New Delhi:మళ్లీ కవ్విస్తున్న చైనా

China has once again engaged in provocative actions.

New Delhi:మళ్లీ కవ్విస్తున్న చైనా:భారత్‌–చైనా సరిహద్దు వివాదం పరిష్కారానికి చర్చలు జరుగుతున్న వేళ, చైనామరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. లద్దాఖ్‌ భూభాగంలోని కొంత ప్రాంతంలో రెండు కొత్త కౌంటీలుహెఆన్‌, హెకాంగ్‌ఏర్పాటు చేస్తున్నట్లు 2024 డిసెంబర్‌ 27న చైనా ప్రకటించింది. ఈ కౌంటీలు న్‌జియాంగ్‌లోని హోటన్‌ ప్రిఫెక్చర్‌లో ఉన్నప్పటికీ, వీటిలో కొంత భాగం భారత్‌ లద్దాఖ్‌లోని అక్సాయ్‌ చిన్‌లోకి చొచ్చుకొస్తుందని కేంద్రం ఆరోపిస్తోంది. దీనిపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ దురాక్రమణను ఎన్నటికీ సహించబోమని స్పష్టం చేసింది.

మళ్లీ కవ్విస్తున్న చైనా

న్యూఢిల్లీ, మార్చి 25
భారత్‌–చైనా సరిహద్దు వివాదం పరిష్కారానికి చర్చలు జరుగుతున్న వేళ, చైనామరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. లద్దాఖ్‌ భూభాగంలోని కొంత ప్రాంతంలో రెండు కొత్త కౌంటీలుహెఆన్‌, హెకాంగ్‌ఏర్పాటు చేస్తున్నట్లు 2024 డిసెంబర్‌ 27న చైనా ప్రకటించింది. ఈ కౌంటీలు న్‌జియాంగ్‌లోని హోటన్‌ ప్రిఫెక్చర్‌లో ఉన్నప్పటికీ, వీటిలో కొంత భాగం భారత్‌ లద్దాఖ్‌లోని అక్సాయ్‌ చిన్‌లోకి చొచ్చుకొస్తుందని కేంద్రం ఆరోపిస్తోంది. దీనిపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ దురాక్రమణను ఎన్నటికీ సహించబోమని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌పార్లమెంట్‌లో ఇలా వెల్లడించారు: ‘‘చైనా కౌంటీల ఏర్పాటు మా దృష్టికి వచ్చింది. ఈ కౌంటీల్లో కొన్ని భాగాలు లద్దాఖ్‌ పరిధిలోని భారత భూభాగంలోకి వస్తాయి. ఈ అక్రమ ఆక్రమణను మేం ఎప్పుడూ అంగీకరించలేదు. భారత సార్వభౌమత్వంపై మా స్థిరమైన వైఖరిని ఈ చర్యలు మార్చలేవు, చైనా బలవంతపు ఆక్రమణకు చట్టబద్ధతనూ ఇవ్వలేవు.’’ ఈ విషయంలో భారత్‌ దౌత్య మార్గాల ద్వారా నిరసన తెలిపినట్లు ఆయన తెలిపారు.

చైనా ఈ కౌంటీలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను కూడా చేపడుతోందని, దీనిపై తమకు సమాచారం ఉందని విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్సాయ్‌ చిన్‌ను 1962 నుంచి చైనా నియంత్రిస్తున్నప్పటికీ, భారత్‌ దానిని తన భూభాగంగా భావిస్తుంది. ఈ కొత్త చర్యలు సరిహద్దు ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.చైనా చర్యలకు ప్రతిస్పందనగా, భారత్‌ సరిహద్దు మౌలిక సదుపాయాలపై దష్టి సారించింది. ‘‘గత దశాబ్దంలో సరిహద్దు అవసరాల కోసం బడ్జెట్‌ను పెంచాం. సరిహద్దు రహదారుల సంస్థకు మూడు రెట్లు అధిక నిధులు, సొరంగాలు, వంతెనల నిర్మాణం చేపట్టాం,’’ అని కీర్తివర్ధన్‌ సింగ్‌ వివరించారు. 2020 గల్వాన్‌ ఘర్షణల తర్వాత ఉద్విగ్నంగా ఉన్న సంబంధాల నేపథ్యంలో, చైనా ఈ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.

Read more:Tamil Nadu:తమిళనాడులోకి జనసేన

Related posts

Leave a Comment