Hyderabad:హైడ్రాకు హైకోర్టు తలంటు పెద్దవాళ్లవి మీకు కనపించవా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పటికే వందల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అయితే హైడ్రా పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తుందని.. డబ్బున్న బిల్డర్లను వదిలేసి పేదల ఇండ్లను కూల్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. పలు సందర్భాల్లో హైకోర్టు హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైడ్రాకు హైకోర్టు తలంటు
పెద్దవాళ్లవి మీకు కనపించవా
హైదరబాద్, మార్చి 20
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పటికే వందల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అయితే హైడ్రా పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తుందని.. డబ్బున్న బిల్డర్లను వదిలేసి పేదల ఇండ్లను కూల్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. పలు సందర్భాల్లో హైకోర్టు హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఫైరయిందిపేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని.. పెద్దల నిర్మాణాలను తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? అని నిలదీసింది. సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా అని ప్రశ్నించింది. రికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పేపర్లలో ఫొటోలు వేయించుకోవడం కాదని.. సంపన్నులు ఉండే దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో ఆక్రమణలనూ తొలగించాలని.. అప్పుడే ప్రజాప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుందని అన్నారుహైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 6.10 ఎకరాల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ స్థానిక ఎమ్మార్వో జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ షామ్స్ ఫాతిమాఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వక్ఫ్ బోర్డు సీఈవో రాసిన లేఖ ఆధారంగా వాల్టా చట్టం కింద ఎమ్మార్వో నోటీసులు జారీ చేయటం చెల్లదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది కలుగజేసుకొని.. మీరాలం చెరువు ఆక్రమణలపై ఇప్పటికే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైందన్నారు. ఆ పిటిషన్‌లోని ఉత్తర్వుల ప్రకారం సదరు సర్వే నెంబర్లలోని ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.దీనిపై న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్ రెడ్డి స్పందిస్తూ.. ఒకప్పుడు హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్‌గా ఉండేదని.. అప్పుడు 2,200 చెరువులుటే ప్రస్తుతం 180 కూడా లేవని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెరువుల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటోందని.. కాకపోతే మురికివాడల్లోని పేదల అక్రమ నిర్మాణాలనే కాకుండా పెద్దలు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చాలని సూచించింది. అప్పుడే ప్రజలకు మేలు చేసినట్లవుతుందన్నారు. మీరాలం చెరువుకు సంబంధించి పిటిషనర్ అభ్యంతరాలు లేవనెత్తగా.. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ భూమి వక్ఫ్‌బోర్డుదని తేలితే ఆక్రమణల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు కాకుండా వక్ఫ్‌బోర్డుకు వదిలేయాలంటూ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూసేసింది.
Read also: గజ్వేల్ లోనూ రచ్చ
మెదక్, మార్చి 20 :ఎమ్మెల్యేగా గెలిచా. లక్షల్లో జీతం తీసుకుంటా. ప్రతిపక్ష నేతగా ఉంటా. ఫాంహౌజ్‌లోనే పడుకుంటా. అసెంబ్లీకి రాను. ప్రజల్లోకి రాను. గజ్వేల్ సమస్యలు పట్టించుకోను. అంతా నా ఇష్టం. నన్ను ఎవర్రా అడిగేది. ఇలా దొరతనంతో విర్రవీగే రోజులు పోయాయి. ప్రజలు తిరగబడే గడియలు వచ్చాయి. కేసీఆర్ అయితే ఏంది? గులాబీ దళపతి అయితే మాకేంది? మా ఎమ్మెల్యే.. మమ్మల్ని పట్టించుకోడా? అంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తిరగబడుతున్నారు గజ్వేల్ ప్రజలు.అవును, ప్రజలకు విసుగొచ్చింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిపించుకుని ఏడాది దాటేసింది. గడిచిన ఏడాదిలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫాంహౌజ్ గడీ దాటి బయటకు వచ్చింది లేదు. స్థానిక ప్రజలను కలిసింది లేదు. వారి గోడు విన్నది లేదు. ఎమ్మెల్యేగా జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఆ జీతం సొమ్ము 50 లక్షలకు పైనే ఉందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు కూడా. ఆ ప్రకటన చూశాక.. గజ్వేల్ ప్రజల్లో అసహనం తలెత్తింది. మా పన్నులతో జీతం తీసుకుంటూ.. మా ఎమ్మెల్యేగా పదవి అనుభవిస్తూ.. మమ్మల్ని పట్టించుకోరా అంటూ.. గజ్వేల్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు స్థానికులు & మల్లన్నసాగర్ నిర్వాసితులు.కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి టూలెట్ బోర్డు తగిలించారు. అంటే, ఆఫీసుకు కేసీఆర్ రారు కాబట్టి ఖాళీగా ఉన్నట్టే. అందుకే టూలెట్ బోర్డు పెట్టారు. వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అంటూ మరో బోర్డు కూడా గేటుకు కట్టారు. కేసీఆర్ కనిపించడం లేదు. మిస్సింగ్. అందుకే, వాంటెడ్ కేసీఆర్ అంటూ గజ్వేల్ పబ్లిక్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలతో బీజేపీ శ్రేణులు కూడా కలిసిరావడంతో.. కేసీఆర్ క్యాంప్ ఆఫీసు దగ్గర రచ్చ రచ్చ అయింది. ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. బీజేపీ కార్యకర్తలను, ప్రజలను కంట్రోల్ చేశారు.గజ్వేల్ ఇంత జరుగుతుంటే.. ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా స్పందించలేదు. కేసీఆర్ అంటే పార్టీ కేడర్ కు కూడా విసుగు పుట్టేసింది. తమకు అందుబాటులో ఉండని లీడర్ తమకెందుకు అనే నిర్ణయానికి వచ్చేశారు. గులాబీ బాస్ పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు గజ్వేల్ లో ఎన్నికలు వస్తే కేసీఆర్ కు డిపాజిట్ వచ్చుడు కూడా కష్టమే అంటున్నారు. అంతగా కేసీఆర్ పై వ్యతిరేకత నెలకొంది గజ్వేల్‌లో.గజ్వేల్‌లోనే అని కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఎన్నికలు అయ్యాక కేసీఆర్ ముఖం చూసిన వారు ఏ కొద్దిమందో. పబ్లిక్ లోకి రావాలంటే భయపడుతున్నారో.. ఓటమితో ముఖం చెల్లడం లేదే ఏమో.. కేసీఆర్ ఉనికే లేదు. అటు అసెంబ్లీలో మాట్లాడరు.. ఇటు ప్రజాక్షేత్రంలోకి రారు. గత పాలనలో జరిగిన లక్షల కోట్ల అవినీతి.. చేసిన అప్పులు.. ఫోన్ ట్యాపింగ్ అరాచకాలు.. కరెంట్, రేస్ కార్ స్కాంలు.. ఇలా ఎన్ని విమర్శలు ముంచెత్తుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ఎంతగా మాటలతో అటాక్ చేస్తున్నా.. కేసీఆర్ లో మాత్రం ఉలుకూలేదు.. పలుకూలేదు. అనేది నన్ను కాదులే అన్నట్టు ఫాంహౌజ్‌లో పడుంటున్నారు. ఆయన తరఫున కేటీఆర్, హరీశ్ రావులు మైకుల ముందు మాట్లాడుతున్నా.. గత అరాచకాలపై గళం విప్పాల్సింది కేసీఆరేగా. కొడుకు, అల్లుడు కాదుగా.. అనేది అధికారపక్షం వెర్షన్. ఇలా పొలిటికల్ ఫైట్ ఎలా ఉన్నా.. ఇప్పుడు గజ్వేల్ ప్రజల్లోనూ తిరుగుబాటు వస్తుండటం.. కేసీఆర్ క్యాంప్ ఆఫీసు ముట్టడించడం చిన్నవిషయమేమీ కాదు. ఈ అలజడి ముందుముందు ఉప్పెనలా మారి తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌పై తిరుగుబాటు రావడం ఖాయంగా కనిపిస్తోంది.