూ కోడ్ బిల్లుతోనే మహిళా సాధికారత ప్రారంభం అయ్యిందని, అంబేద్కర్ వల్లే మహిళలకు హక్కులు లభించాయని గుర్తు చేశారు. మహిళలకు వారతసత్వ హక్కులు లభించాయని తెలిపారు. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ స్కీం సక్సెస్ ఫుల్ గా నడుస్తోందని అన్నారు. సోలార్ ప్లాంట్ నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించామని, దీంతో సోలర్ ప్లాంట్ నిర్వహణలో మహిళలకు భాగస్వామ్యం లభించిందని అన్నారు. ఇలాంటి స్త్రీ సమ్మిట్ లతో మహిళా సాధికారత సాధించవచ్చుని పిలుపునిచ్చారు.
వ్యవసాయ పరికరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం
మైలవరం మండలం చిలుకూరువారి గూడెంలో సబ్సిడీపై రైతులకు మంజూరు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాలను మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం ప్రారంభించారు. తరువాత గోకులం షెడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది
దుబ్బాక
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు. తొగుటలో జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని,ఆ ఖర్చును తాము భరిస్తామంటు న్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ ఉంటే కుదరడం లేదని దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తనని అన్నారు.
బీఆర్ఎస్ పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
యాదాద్రి
బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తిచేసుకుని రజితోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న వేళ.. గులాబీ శ్రేణులు సభకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో..యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం, వేములకొండ లోని మత్స్యగిరి లక్ష్మినరసింహ ఆలయం నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయం వరకు బీఆర్ఎస్వీ నాయకులు చేపట్టిన పాదయాత్రను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, పైల్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 27 న వరంగల్ జరిగే సభ సక్సెస్ కావాలని చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని.. పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
డాక్యుమెంట్ రైటర్ల నిరసన
యాదాద్రి
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ ద్వారా రోజుకి కేవలం 48 రిజిస్ట్రేషన్ చేయాలని, ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకునే విధానం ద్వారా డాక్యుమెంట్ రైటర్స్ జీవనోపాది కోల్పోతున్నామని డాక్యుమెంట్ రైటర్స్ అన్నారు.
నూతన విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం ర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసారు. సబ్ రిజిస్టర్ కు వినతిపత్రం అందజేసారు. మంగళవారం నుండి శనివారం వరకు డాక్యుమెంట్ రైటర్ సేవలు నిలిపివేయునట్లు తెలిపారు.