Hyderabad: తెలంగాణలో ఎన్డీయే.. ఎంట్రీ..

NDA..entry in Telangana..

Hyderabad: తెలంగాణలో ఎన్డీయే.. ఎంట్రీ..:పాత నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా? మళ్లీ చంద్రబాబు పేరు ప్రస్తావించడం దేనికి సంకేతం? తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలపడుతుందని ఆయన భావిస్తున్నారా? ఏపీలో చంద్రబాబు గెలుపునకు కూటమి కారణమని ఆయన ఎందుకు అన్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏదైనా వ్యూహం లేకుండా కెసిఆర్ అలా మాట్లాడరు. పైగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయడం లేదు. అటువంటి చంద్రబాబు ప్రస్తావన కెసిఆర్ తీసుకొచ్చారంటే తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం మాత్రం ఉంది.

తెలంగాణలో ఎన్డీయే.. ఎంట్రీ..

హైదరాబాద్, మార్చి 24
పాత నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా? మళ్లీ చంద్రబాబు పేరు ప్రస్తావించడం దేనికి సంకేతం? తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలపడుతుందని ఆయన భావిస్తున్నారా? ఏపీలో చంద్రబాబు గెలుపునకు కూటమి కారణమని ఆయన ఎందుకు అన్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏదైనా వ్యూహం లేకుండా కెసిఆర్ అలా మాట్లాడరు. పైగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయడం లేదు. అటువంటి చంద్రబాబు ప్రస్తావన కెసిఆర్ తీసుకొచ్చారంటే తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం మాత్రం ఉంది. తాను ఒంటరిగా అధికారంలోకి వస్తానని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు కూటమి కట్టడం ద్వారా అధికారంలోకి వచ్చారని చెప్పారు. దీని వెనకే అసలు అనుమానం కలుగుతోంది.కెసిఆర్ పదేపదే చంద్రబాబు ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. తెలంగాణలో చంద్రబాబు రాజకీయాలు చేయడం లేదు. కనీసం తన పార్టీ అధ్యక్షుడిని కూడా నియమించలేదు. మరి ఎందుకు కేసీఆర్ చంద్రబాబు జపం చేస్తున్నారు? ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న కూడా ఇదే. అయితే కెసిఆర్ లో ఒక భయం కనిపిస్తోంది. తెలంగాణలోనూ ఎన్డీఏ యాక్టివ్ అవుతుందన్న ఆందోళన ఆయనలో ఉంది. ఏపీలో కూటమి ప్రస్తావన తీసుకొచ్చారు అంటే.. రేపు తెలంగాణలో అదే కూటమి వస్తే తన పరిస్థితి ఏంటనేది ఆయన ఆందోళనగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ కూటమిలోకి కెసిఆర్ ఎంట్రీ ఉండదు. దానికి కారణం చంద్రబాబు. అందుకే ఆయన ఒక గట్టు కట్టుకుంటున్నారు. ముందుగానే కారణాలను అన్వేషిస్తున్నారు.

కెసిఆర్ ది ఉద్యమ పార్టీ. తెలంగాణఉద్యమం ఆ పార్టీకి రక్షణ కవచంలా పనిచేసింది. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆ పార్టీకి ఉండేది. అయితే స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత.. కెసిఆర్ పాలన చూసిన తర్వాత తెలంగాణ ఓటర్ల ప్రాధాన్యతలు మారిపోయాయి. ఫలితంగా బిఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గిపోతూ వచ్చింది. చివరకు పార్లమెంట్ ఎన్నికల నాటికి అది డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి చేరింది. బలంగా ఉన్నారనుకున్న ఉత్తర తెలంగాణలో దారుణ పరిస్థితి ఎదురయింది. బలంగా లేని దక్షిణ తెలంగాణలో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమి ఏర్పడితే మాత్రం ఆ రెండు ప్రాంతాల్లో పట్టు సాధించడం ఖాయం. కెసిఆర్ లో కూడా అదే భయం కనిపిస్తోంది. దానిని గుర్తించి కెసిఆర్ చంద్రబాబు పేరు పదేపదే ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాను ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తానని కేసీఆర్ ప్రకటించారు. అదే సమయంలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అలెర్ట్ చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి సక్సెస్ అయింది. తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ పార్టీతో జత కలిసేందుకు చంద్రబాబు హింట్ ఇచ్చినట్లు అయింది. ఇప్పటికే చెన్నై వేదికగా డీ లిమిటేషన్ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీతో పాలుపంచుకున్నారు కేటీఆర్. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని ఒక ఆప్షన్ గా ఎంచుకున్నారు. సో ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే అన్నట్టు.. కెసిఆర్ చంద్రబాబుపై కామెంట్స్ కూడా అలానే ఉన్నాయి.

Read more:Andhra Pradesh:శ్యామల ఔట్..?

Related posts

Leave a Comment