New Delhi:టెస్లా అమ్మకానికి కార్లు సిద్ధం

Tesla cars ready for sale
New Delhi:టెస్లా అమ్మకానికి కార్లు సిద్ధం:ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ సంస్థ అయిన టెస్లా కంపెనీ కార్ల అమ్మకానికి భారత్ లో రంగం సిద్ధం అయింది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని సుమారు 4వేల చదరపు అడుగులకు పైగా ఆస్తిని లీజుకు తీసుకుంది. ఇందులోనే టెస్లా కొత్త కార్ల షో రూం ప్రారంభించనుంది. ఈ షో రూం నెలవారీ అద్దె కోసం రూ.35,26,665 చెల్లిస్తుంది.

టెస్లా అమ్మకానికి కార్లు సిద్ధం

ముంబై మార్చి 18
ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ సంస్థ అయిన టెస్లా కంపెనీ కార్ల అమ్మకానికి భారత్ లో రంగం సిద్ధం అయింది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని సుమారు 4వేల చదరపు అడుగులకు పైగా ఆస్తిని లీజుకు తీసుకుంది. ఇందులోనే టెస్లా కొత్త కార్ల షో రూం ప్రారంభించనుంది. ఈ షో రూం నెలవారీ అద్దె కోసం రూ.35,26,665 చెల్లిస్తుంది. కంపెనీ రూ. 2,11,59,990సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించింది. ఈ నేపథ్యంలో టెస్లా ఇండియాలోకి ప్రవేశం అనేది లాంఛనం అని చెప్పవచ్చు. దీంతో దీనికి సంబంధించి అన్ని సన్నాహాలు చేస్తుంది సంస్థ. తాజాగా ఇండియాలో రెండు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల కోసం సర్టిఫికేషన్, హోమోలోగేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. దేశంలో కార్లను అమ్మే ముందు సర్టిఫికేషన్, హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి.అందుకనే టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రై.లిమిటెడ్ ఇండియాలో మోడల్ వై, మోడల్ 3 కార్ల హోమోలోగేషన్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకుంది.హోమోలోగేషన్ అనేది ఒక వాహనం రోడ్డు మీద ప్రయాణించడానికి యోగ్యమైనదని.. ఇండియాలో తయారు చేసిన లేదా దేశంలోకి ఇంపోర్ట్ చేసుకున్న అన్ని వాహనాలకు విధించిన నిబంధనలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ప్రక్రియ.

కేంద్ర మోటారు వెహికల్ రూల్స్ కు అనుగుణంగా ఉద్గారం, సేఫ్టీ, రోడ్డు యోగ్యత పరంగా వెహికల్ ఇండియా మార్కెట్ అవసరాలకు సరిపోతుందని సదరు ప్రభుత్వ శాఖ నిర్దారించాలి.ప్రపంచంలోనే భారత్ మూడో అతి పెద్ద కార్ల మార్కెట్. అమెరికాన్ కంపెనీ టెస్లా అడుగుపెట్టడానికి ట్రై చేస్తూనే ఉంది. దీనికి సంబంధించిన ఇరుపక్షాల మధ్య ఒప్పందాలు పూర్తయ్యాయి.కాబట్టి త్వరలోనే టెస్లా కార్లు మన దేశంలోకి అమ్మకానికి రాబోతున్నాయి. అయితే టెస్లా తయారీ ప్లాంట్ ఇండియాలో ప్రారంభిస్తారా?.. లేదా? అనే దానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి అందుబాబులో లేవు. ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు.. ‘మోడల్ 3’ ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (భారత మార్కెట్లో సుమారు రూ.30.4 లక్షలు). ఇండియాలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో కలిపి ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35నుంచి 40 లక్షలుగా తయారైంది. టెస్లా మోడల్ వై ధరలు రూ.70 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 Read also:ఒక్క ఆర్డర్ తో 41దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్.

న్యూఢిల్లీ,  మార్చి 18
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారం చేపట్టిన తర్వాత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రభుత్వం త్వరలో 41 దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించాలని పరిశీలిస్తోంది. పదుల కొద్ది దేశాల పౌరుల పై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు ఇంటర్నల్ మెమో డజన్ల కొద్దీ దేశాల పౌరులపై ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తన నివేదికలో తెలిపింది.ఇందుకు సంబంధించి ఇంటర్నల్‌ మెమో ఒకటి బయటికొచ్చింది. ఈ మెమోరాండంలో 41 దేశాల లిస్ట్ ఉంటుంది.ఈ దేశాలన్నింటినీ మూడు వేర్వేరు గ్రూపులుగా విభజించారు. ఈ జాబితాలో పాకిస్తాన్ పేరు కూడా ఉంది. ఇందువల్ల పాక్ పౌరులు ఇక మీదట అమెరికాలో అడుగు పెట్టలేరు. ఫస్ట్ గ్రూపులో 10 దేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా. ఈ దేశాల పౌరులకు వీసాలు పూర్తిగా బ్యాన్ చేయనున్నారు.రెండో గ్రూపులో ఐదు దేశాలు ఉన్నాయి: ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్. ఈ దేశాలు పాక్షిక నిషేధాన్ని ఎదుర్కోనున్నాయి. ఇది టూరిజం, స్టూడెంట్ వీసాలతో పాటు ఇతర వలస వీసాలను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉండవచ్చు.మూడో గ్రూపులో బెలారస్, పాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ వంటి దేశాలు సహా 26 దేశాలు ఉన్నాయి.
ఈ దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంపై పాక్షిక నిషేధం ఉండనుంది. అయితే, ఈ దేశాలకు 60 రోజుల్లోపు భద్రతా లోపాలను తొలగించే అవకాశం ఇవ్వనున్నాయి.ఈ జాబితాలో మార్పులు సాధ్యమేనని ఓ అమెరికన్ అధికారి తెలిపారు. అంటే ఇంకా కొన్ని కొత్త దేశాలను యాడ్ చేయవచ్చు.. లేకపోతే కొన్ని దేశాలను తొలగించవచ్చు. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాతే తుది జాబితా రిలీజ్ అవుతుంది.ట్రంప్ పరిపాలన వీసా ఆంక్షలు విధిస్తే అదేమీ కొత్త విధానం కాదు. తన మొదటి టర్మ్ లో డొనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించారు. దీనిని 2018లో సుప్రీంకోర్టు సమర్థించింది. అధ్యక్షుడైన వెంటనే డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇది అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకునే విదేశీ పౌరుల భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేయాలని పిలుపునిచ్చింది.ఈ ఉత్తర్వు ప్రకారం మార్చి 21 నాటికి అనేక మంది క్యాబినెట్ సభ్యులను దేశాల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. ఆ దేశాల పౌరులట్రావెల్ ను పాక్షికంగా లేదా పూర్తిగా నిషేధించాలని చూస్తున్నారు. స్క్రీనింగ్ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు కనుగొన్న దేశాలను చేర్చడానికి ఇది ఉద్దేశించింది. ఇది కాకుండా అక్టోబర్ 2023లో ఇచ్చిన ప్రసంగంలో అమెరికా భద్రత దృష్ట్యా గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్, ఇతర సున్నితమైన ప్రాంతాల నుండి వచ్చే ప్రజలను నిషేధిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.

Related posts

Leave a Comment