సంక్షిప్త వార్తలు:04-08-2025:జిల్లా ఎస్పీ .వి.విద్యాసాగర్ నాయుడు రాయచోటి పట్టణంలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాత్రిపూట పోలీసులు నిర్వహిస్తున్న గస్తీని ఆయన స్వయంగా పరిశీలించారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో, అలాగే శివారు ప్రాంతాల్లోని పోలీస్ పెట్రోలింగ్ బృందాలను ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు.
జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీల:
రాత్రి గస్తీ సిబ్బంది అప్రమత్తం:
రాయచోటి, ఏప్రిల్ 8:
జిల్లా ఎస్పీ .వి.విద్యాసాగర్ నాయుడు రాయచోటి పట్టణంలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాత్రిపూట పోలీసులు నిర్వహిస్తున్న గస్తీని ఆయన స్వయంగా పరిశీలించారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో, అలాగే శివారు ప్రాంతాల్లోని పోలీస్ పెట్రోలింగ్ బృందాలను ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గస్తీ సిబ్బందితో మాట్లాడి వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే తనిఖీలు చేయాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, శాంతిభద్రతలను కాపాడటానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. రాత్రి 10:30 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై ఎవరూ తిరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఎస్పీ వెంట రాయచోటి పట్టణ సీఐ, బి.వి.చలపతి, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అలీ ఉన్నారు.
Read also:ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం
శ్రీకాకుళం
ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తృటిలో తప్పింది. రైలు బోగీలు విడిపోయాయి. కప్లింగ్ వీడి రైలు రెండు భాగాలుగా విడిపోయింది. 8వ భోగీ వద్ద ప్రమాదం జరగ్గా.. 15 భోగీలు ఇంజనుతో సహా వెల్లిపోయాయి. ఘటన స్థలానికి రైల్వే సిబ్బంది చేరుకుంది. శ్రీకాకుళంలోని పలాస సమీపంలో ఘటన జరిగింది. దాంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురైయారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం.
Read also:అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు
విజయవాడ
సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. దాంతో పవన్ తన అల్లూరి సీతారామరాజు రాజు జిల్లాలో పర్యటన ముగించుకుని సింగపూర్ బయలుదేరారు. చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ను ఆసుపత్రిలో చేర్పించారు..