Tamil Nadu:తమిళనాడులోకి జనసేన:పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా తమిళనాడులో సైతం హల్చల్ చేస్తున్నారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ కావాలని పోరాట బాట పట్టినప్పుడు తమిళనాడు నుంచి ఎక్కువగా విమర్శలు వచ్చాయి. తమిళ నేతలంతా పవన్ పై వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగారు. నటుడు ప్రకాష్ రాజ్ అయితే బిజెపి అజెండా అంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న హిందీ భాష పై జరిగిన వివాదంలో కూడా పవన్ తమిళ నేతల తీరును తప్పు పట్టారు.
తమిళనాడులోకి జనసేన
చెన్నై, మార్చి 25
పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా తమిళనాడులో సైతం హల్చల్ చేస్తున్నారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ కావాలని పోరాట బాట పట్టినప్పుడు తమిళనాడు నుంచి ఎక్కువగా విమర్శలు వచ్చాయి. తమిళ నేతలంతా పవన్ పై వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగారు. నటుడు ప్రకాష్ రాజ్ అయితే బిజెపి అజెండా అంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న హిందీ భాష పై జరిగిన వివాదంలో కూడా పవన్ తమిళ నేతల తీరును తప్పు పట్టారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర నేతలతో లేని విధంగా తమిళ నేతలతో పవన్ ఆగ్రహంగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిచ్చింది. అయితే పవన్ తమిళనాడులో జనసేన విస్తరించాలన్న ఆలోచనతో ఇదంతా చేసినట్లు ప్రచారం ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే పవన్ సైతం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.వరుసగా తమిళ నేతలతో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో.. ఓ తమిళ టీవీ పవన్ కళ్యాణ్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో తన జనసేన తమిళనాడులో విస్తరిస్తానని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. ఇటీవల పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో పవన్ హిందీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులో ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో పవన్ చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
హిందీ నిర్బంధంగా నేర్పించాలనే విధానానికి తాను కూడా వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాను స్వచ్ఛందంగానే తమిళంతో పాటు హిందీని నేర్చుకున్నట్లు తెలిపారు.పవన్ హిందీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి లేని భయం.. దేశంలోని హిందీ భాష నేర్చుకునేందుకు ఎందుకని పవన్ ప్రశ్నించారు. నేతలు హిందీలో ప్రసంగాలు చేస్తుంటారు. కానీ హిందీని మాత్రం విమర్శిస్తుంటారని తప్పు పట్టారు పవన్. మరోవైపు తమిళనాడులో బిజెపి తప్పకుండా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చునని చెప్పారు. భవిష్యత్తులో తన జనసేన సైతం తమిళనాడులో విస్తరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారుఇటీవల జరుగుతున్న పరిణామాలతో తమిళనాడులో జనసేననుఅభిమానించేవారు పెరుగుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో భిన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని సైతం జై కొట్టిన వారు ఉన్నారు. అందుకే పవన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి తమిళనాడులో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలను తమిళనాడు వాసులు ఎక్కువగా వాచ్ చేస్తుంటారు. డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు నటిస్తానని కూడా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాలతో పాటు సమానంగా సినీ కెరీర్ కొనసాగుతుందని.. అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో జనసేన విస్తరించనునట్లు కూడా చెప్పారు పవన్.
Read more:Andhra Pradesh:వైఎస్ పేరు తీసేసిన నోరెత్తని వైసీపీ