Telangana News:కొల్లగొడుతున్న ప్రకృతి సంపద:ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ మొరం తవ్వకాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మొరం వ్యాపారులు కొంమంది స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేక కొందరు, కొన్ని ప్రాంతాలకే అనుమతులు తీసుకొని పలు చోట్ల అక్రమంగా మొరం తవ్వేస్తున్నారు. అధికారుల నిఘా కరువవ్వడంతో వ్యాపారస్తులు విచ్చలవిడిగా తమ దందాను కొనసాగిస్తున్నారు.ప్రకృతి సంపదను కొల్లగోడుతున్న మొరం బాకాసుర్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న కోట్లు దండుకొంటున్నారు.
కొల్లగొడుతున్న ప్రకృతి సంపద.
ఆదిలాబాద్, మార్చ్
ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ మొరం తవ్వకాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మొరం వ్యాపారులు కొంమంది స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేక కొందరు, కొన్ని ప్రాంతాలకే అనుమతులు తీసుకొని పలు చోట్ల అక్రమంగా మొరం తవ్వేస్తున్నారు. అధికారుల నిఘా కరువవ్వడంతో వ్యాపారస్తులు విచ్చలవిడిగా తమ దందాను కొనసాగిస్తున్నారు.ప్రకృతి సంపదను కొల్లగోడుతున్న మొరం బాకాసుర్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న కోట్లు దండుకొంటున్నారు. ఎత్తయిన గుట్టలతో పాటు సమాంతరంగా ఉన్న గట్టి నేలలను ఇలా దేన్ని వదలకుండా ఇష్టానుసారంగా దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని బోథ్, తలమడుగు, తాంసి, నేరడీగొండ, భీంపూర్ బేలా, జైనథ్, అదిలాబాద్ రూరల్ మండలంలోని పలు ప్రాంతాలు, ఇచ్చోడ, వంటి ఏరియాలలో అక్రమ దందా కొనసాగుతున్నాయి. అక్రమంగ మొరం దందా చేస్తున్న వ్యాపారులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.
చెట్లు పుట్టలే కాదు పెద్దపెద్ద గుట్టలను సైతం వదలడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అక్రమంగా మొరం తవ్వేస్తూ నెల మట్టం చేసేస్తున్నారు. ముఖ్యంగా మారుమూల మండలాల్లో మొరం తవ్వకాలు కొనసాగుతున్నాయి. దర్జాగా మొరం తవ్వకాలు చేపడుతున్న మొరం భకాసురులు కోట్లకు పడగేత్తుతున్నారు. ఫలితంగా విలువైన గుట్టలు, ప్రకృతి సంపద కనుమరుగు అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అక్రమ మొరం తవ్వకలతో పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడుతు న్నాయి. గ్రామ శివారుల్లోని ప్రభుత్వ భూముల్లో మొరం కోసం లోతుగా తన్వేస్తుండడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతు న్నాయి. దింతో ఈ గుంతల్లో వర్షపు నీరు నిండి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికి మొరం కోసం తవ్విన గుంతల్లో చిన్నారులు పడి మృతి చెందిన ఘటనలు చాలానే ఉన్నాయి.వన్య ప్రాణులు సైతం గుంతలలో పడి ప్రాణాలను కోల్పోతున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ రూరల్ మండలం యపల్ గూడలో గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందారు. బంగారు గూడ సమీపంలో గుంతలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడటంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఇలాంటి ఘటనలు పలు చోట్ల చోటుచేసుకున్నాయి.
జిల్లాలో కొనసాగుతున అక్రమ్న మొరం తవ్వకాలను కడ్డడి చేయాల్సిన అధికారులు వ్యాపారస్తుల నుండి మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దింతో ఎలాంటి భయం లేకుండా మొరం బాకాసురులు నెలల తరబడి జేసీబీ, క్రేన్ ల సహాయంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటల పాటు మొరం ను తవ్వేస్తున్నారు.టిప్పర్ లలో తవ్విన మొరం ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందా ను కట్టడి చేయాల్సిన అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తూ వ్యాపారస్థులకు సహకరిస్తున్నరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడిగేవారు ఎవరు లేరు కదా అని విచ్చల విడిగా తమ పని కానిచ్చేస్తు ప్రభుత్వ ఖజానా కు గండి కొడుతున్నారు. గత పది సంవత్సరాల కాలం నుంచి తవ్వకాలు ఇంకా ఎక్కువగానే జరుగుతుండడం గమనార్హం. ఈ దందాను అడ్డుకునే నాథుడే కరువయ్యాడు.రోజుకు వందల కొద్ది టిప్పర్లలో మొరం ను తరలిస్తూ ప్రకృతిని కొల్లగొడుతున్నారు. మొరం భకానురులు చేస్తున్న ఈ ఆక్రమ తవ్వకాలపై అడ్డూ అదుపు లేకుండా పోయింది. పల్లెల్లో శివారు ప్రాంతాలన్నీ మొరం అక్రమ తవ్వకాలతో చెరువులను తలపిస్తున్నాయి ప్రకృతి సంపదను దోచుకుంటున్న మొరం భకాసురులపై ఇకనైనా ప్రభుత్వం, అధికారులు దృష్టి సారించి కొరడా ఝలిపించాల్సిన అవసరం ఎంతైన ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద పెద్ద మొరం గుంతలు ఏర్పడే అవకాశం ఉంది.
Read also:ఎస్సీ వర్గీకరణతో దేశానికి ఆదర్శంగా తెలంగాణ
30 ఏళ్ళ వర్గీకరణ పోరాటానికి దారి చూపిన కాంగ్రెస్
,పెద్దపల్లి ప్రతినిధి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చారిత్రాత్మకం, 11ఏళ్ళలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదని, సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టబద్దత కల్పించి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల పెద్దపల్లి పట్టణం లోని చేకురాయి క్రాస్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా జెండా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాలు చేసిన పోరాటానికి దారిచూపిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పేరు ప్రఖ్యాతులు గల 4 గురు న్యాయవాదులను నియమించి 7 గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బలమైన వాదనలు వినిపించి 6 గురు న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగిందన్నారు. అందరినీ సమన్వయం చేస్తూ ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలిపారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగం మేరకు రాష్ట్రంలో షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ద్వారా ఎస్సీలను 3 భాగాలుగా విభజించిన 15 శాతం రిజర్వేషన్లు వాటా తేల్చామని అన్నారు. 1930లో బ్రిటీష్ కాలంలో కుల గణన జరిగిందని, 95 ఏళ్ళ తర్వాత తెలంగాణలో బీసీ కులగణన నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించారని తెలిపారు. బీసీ బిల్లును కేంద్రానికి పంపి పార్లమెంటులో చట్టబద్దత పొందేవరకు పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ పోరాడాలని కోరారు. పార్లమెంటులో బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించు కోవాలని హితవు పలికారు. 11 ఏళ్ళ పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీలేదని విమర్శించారు. ఎన్డీయే పాలనలో దేశం ఆర్థికంగా దివాళ తీసిందని, మోడీ అసమర్థ పాలనకు ఇదే నిదర్శనమన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. నల్ల చట్టాల పేరుతో రైతులను ఢిల్లీ నడి ఒడ్డున కాల్చి చంపిన బీజేపీకి కాంగ్రెస్ పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1200 కోట్లు సన్నవడ్లకు బోనస్ చెల్లిస్తే పెద్దపల్లి నియోజక వర్గ రైతులకు రు.58.62 కోట్లు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించమని తెలిపారు. యువ వికాసం ద్వారా అర్హులైన యువతకు ఉపాధి కోసం సభ్సిడిపై రుణాలు అందజేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో పారదర్శకంగా పాలన చేస్తూ అభివృద్ది, సంక్షేమం సాధిస్తుంటే బీఆర్ఎస్ నేత కేటీఆర్ కళ్ళు, చెవులు లేని గుడ్డి, చెవిటి వాడిలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న యాసంగిలో కూడా గింజ కటింగ్ లేకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేందుకు నిరంతరం కాల్వల వెంట తిరుగుతున్నామని, పొలాలు ఎండకుండా సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యకర్తల కృషితోనే పార్టీకి మనుగడ ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పునాది అని, యువ వికాసం పథకం ద్వారా అర్హులైన కార్యకర్తలకు సబ్సిడీ రుణాలు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని వివరించారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాష్ రావు, తిరుపతి రెడ్డి, నాయకులు గోపగాని సారయ్య గౌడ్, మస్రత్, బూశనవేణ సురేష్ గౌడ్, సందనవేన రాజేందర్, బండారి సునీల్, ఆరె సంతోష్, కడార్ల శ్రీనివాస్, దొడ్డుపల్లి జగదీష్, జాని, బొడ్డుపల్లి శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, సుధాకర్ రెడ్డి, నేత్తెట్ల కుమార్, గుజ్జుల కుమార్, ఆరగొండ రాజ్ కుమార్, రవీందర్, పరమేశ్వర్, దాసరి రాజేశం, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.