సంక్షిప్త వార్తలు:04-12-2025:చైత్ర పౌర్ణమి సందర్బంగా శనివారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో జరిగింది. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం. ఈరోజు ఉదయం చైత్ర పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవముగా ప్రారంభం అయింది.ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం ను ప్రారంభించారు. త
ఇంద్రకీలాద్రిలో గిరి ప్రదక్షిణ
విజయవాడ
చైత్ర పౌర్ణమి సందర్బంగా శనివారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో జరిగింది. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం.ఈరోజు ఉదయం చైత్ర పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవముగా ప్రారంభం అయింది.ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం ను ప్రారంభించారు.
తప్పెట్లు, మహిళల కోలాట నృత్యములు,భజన బృందాల సంకీర్తనలతో పాటు వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవం గా సాగింది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి,కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది.దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.
పోలీసుల అదుపులో బట్టల దొంగలు
రంగారెడ్డి
వస్త్ర దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసిపి శ్రీనివాస్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన కనుమూరి వెంకటేశ్వరరావు, కట్ట యశోద, కంప రమణ, దేవరకొండ సుభాషిణి, సదుపాటి తిరుపతమ్మ, సదుపాటి వెంకటేశ్వరమ్మ, ఉసురుగంటి వెంకటేశ్వర్లు ఓ ముఠాగా ఏర్పడి వస్త్ర దుకాణాలను లక్ష్యంగా చేసుకొని వాటిల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ఏడుగురు గ్రూపులుగా విడిపోయి వస్త్ర దుకాణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న సిబ్బందితో మాటామంతి కలుపుతూ వారిని దృష్టి మరల్చి విలువైన పట్టు చీరలను అపహరించి షాపు నుండి ఏమీ కొనకుండా వెళ్లిపోయేవారు.
ఈ విధంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలోని ఓ వస్త్ర దుకాణంలోకి ప్రవేశించి దృష్టి మరచి 14 విలువైన చీరలను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి ఈరోజు రిమాండ్ కు తరలించారు. వారి నుండి రెండు లక్షల రూపాయల విలువైన 13 చీరలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి తెలిపారు. ఈ ముఠా కేవలం హైదరాబాద్ తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో సైతం చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పాతబస్తిలో హనుమాన్ జయంతి ర్యాలీ
హైదరాబాద్ పాతబస్తీ హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిపుర డివిజన్ లోని ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డిసిపి స్నేహమేహర హాజరై ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు. యువకులు కాషాయం జెండాలతో జైశ్రీరామ్.
జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కన్నుల పండుగగా బైక్ ర్యాలీ ముందుకు సాగింది. ఈ బైక్ ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా సౌత్ జోన్ డిసిపి స్నేహ మేహర నేతృత్వంలో అడుగడుగున సీసీ కెమెరాలతో బైక్ ర్యాలీ కదలికలను పరిశీలిస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎండి జావిద్ .ఛత్రినాక ఏసిపి సి.హెచ్ .చంద్రశేఖర్. ఛత్రినాక సీఐ. నాగేంద్ర ప్రసాద్ వర్మ. మొగల్ పుర సీఐ. సి శ్రీను తో పాటు డిఐలు మరియు ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.