Telangana news:టీ కాంగ్రెస్ లో మీనాక్షి మార్క్.. ఒక్కటిగా ప్రతిపక్షాలకు చుక్కలు

Meenakshi Mark in Tea Congress.. A single blow to the opposition parties

Telangana news:టీ కాంగ్రెస్ లో మీనాక్షి మార్క్.. ఒక్కటిగా ప్రతిపక్షాలకు చుక్కలు:తెలంగాణ కాంగ్రెస్ అంటేనే తలోదారి అనే చర్చ ఉంటుంది. కానీ హస్తం పార్టీలో సడెస్ ఛేంజెస్‌ కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించిన మంత్రులు..రూట్‌ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గంలో విభేదాలున్నాయని, సీఎం రేవంత్ రెడ్డికి కొందరు మంత్రులకు పడటం లేదన్న చర్చ ఉండేది. క్యాబినెట్‌లో కొంతమంది మంత్రులు తనకు సహకరించడం లేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో స్వయంగా రేవంత్ రెడ్డి వాపోయిన సందర్భాలున్నాయి.

టీ కాంగ్రెస్ లో మీనాక్షి మార్క్..
ఒక్కటిగా ప్రతిపక్షాలకు చుక్కలు

హైదరాబాద్, మార్చి 18
తెలంగాణ కాంగ్రెస్ అంటేనే తలోదారి అనే చర్చ ఉంటుంది. కానీ హస్తం పార్టీలో సడెస్ ఛేంజెస్‌ కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించిన మంత్రులు..రూట్‌ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గంలో విభేదాలున్నాయని, సీఎం రేవంత్ రెడ్డికి కొందరు మంత్రులకు పడటం లేదన్న చర్చ ఉండేది. క్యాబినెట్‌లో కొంతమంది మంత్రులు తనకు సహకరించడం లేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో స్వయంగా రేవంత్ రెడ్డి వాపోయిన సందర్భాలున్నాయి.ఇలా మంత్రివర్గంలో గ్యాప్..అసెంబ్లీలోనూ కొట్టొచ్చినట్లు కనిపించేంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలతో దాడికి దిగినా..మంత్రులు పెద్దగా పట్టనట్లు ఉంటూ వచ్చారు. తమ తమ శాఖలకు సంబంధించిన అంశం వస్తే తప్ప మిగతా సందర్భాల్లో పెద్దగా రెస్పాండ్‌ అయ్యే వారు కాదు. ప్రతీ దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది.ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను గమనిస్తే పరిస్థితిలో మార్పు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్‌లో చాలా ఛేంజెస్‌ వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది.

స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది. సభలో ఉన్న మంత్రులు, ఇతర సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకున్నారు.ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సమయంలోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలకు అధికార పక్షం నుంచి దీటుగానే సమాధానం వచ్చింది. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలేవీ చేయడం లేదన్న బీఆర్‌ఎస్‌ విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుధీర్ఘంగా సమాధానం ఇచ్చి బీఆర్ఎస్‌ను సైలెంట్ చేసే ప్రయత్నం చేశారు.ఇక మరో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. బీసీ కులగణనపై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ఇక కృష్ణా జలాల వివాదంపై ప్రతిపక్షాల విమర్శలపై కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు ఉత్తమ్‌. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే కేసీఆర్, హరీష్ రావులే కారణమని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదని చెప్పుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

రెండు మూడు రోజులుగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పక్షం పైచేయి సాధించే పనిలో పడింది. అసెంబ్లీలో అధికార పార్టీ టీమ్‌ వర్క్‌ మొదలైందన్న మాటలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఇది మంచి పరిణామమని చర్చించుకుంటున్నారు నేతలు. అయితే ఇందుకు ఢిల్లీ పెద్దల డైరెక్షనే కారణని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య కోఆర్డినేషన్ మిస్‌ అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్ ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సీఎంకు, మంత్రులకు మనస్పర్ధలు, విభేదాలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, కానీ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తించొద్దని గట్టిగానే చెప్పినట్లు సమాచారం.అసెంబ్లీలో పక్కా కోఆర్డినేషన్‌తో కలిసికట్టుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని దిశానిర్ధేశం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత బడ్జెట్ సెషన్‌లో అధికార కాంగ్రెస్ పక్షంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందట. హైకమాండ్ ఉపదేశం బాగానే పనిచేస్తోందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Read also:రేవంత్ ఆగ్రహం వెనుక… ఏంటీ

హైదరాబాద్, మార్చి 18
మీ జర్నలిస్టు సంఘాలను నేను అడుగుతా ఉన్న. ఎవరు జర్నలిస్టో మీరే చెప్పండి. జాబితాలు తయారు చేయండి. ప్రభుత్వానికి అందించండి. మీ జాబితాలో లేని వ్యక్తులు ఎవరైనా జర్నలిస్టులమని చెబితే కఠిన చర్యలు తీసుకుంటాం. బట్టలిప్పి నడిబజార్లో నిలబెడతాం” ఇవీ శనివారం నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.అధికారాన్ని కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాను మరింతగా బలోపేతం చేసింది. మెజారిటీ యూట్యూబ్ ఛానల్స్ ను భారత రాష్ట్ర సమితి హైర్ చేసుకుంది. పలు వెబ్ సైట్ లను కూడా నిర్వహిస్తోంది. యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్ లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఇవి ఒక పరిధి వరకు ఉంటే బాగానే ఉండేది. కానీ జర్నలిజ ముసుగులో.. ఒక పార్టీకి డబ్బా కొట్టుకుంటూ.. చేస్తున్న వ్యవహారం ఏవగింపుగా మారింది. ఫలితంగా సోషల్ మీడియాను నియంత్రించాలనే డిమాండ్ తెరపైకి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వరంగల్ సభలో వేగంగా మీడియాను తొక్కేస్తా అని మాటలు మాట్లాడారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు జర్నలిస్టులు ఎవరో చెప్పాలని జర్నలిస్టు సంఘాలను అడుగుతున్నారు. దీనిని బట్టి పాత్రికేయం ముసుగులో ఎంతటి విద్వేషం ప్రసారం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అధికారంలో ఉన్న వాళ్లకు ఈ నొప్పి తీవ్రత తెలియడంతో వారు స్వరం పెంచుతున్నారు. గతంలో కేసీఆర్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యక్తులు మాత్రమే మారారు..మీడియాకు లక్ష్మణ రేఖ కచ్చితంగా ఉండాలి. ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో జరిగిన వివాదంలో పాత్రికేయులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. జల్ పల్లి లో మోహన్ బాబు ఇంటి గేట్లు తీయడమే ఆలస్యం.. వెంటనే లోపలికి వెళ్లిపోయారు. దీంతో మోహన్ బాబు విచక్షణ కోల్పోయి ఓ విలేకరిని కొట్టాడు. ఈ విషయంలో మోహన్ బాబును సమర్ధించడం లేదు.. అలాగని విలేకరిని వెనకేసుకు రావడం లేదు. ఆ విలేఖరి వార్త ముసుగులో ఒక సెలబ్రిటీ వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టాలని చూడడం అత్యంత దారుణం. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక వ్యక్తిగత జీవితం అంటూ ఉంటుంది. అందులోకి ప్రవేశిస్తామంటే బయట వ్యక్తులకు ఇలాంటి సన్మానమే జరుగుతుంది.

అది మోహన్ బాబు కావచ్చు.. కెసిఆర్ కావచ్చు.. రేవంత్ రెడ్డి కావచ్చు.. సోషల్ మీడియా ఉన్మాదం వల్ల పడుతున్న బాధ వారికి మాత్రమే తెలుసు. అయితే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా.. అధికార పక్షంలో ఉన్నప్పుడు మరొక విధంగా వారు వ్యవహరించడమే విధి వై చిత్రి. ఇప్పుడిక సోషల్ మీడియాను నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు లేదు. ఒకవేళ ఉన్నా నియంత్రణ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం ఒకరకంగా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. అలాంటప్పుడు కోరలు చాచిన సోషల్ మీడియాలో మార్పులు తీసుకురావడం పైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఇక జర్నలిస్ట్ ను ప్రభుత్వం గుర్తించే విషయంలోనూ అనేక నిబంధనలు ఈసారి తెరపైకి రావచ్చు. ఎందుకంటే శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అంత పదునుగా ఉన్నాయి మరి. దీనిపై విధి విధానాలు చర్చించడానికి త్వరలోనే ముఖ్యమంత్రి జర్నలిస్టు సంఘాల పెద్దలతో భేటీ అయ్యే అవకాశం కొట్టి పారెయ్యలేనిది.

Read more:Telangana news: వేములవాడలో వింత ఆచారం

Related posts

Leave a Comment