Hyderabad:1000 కోట్లతో వరంగల్ కార్పొరేషన్ బడ్జెట్:గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) 2025–26 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ను ప్రతిపాదించింది. గతేడాది రూ.650.12 కోట్లతో గ్రేటర్ బడ్జెట్ పెట్టగా.. ఈసారి అంచనాలు భారీగా పెంచేసి రూ.1071.41 కోట్లతో ముసాయిదా బడ్జెట్ ప్రవేశ పెట్టారుఇందులో రూ.337 కోట్ల 38 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.728 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, రూ 600 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా సమకూరుతాయని అంచనా వేశారు.
1000 కోట్లతో వరంగల్ కార్పొరేషన్ బడ్జెట్
వరంగల్, మార్చి 21
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) 2025–26 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ను ప్రతిపాదించింది. గతేడాది రూ.650.12 కోట్లతో గ్రేటర్ బడ్జెట్ పెట్టగా.. ఈసారి అంచనాలు భారీగా పెంచేసి రూ.1071.41 కోట్లతో ముసాయిదా బడ్జెట్ ప్రవేశ పెట్టారుఇందులో రూ.337 కోట్ల 38 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.728 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, రూ 600 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా సమకూరుతాయని అంచనా వేశారు. ఈ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.బల్దియా సొంత ఆదాయం ద్వారా వచ్చే 337 కోట్ల 38 లక్షల రూపాయలలో 100 కోట్ల రూపాయలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది జీతభత్యాలు, 29 కోట్ల 92 లక్షల రూపాయలు పారిశుద్ధ్య నిర్వహణకు వినియోగించనున్నారు. మరో 34 కోట్ల 30 లక్షల రూపాయలు విద్యుత్తు చెల్లింపులు, 33 కోట్ల 74 లక్షల రూపాయలు గ్రీన్ బడ్జెట్, 41 కోట్ల 5 లక్షల రూపాయలు ఇంజనీరింగ్ విభాగానికి కేటాయించారు. 21 కోట్ల 15 లక్షల రూపాయలు సాధారణ నిర్వహణకు, కోటి 40 లక్షల రూపాయలు టౌన్ ప్లానింగ్ కోసం, కోటి 50 లక్షల రూపాయలు డిజాస్టర్ రెస్పాన్స్ కొరకు కేటాయించారు.
విలీన గ్రామాలు, బలహీనవర్గాలు నివసించే ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.24 కోట్ల 77 లక్షలు, అలాగే ప్రజా సౌకర్యాల కల్పన, పార్కుల అభివృద్ధి, జంతువధ శాలలు, వీధి వ్యాపారులు, వెండింగ్ జోన్లు, ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు రూ. 10 కోట్ల 40 లక్షలు, వార్డుల వారీగా అత్యవసర అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.39 కోట్ల 15 లక్షలు కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.187 కోట్ల స్టాంప్ డ్యూటీ ఫండ్స్ ను ముఖ్యమంత్రి మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఆ బడ్జెట్ పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ వర్కర్ల జీతభత్యాలు పెంచడానికి స్లమ్ ఏరియాల అభివృద్ధికి 1/3 బడ్జెట్ కేటాయించేందుకు తోడ్పడిందన్నారు.గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని, రాష్ట్ర రెండో రాజధానిగా డెవలప్ చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ అభివృద్ధిలో మనమంతా భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరాన్ని అన్నివిధాలా సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో టెల్ పార్క్ , విమానాశ్రయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్ట్రోమ్ వాటర్ డ్రైన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా వరంగల్ నగరాభివృద్ధికి అందరు సమష్టిగా కృషి చేయాలని కోరారు.గ్రేటర్ వరంగల్ పాలకవర్గం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యం గా ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన 13 విలీన గ్రామాలున్నాయని, వాటిని అభివృద్ధి పరిచేలా నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారుపరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. అభివృద్ధిలో కార్పొరేషన్కు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. బల్దియాలో అభివృద్ధి జరగాలంటే వివిధ పన్నుల ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని సూచించారు.
Read also:కటకటాల్లోకి నిమ్మకాయల బాబా
కరీంనగర్, మార్చి 21
ఎన్ని మోసాలు జరుగుతున్నా ఎంతమంది మోసపోతున్నా బాబాలపై నమ్మకాలు చచ్చిపోవడం లేదు. అందుకే దీన్నే అవకాశంగా తీసుకుంటున్న కేటుగాళ్లు బాబాల అవతారంలో జనాలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అలాంటి ఘటన సిరిసిల్లా జిల్లాలో వెలుగు చూసింది. నిమ్మకాయలతో ఆరోగ్యాలు బాగు చేస్తానని చెప్పే ఓ బాబా మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. ఆర్థిక, వ్యక్తిగత, మానసిక, ఆరోగ్య సమస్యలు నయం చేస్తామంటూ వేములవాడకు చెందిన ఓ వ్యక్తి బాబా అవతారం ఎత్తాడు. బాపు స్వామి పేరుతో స్థానికంగా ప్రజలను తన వద్దకు రప్పించుకొని మోసాలకు పాల్పడేవాడు. ఈ బాపు స్వామి నిజస్వరూపం తెలియని ప్రజలు అమాయకంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు బాపు స్వామి. పూజలు చేసి సమస్యలు లేకుండా చేస్తామని చెప్పి మహిళలను లోబరుచుకుంటున్నాడు. మంత్రించిన నిమ్మకాయలు ఇస్తే అన్నీ నయం అవుతాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. ప్రత్యేక పూజలు పేరుతో నిమ్మకాయలను ఇచ్చేవాడు. అందులో ఎవరికీ తెలియకుండానే మత్తుమందు చల్లేవాడు. దాని వాసన పీల్చే మహిళలు స్పృహతప్పి పడిపోయేవాళ్లు. అలాంటి వాళ్లపై లైంగిక దాడులకు పాల్పడేవాడు ఈ బాబా. ఆ దృశ్యాలను రికార్డు చేసి బాధితులను బ్లాక్ మెయిల్ చేసేవాడీ బాబా. చాలా మంది బాబా బాధితులు భయంతోనో వేర్వేరు కారణాలతో నోరు విప్పేందుకు భయపడేవాళ్లు. అయినా కొందరు పోలీసులు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. దొంగబాబాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. అందులో వందల మంది మహిళల వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బాబాను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరిలించారు. ఇలాంటి బాబాలను అసలు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read more:4.5 Crore Mobile Phones in Hyderabad | హైదరాబాద్ లో మూడున్నర కోట్ల జనాభా… 4.5 కోట్ల మొబైల్ ఫోన్లు