Hyderabad:సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మణుగడ కోసం కూనంనేని, కోదండరాం లకు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేత.:సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మనుగడ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ, కాంటాక్ట్ కార్మికులకు వేతన పెంపు, ఆదివాసి పల్లెలకు మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం స్పందించేలా చూడాలనీ, తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో చర్చించాలని పరిష్కార మార్గం చూపాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో హైదరాబాదులో సిపిఐ కార్యాలయం ముఖ్ధుమ్ భవన్ లో కొత్తగూడెం శాసనసభ్యులు, శాసనసభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు కి, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కి ఆయన స్వగృహంలో వినతి పత్రాలు
సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మణుగడ కోసం కూనంనేని, కోదండరాం లకు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేత.
మణుగూరు
సింగరేణి పరిరక్షణ, మణుగూరు ఏరియా మనుగడ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ, కాంటాక్ట్ కార్మికులకు వేతన పెంపు, ఆదివాసి పల్లెలకు మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం స్పందించేలా చూడాలనీ, తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో చర్చించాలని పరిష్కార మార్గం చూపాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో హైదరాబాదులో సిపిఐ కార్యాలయం ముఖ్ధుమ్ భవన్ లో కొత్తగూడెం శాసనసభ్యులు, శాసనసభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు కి, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కి ఆయన స్వగృహంలో వినతి పత్రాలు అందజేసినట్లు గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక దక్షిణాది పరిశ్రమలకు ఆయువుపట్టు సింగరేణి విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ఆధారిత ధర్మల్ పవర్ స్టేషన్లదే ఎనభై నాలుగు శాతానికి పైగా పై చేయి అని అదేవిధంగా కోల్ బెల్ట్ ప్రాంత అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిదనీ ప్రత్యక్షంగా పరోక్షంగా వేలమందికి ఉపాధి కల్పించడంతోపాటు కళకళలాడిన కోల్ బెల్ట్ ప్రాంతం కొత్త గనులు రాకపోగా ఉన్న గనులకు విస్తరణ అడ్డంకులు ఏర్పడడంతో కోల్ బెల్ట్ ప్రాంతం పూర్వ వైభవం పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి అని,సింగరేణి ఉద్యోగులకు మరియు కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది కుటుంబాలకు అభద్రతాభావం భావం నెలకొందన్నారు.
అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కూడా కొత్త గనులు ప్రారంభించలేదనీ. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి వెలికి తీస్తున్న గనులకు విస్తరణ అనుమతులు రాని పరిస్థితనీ మణుగూరు ఓసి విస్తరణ కై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పిసా గ్రామసభలలో రైతులు సానుకూలంగా స్పందించని పరిస్థితి కారణం భూములు కోల్పోతున్న కుటుంబాలలో ఒకరికి సింగరేణి ఉద్యోగం మరియు మెరుగైన ప్యాకేజీ ప్రకటించాలన్నది భూనిర్వాసితుల డిమాండ్ అని ఈ ప్రక్రియ జాక్యం కావడంతో మణుగూరు ఓసి విస్తరణ పై పలు అనుమానాలు తలెత్తడంతో మణుగూరు పట్టణ అభివృద్ధి గత వైభవానికి మసకబారు తోందని వ్యాపార లావాదేవీలు పడిపోవడమే కాకుండా భవనాల, ఇండ్ల స్థలాల రేట్లు కూడా గణనీయంగా తగ్గిపోయాయన్నారు. ఎక్కడ చూసినా మణుగూరు లో టూలెట్ బోర్డులు, హౌస్ ఫర్ సేల్ బోర్డులు దర్శనమిస్తున్నాయన్నారు.మణుగూరు ఓసి లో కూడా సింగరేణి పర్మినెంట్ కార్మికులకు మరియు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు తలెత్తుతున్నాయనీ.
రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణా పూర్తిగా స్తంభించిపోయిందనీ దీంతో మణుగూరు ప్రాంత కోల్ ట్రాన్స్ పోర్ట్ రంగం ఇబ్బందుల్లో ఉందనీ, లారీలు కొనుగోలు చేసిన అప్పులకు కిస్తీలు కూడా కట్టలేని దుస్థితిలో లారీ యజమానులు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మణుగూరు బొగ్గు పై ఆధారపడిన భారజల కర్మాగారం,భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లకు బొగ్గు దిగుమతి ఖర్చుతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో మణుగూరు ఓసి విస్తరణకు అడ్డంకులు తొలగించాలనీ సింగరేణి పరిరక్షణతో పాటు ఉభయ కుశలపరిగా రైతులను నొప్పించి కాకుండా వారిని మెరుగైన ప్యాకేజీ ద్వారా మెప్పించి భూమి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు వేతన పెంపుకై చర్యలు చేపట్టాలని, మణుగూరు కోల్ ట్రాన్స్ పోర్ట్ రంగానికి చేయూతనివ్వాలని,తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసి గూడాలలో తీవ్రమైన త్రాగు నీటి సమస్య ఉందని దీంతోపాటు రహదారులు విద్యుత్ సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాలు కల్పనకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. తమ వంతు కర్తవ్యం గా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Read more:Hyderabad:కోతులు..బాబోయ్.. కోతులు