Hyderabad:సన్న వడ్లకు రూ.500 బోనస్:రాష్ట్ర రైతులనుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని (బోనస్) చెల్లిస్తున్నాం. దీని వల్ల రాష్ట్రంలో సన్న రకాల వరిసాగు గణనీయంగా పెరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా, పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరుగకుండా, గంట గంటకూ వాతావరణ సూచనలను అటు రైతులకు, ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం.
సన్న వడ్లకు రూ.500 బోనస్
హైదరాబాద్
రాష్ట్ర రైతులనుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని (బోనస్) చెల్లిస్తున్నాం. దీని వల్ల రాష్ట్రంలో సన్న రకాల వరిసాగు గణనీయంగా పెరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా, పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరుగకుండా, గంట గంటకూ వాతావరణ సూచనలను అటు రైతులకు, ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం. అధునాతన డ్రైయర్లు, ధాన్యం క్లీనర్లు, తగినన్ని టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. 2024-25 ఖరీఫ్ సీజన్ లో పది లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు (10,35,484) మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి, పన్నెండు వేల ఐదు వందల పదకొండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు (12,511.76 కోట్లు) వారి ఖాతాలలో జమ చేయడమైనది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో, ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం.
వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్ లో 24,439 కోట్లు కేటాయించామన్నారు.
Read also:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనల వెల్లువ
హైదరాబాద్
ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎస్సీ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి నివాళిగా 2 నిముషాలు సీఎం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు మౌనం పాటించారు.