సంక్షిప్త వార్తలు:04-13-2025

MLA Chadalawada presented CM Relief Fund cheques

సంక్షిప్త వార్తలు:04-13-2025:నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు ₹9,56,038/- రూపాయల చెక్కలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన చెక్కులను తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

 

సీఎం సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే చదలవాడ

నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం సహాయ నిధి ద్వారా 14 మంది లబ్ధిదారులకు ₹9,56,038/- రూపాయల చెక్కలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన చెక్కులను తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి నేతలు పాల్గొన్నారు.

శ్రీ ఆంజనేయ స్వామి జన్మోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు
భక్తి శ్రద్ధలతో ముక్కులు తీర్చుకున్న ఎరిగేరి గ్రామ ప్రజలు

Hanuman Jayanti 2024,Hanuman Jayanti 2024 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా  ఆంజనేయుడి జన్మదినోత్సవ వేడుకలు... హనుమాన్ ఆలయాలకు భారీగా తరలివస్తున్న  భక్తులు.. - hanuman ...
శ్రీ ఆంజనేయ స్వామి జన్మోత్సవ సందర్భంగా ఎరిగేరి గ్రామంలో శ్రీ పులి గట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో  ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టాపన ఆలయ పూజారులు. గ్రామ పెద్దలు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి,నీలకంఠ రెడ్డి.నిర్వహించారు. అనంతరం దేవాలయంలో అర్చకులు స్వామివారికి పాలాభిషేకం,రుద్రాభిషేకం, ఆకు పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు ఫల ప్రసాదములు అందించారు. దేవాలయమునకు భారీగా తరలివచ్చి భక్తులు టెంకాయలు సమర్పించి మొక్కులు తీర్చకున్నారు.

 

ఇంటర్ ఫలితాలలో సత్తాచాటిన మద్దికేర కస్తూరిబా విద్యార్థులు

ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న  మంత్రి..

మండల కేంద్రమైన మద్దికేర లో గల కస్తూరిబా పాఠశాల యందు శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో సత్తా చాటారు.ఈ సందర్భంగా మద్దికేర కస్తూరిబా పాఠశాల ఎస్.ఓ జ్యోతి రెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలలో 35 మంది విద్యార్థులకు గాను 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఎల్.బి పావని అనే విద్యార్థి 470 మార్కులకు గాను 415 మార్కులు సాధించిందని ఆమె తెలియజేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర ఫలితాలలో 13 మంది విద్యార్థులకు గాను 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాలలో జే.ఈశ్వరి 913 మార్కులు సాధించారని ఎస్.ఓ జ్యోతి రెడ్డి తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్.ఓ జ్యోతి రెడ్డి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు,బోధన సిబ్బందికు శుభాకాంక్షలు తెలియజేశారు.

కనిపించకుండా పోయిన కుమారుడు

11 ఏళ్ల తరువాత తల్లిదండ్రుల దగ్గరకు

తప్పిపోయిన కుమారుడు తిరిగొచ్చాడు — కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ

మెదక్
పదకొండళ్ల క్రితం కనిపోయించకుండా పోయిన కుమారుడిని మెదక్ జిల్లా పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 2014లో 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు  ఇంటి నుంచి వెళ్లిపోయాడు తేజసాయి(ప్రస్తుత వయసు 30). 11 ఏళ్లుగా కుమారుడి కోసం తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శారద వెతుకుతున్నారు. ఈ నెల ఏప్రిల్ 3న మెదక్ ఎస్పీని కలిసి విషయం తేజసాయి తల్లిదండ్రులు తెలియజేసారు. సాంకేతిక ఆధారాలతో సాయితేజ బెంగళూరులో ఉన్నట్టు గుర్తించారు. బెంగళూరు వెళ్లి సాయితేజని తీసుకువచ్చి క్షేమంగా తల్లిదండ్రులకు పోలీసులు అప్పచెప్పారు. తేజసాయి బెంగళూరులో పెళ్లి చేసుకుని అక్కడే హోటల్ నడుపుకుంటూ స్థిరపడ్డాడు. సొంతంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తల్లితండ్రులను వీడి బెంగళూరు వెళ్లినట్టు  తేజసాయి వివరించాడు. తేజసాయి కుటుంబ సభ్యులు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు: వెంకయ్యనాయుడు

 

అప్పులతో పంచుకుంటూ పోతే - చేయాల్సింది ఇదీ : వెంకయ్య నాయుడు..!! | Former  Vice president Venkaiah naidu interesting comments on Schemes  implementation - Telugu Oneindia

తిరుపతిఏప్రిల్ 12
పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. పార్టీ మారే నేతలు పదవికి రాజీనామా చేయాలనే నిబంధన రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.సాంకేతికత సాయంతో జమిలి ఎన్నికలు జరపడం కష్టం కాదని వెంకయ్య నాయుడు తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయ కోణం తప్ప మరేమి లేదని అన్నారు. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది అపోహ అని తెలియజేశారు. జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని, అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేక పోతున్నాయని చెప్పారు. అధికారం పోతే కొన్ని పార్టీలు సంయమనం కోల్పోతున్నాయన్నారు.

Related posts

Leave a Comment