సంక్షిప్త వార్తలు:04-09-2025:శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కియా పరిశ్రమలో భారీ చోరీ
ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం?
శ్రీ సత్య సాయి
శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి ఈ క్రమంలో చోరీ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read also:కురుడి శివాలయంలో పవన్ కళ్యాణ్ అభిషేకార్చనలు
గిరిజన గ్రామస్తుల కోరిన మేరకు కురుడి గ్రామ సందర్శన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు నియోజకవర్గం పరిధిలోని కురుడి గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం కురుడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని శివాలయానికి వెళ్లి స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు. గ్రామస్తురాలు శ్రీమతి రాములమ్మ, ఆలయ కమిటీ సభ్యులతో కలసి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అడవితల్లి బాట కార్యక్రమ ప్రారంభోత్సవం సమయంలో పవన్ కళ్యాణ్ కి కలిసిన కురుడి గ్రామ గిరిజనులు తమ ఊరి శివాలయంలో దర్శనం చేసుకుని వెళ్లాలని కోరగా, వస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కురిడి గ్రామ అభివృద్ధి నిమిత్తం సొంత నిధుల నుంచి రూ. 5 లక్షలు ప్రకటించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటకశాఖ సంయుక్త కార్యాచరణలో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, టూరిజంకి ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు
Read also:ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్
విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేసిన కలెక్టర్
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న శిక్షణలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అల్ఫోర్స్ విద్యాసంస్థ సహకారంతో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒలంపియాడ్ లో శిక్షణ ఇప్పించారు. ఈ పరీక్ష రాసి మెరిట్ సాధించిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ ప్రదానోత్సవ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. ఒలంపియాడ్ లో మెరిట్ సాధించిన 16 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చే విధంగా ప్రైవేటు యాజమాన్యాలతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం అన్ని రంగాల్లోనూ రాణించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఇందులో భాగంగా అల్ఫోర్స్ విద్యాసంస్థ 400 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఒలంపియాడ్ లో శిక్షణను ఇచ్చిందని తెలిపారు. వీరిలో 80 మంది మెరిట్ సాధించగా 16 మందికి మెడల్స్ వచ్చాయని తెలిపారు. మెరిట్ సాధించిన 80 మంది విద్యార్థులకు ఈనెల 24 నుండి మరో దఫా శిక్షణ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం సంతృప్తినిస్తోందని అన్నారు. అవకాశం, వేదిక ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లోని ఎంతోమంది పిల్లలు విజయం సాధిస్తారని నిరూపితమైందని అన్నారు. ఈ వేసవిలో చేపట్టబోయే మరిన్ని శిక్షణ కార్యక్రమాలకు విద్యార్థులు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించి శిక్షణకు పంపించాలని, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో టాలెంట్ ఉందని అన్నారు. వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని తెలిపారు.
విద్యార్థి దశ నుండే వివిధ పోటీ పరీక్షలకు హాజరవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత విద్యపై అవగాహన వస్తుందని తెలిపారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థులకు ఎప్పుడూ చేయూతనిస్తామని అన్నారు. రానున్న ఐదేళ్లలో మరిన్ని శిక్షణలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంచి అవకాశాలు వచ్చేలా చూస్తామని తెలిపారు. ఒలంపియార్డులో మెరిట్ సాధించిన 80 మందికి ఈనెల 23 నుండి వచ్చే నెల 11 వరకు మరో శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. శిక్షణకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి చాడ జైపాల్ రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, భవిత కేంద్రాల కోఆర్డినేటర్ ఆంజనేయులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.