Telangana:ఎస్ ఎల్ బీసీ ప్రమాదానికి మల్లెల తీర్ధమే కారణమా:టన్నెల్ లో ఇరుక్కుపోయిన వారి ఆచూకీ తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులుగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. వివిధ రాష్ట్రాల సేవలను వినియోగించుకుంది. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపింది. అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం రెండు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగింది. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో ఉన్న ఓ మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. అయితే అతనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో దుర్వాసన వస్తున్న నేపథ్యంలో రెస్క్యూ బృందాలు తవకాలు జరిపాయి.
ఎస్ ఎల్ బీసీ ప్రమాదానికి మల్లెల తీర్ధమే కారణమా
మహబూబ్ నగర్, మార్చి 27
టన్నెల్ లో ఇరుక్కుపోయిన వారి ఆచూకీ తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులుగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. వివిధ రాష్ట్రాల సేవలను వినియోగించుకుంది. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపింది. అయినప్పటికీ ఇప్పటివరకు కేవలం రెండు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగింది. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో ఉన్న ఓ మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. అయితే అతనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో దుర్వాసన వస్తున్న నేపథ్యంలో రెస్క్యూ బృందాలు తవకాలు జరిపాయి. డి 1, డి 2 చోట కాకుండా.. ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా మృతదేహం ఆనవాళ్లు లభించాయి. గ్యాస్ కట్టర్ల సహాయంతో కన్వేయర్ బెల్ట్ శిధిలాలను తొలగించారు. మృతదేహాన్ని బయటకి వెలికి తీశారు. ఘటన జరిగిన నెలరోజుల అనంతరం రెండో మృతదేహం లభించడం విశేషం. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టన్నెల్ కూలిపోయిన సంఘటన గత నెల 22న జరిగింది. అందులో 8 మంది చిక్కుకున్నారు.
వారిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్మీ, ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ టి ఆర్ ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, కేరళ కెడావర్ డాగ్ స్క్వాడ్ సేవలను వినియోగించుకుంది. ఇక సరిగ్గా 15 రోజుల క్రితం గురుప్రీత్ సింగ్ అనే కార్మికుడి మృత దేహం లభ్యమైంది. అప్పటినుంచి తవ్వకాలు చేపడుతున్నప్పటికీ మొన్నటి వరకు ఎటువంటి పురోగతి లభించలేదు. ఇక సోమవారం లో రెస్క్యూ ఆపరేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమీక్షలో టన్నెల్ పైకప్పు బలహీనంగా ఉందని.. అది ఏ క్షణమైనా కూలిపోతుందని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు,మంత్రులు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణం శ్రీశైలం ప్రాజెక్టు కాదని.. మల్లెలతీర్థం జలపాతమే కారణమని నీటి రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మల్లెల తీర్థం జలపాతం నీరు ఊటనీరుగా మారి.. సొరంగం పై కప్పు కూలడానికి కారణమైందని చెబుతున్నారు. దేవాదుల ప్రాజెక్టును చలివాగుండం చేసిన విషయం తెలిసిందే. అలాగే మల్లెల తీర్థం కూడా కూలడానికి కారణమైందని తెలుస్తోంది. నిమిషానికి 3,000 లీటర్ల ఊట వస్తోందని.. ఇక్కడి నుంచి వచ్చే ఊట శ్రీశైలం ప్రాజెక్టు కాదని.. మొదటిదాకా శ్రీశైలం ప్రాజెక్టు వల్లే ఊట వస్తోందని వాదనలు ఉండేవని.. తమ పరిశీలనలో మల్లెల తీర్థం వల్లే ఊట వస్తోందని తేలిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.