New Delhi:ట్రంప్ మరో సంచలన నిర్ణయం

US President Donald Trump

New Delhi:ట్రంప్ మరో సంచలన నిర్ణయం:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన 2.0 పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సంచలన నిర్ణయాలతో అమెరికన్లను, ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికోపై సుంకాలు పెంచారు. ఏప్రిల్‌ 2 నుంచి ప్రపంచ దేశాలన్నింటిపై సుంకాలు విధిస్తామన్నారు. ఇప్పుడు దిగుమతి కార్లపైనా సుంకాలు విధించాలని నిర్ణయించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో తయారై యూఎస్‌లోకి దిగుమతయ్యే అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు బుధవారం వైట్‌హౌస్‌లో ప్రకటించారు.

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ, మార్చి 28
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన 2.0 పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సంచలన నిర్ణయాలతో అమెరికన్లను, ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికోపై సుంకాలు పెంచారు. ఏప్రిల్‌ 2 నుంచి ప్రపంచ దేశాలన్నింటిపై సుంకాలు విధిస్తామన్నారు. ఇప్పుడు దిగుమతి కార్లపైనా సుంకాలు విధించాలని నిర్ణయించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో తయారై యూఎస్‌లోకి దిగుమతయ్యే అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు బుధవారం వైట్‌హౌస్‌లో ప్రకటించారు. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి రానుంది. ‘అమెరికాలో తయారుకాని కార్లపై 25% సుంకం విధిస్తున్నాం. ఇది శాశ్వత చర్య. ఇక్కడ తయారయ్యే వాహనాలపై మాత్రం సుంకాలు ఉండవు. ఈ నిర్ణయం మా ఆర్థిక వృద్ధిని పెంచి, ఇప్పటివరకూ చూడని అభివృద్ధిని సాధిస్తుంది‘ అని ట్రంప్‌ వెల్లడించారు. ఈ ప్రకటనలో చైనాపై ప్రత్యేక దృష్టి సారించారు. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై తొలుత 10 శాతం సుంకం విధించిన ట్రంప్, ఆ తర్వాత దాన్ని 20 శాతానికి పెంచారు. ఇప్పుడు చైనాకు ఓ ఆసక్తికర ఆఫర్‌ ప్రకటించారు. ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను విక్రయిస్తే, సుంకాలను తగ్గించే అవకాశం ఉందని, అవసరమైతే ఒప్పంద గడువును కూడా పొడిగిస్తామని విలేకరులతో చెప్పారు.
టిక్‌టాక్‌పై అమెరికా ఇటీవల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. యూఎస్‌ నిబంధనలకు కట్టుబడనందుకు జనవరి గూగుల్, ఆపిల్‌ ప్లే స్టోర్ల నుంచి ఈ యాప్‌ను తొలగించాయి. అయితే, ట్రంప్‌ నిషేధ అమలును వాయిదా వేయడంతో టిక్‌టాక్‌ మళ్లీ యాప్‌ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో దీనికి 170 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. టిక్‌టాక్‌ కొనుగోలు గురించి ఎలాన్‌ మస్క్‌ పేరు వార్తల్లో వచ్చినా, ఆయన దాన్ని తోసిపుచ్చారు.ట్రంప్‌ ఇటీవల ‘సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌’ సృష్టించాలని ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ఆదేశించారు. ఈ ఫండ్‌తో టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని సూచించారు. ఈ నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వాణిజ్య విధానంలో ట్రంప్‌ దూకుడును చాటుతున్నాయి.

Read also:అమెరికా, భారత్ మధ్య చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన పరస్పర సుంకాలు ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో, భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు బుధవారం దిల్లీలో ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో అమెరికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్‌ను చైనా, కెనడా, మెక్సికోలతో పోల్చి చూడబోమని యూఎస్‌ స్పష్టం చేసింది. ఈ దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ, భారత్‌తో కేవలం సుంకాల సమస్య మాత్రమే ఉందని పేర్కొంది. ఈ సమస్యను ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి. ఈ చర్చల కోసం వాషింగ్టన్‌వాణిజ్య అధికారి బ్రెండన్‌ లించ్‌ తన బృందంతో భారత్‌కు చేరుకున్నారు. శుక్రవారం నాటికి ఇరు దేశాలు ఒక ఒప్పందానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ ఒప్పందం రెండు దేశాలకు సంతృప్తికరంగా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్‌లో వాషింగ్టన్‌కు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సుంకాలు, వాణిజ్యం, ఆర్థిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి.ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, మిత్ర దేశాలు, శత్రు దేశాలతో సంబంధం లేకుండా సుంకాలు విధిస్తున్నారు. భారత్‌ తమ వస్తువులపై భారీ సుంకాలు విధిస్తోందని ఆరోపిస్తూ, ఏప్రిల్‌(April) నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్ఇటీవల అమెరికా పర్యటనలో యూఎస్‌ వాణిజ్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. సుంకాల తగ్గింపు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించారుప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటనలో ట్రంప్‌తో దౌత్య, వాణిజ్య, రక్షణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ట్రంప్, సుంకాల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని, భారత్‌ అమెరికా దిగుమతులపై అధిక పన్నులు విధిస్తోందని, ఇకపై తాము కూడా అదే విధంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

Read more:Andhra Pradesh:సిద్థార్ధరెడ్డికి యువజన బాధ్యతలు

Related posts

Leave a Comment