సంక్షిప్త వార్తలు:04-13-2025:తిరుమల గోశాలలో వందకు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. భూమన వ్యాఖ్యలను ఆయన ఖండిచారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
భూమన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఆనం
తిరుపతి
తిరుమల గోశాలలో వందకు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. భూమన వ్యాఖ్యలను ఆయన ఖండిచారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు గోవును తల్లిగా భావిస్తారని ఆనం తెలిపారు.
తల్లిలాంటి గోవుల పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిరోజు పరిశీలిస్తున్నారని చెప్పారు. గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని, 230 మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. వయసు పైబడి, అనారోగ్యంతో చనిపోయే ఘటనలను కూడా భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడు జగన్ అని అన్నారు. హిందూ ధర్మాన్ని మీ కుటుంబంలో మీరు పాటిస్తున్నారా? అని ప్రశ్నించారు.
గుంటూరుకు జీఎస్టీ కార్యాలయం తరలింపు
విశాఖలో సెంట్రల్‌జీఎస్‌టీ కార్యాలయాన్ని గుంటూరుకు తరలించనున్నట్లు కమిషనర్ ఆనంద్‌కుమార్ తెలిపారు.రాజధాని అమరావతికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పారు. గుంటూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన మూడు ఎకరాల భూమి ఉందని, దానిని కొనుగోలు చేసి.. అక్కడ కార్యాలయంతో పాటు సిబ్బందికి క్వార్టర్స్, ఇతర అవసరమైన భవన సముదాయాలు నిర్మిస్తామన్నారు.
మరోవైపు ఏపీలో తిరుపతి సర్కిల్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తోందని, అక్కడ కియా మోటార్స్ ఉండడమే అందుకు కారణమని ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్ వంటివి ఉన్నప్పటికీ, 2024-25లో వాటి ఉత్పత్తి తగ్గడం వల్ల తిరుపతి సర్కిల్ ఆదాయంలో ముందుందని తెలిపారు.2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేతదారుల నుంచి 300 కోట్లు రికవరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆనంద్ తెలిపారు.చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాటిపై ఆడిట్లు తగ్గించామని పేర్కొన్నారు.
రెవెన్యూ శాఖలో నైపుణ్యం వున్న సిబ్బంది లేరు
కాకినాడ
ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యంగా తాము పనిచేస్తూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు..కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..రెవెన్యూ వ్యవస్థను వేగంగా పనిచేయాలని ప్రభుత్వం పారదర్శంగా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అన్ని శాఖలలో ప్రభుత్వానికి రెవెన్యూ చాలా కీలకమైందని ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు క్రింది స్థాయి వారు లేకపోవడంతో పనులు ఆలస్యమై ప్రజల్లో తమ శాఖకు చులకన భావం ఏర్పడిందన్నారు.
మారే చట్టాల పైన శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేసి ఇలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి విఆర్ఓ, ఆర్ఐ, డిప్యూటీ కలెక్టర్లకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు..ఈ మీడియా సమావేశంలో రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు పితాని త్రినాధరావు,ఏపీజేఎసీ అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు, ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పీ శాస్త్రి, కాకినాడ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్విఎస్ఎస్ఆర్కే దుర్గాప్రసాద్, రెవెన్యూ సర్వీస్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ రామ్మోహన్, ఉమెన్స్ వింగ్ చైర్మన్ సిహెచ్ సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి పి. శిరీష తదితరులు పాల్గొన్నారు.
కమ్మేసిన పొగ మంచు
ఇబ్బందులు పడ్డ వాహనచోదకులు..
మండలంలోని అరకు పాడేరు ప్రధాన రహదారిలో శనివారం తెల్లవారుజామున నుంచి సుమారు 7 గంటల వరకు పొగ మంచు కమ్మేసి ఉండడంతో రాకపోక వాహన చోదకులు రహదారి పూర్తిగా కనిపించకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడినట్లు ఆయా వాహన చోదకులు అన్నారు. వేసవికాలం ప్రారంభంలో కూడా పొగ మంచు కమ్ముకొని ఉండడం ప్రయాణికులకు కాస్త ఆశ్చర్యం కలిగింది. రాకపోక వాహన చోధకులు ప్రయాణించేటప్పుడు పూర్తిగా రహదారి కనిపించకపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు.
రాష్ట్రంలో మఖానా పంటకు ప్రోత్సాహం
నల్గొండ
పంటల మార్పిడి వల్ల రైతులకు అధిక లాభాలు పొందవచ్చు అనే ఆలోచన తో తెలంగాం ప్రభుత్వం రాష్ట్రంలో మఖానా పంటను ప్రోత్సహిస్తుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం ఆచార్య జయ శంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం కంపసాగర్ లో మఖానా పంట కోసం విత్తన ప్రదర్శన ను ఆమె ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం వారు అభివృద్ధి చేస్తున్న వరి వంగడాల వివరాలను శాస్త్రవేత్తను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మఖాన తెలంగాణ లో ప్రారంభించడం కోసం నలుగురు శాస్త్రవేత్తల బృందంతో గత నెలలో బిహార్ రాష్ట్రo దర్భంగా మఖాన కేంద్రాన్ని సందర్శించి పంటను పరిశీలించి రావాల్సిందే శాస్త్రవేత్తల పంపినట్లు వారు తిరిగి వచ్చింది వేదిక ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మఖాన పంటను సాగు చేయవచ్చని దానికోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు చోట్ల నకిరేకల్, కట్టంగూరు, కొండ మల్లేపల్లి, కంప సాగర్ లో తొలిసారిగా పంటలు వేయడానికి విత్తనాన్ని కూడా తెప్పించినట్లు తెలిపారు. ఈ మఖాన పంట ఎనిమిది నెలలు పంట దిగుబడి చేతికి వస్తుందని ఈ మఖాన పంటకు రైతులు వ్యవసాయంలో భాగం చేసుకుని పండించుకుంటే మంచి లాభాలు గడించవచ్చని తెలిపారు. మఖాన పంటను ఎక్కడైనా పండించవచ్చని ఒక బీహార్ రాష్ట్రంలో మాత్రమే పండిస్తారు అక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పడం అవాస్తమని తెలంగాణలో కూడా పండించే పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ ఉద్యానవన శాఖ, కంప సాగర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.