Hyderabad:తండ్రి బాటలో మహేష్ బాబు:నిర్మాతల హీరో అని అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ని పిలిచేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాతలకు కృష్ణ ఒక దేవుడు. ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే, మరుసటి సినిమాకు అదే నిర్మాతను పిలిచి ఉచితంగా సినిమా చేసేవాడు. కృష్ణ పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేస్తానని చెప్పినా అప్పట్లో కొంతమంది నిర్మాతలు ‘మా దగ్గర కొబ్బరి కాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవు సార్..ఏమి సినిమా తియ్యమంటారు చెప్పండి’ అని అనేవారట. అప్పుడు కృష్ణ తానే ఫైనాన్షియర్స్ ని పిలిపించి, ఇతనికి డబ్బులు ఇవ్వండయ్యా.., నేను గ్యారంటీ గా ఉంటాను అని సంతకాలు పెట్టేవాడట.
తండ్రి బాటలో మహేష్ బాబు
హైదరాబాద్, మార్చి 22
నిర్మాతల హీరో అని అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ని పిలిచేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాతలకు కృష్ణ ఒక దేవుడు. ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే, మరుసటి సినిమాకు అదే నిర్మాతను పిలిచి ఉచితంగా సినిమా చేసేవాడు. కృష్ణ పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేస్తానని చెప్పినా అప్పట్లో కొంతమంది నిర్మాతలు ‘మా దగ్గర కొబ్బరి కాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవు సార్..ఏమి సినిమా తియ్యమంటారు చెప్పండి’ అని అనేవారట. అప్పుడు కృష్ణ తానే ఫైనాన్షియర్స్ ని పిలిపించి, ఇతనికి డబ్బులు ఇవ్వండయ్యా.., నేను గ్యారంటీ గా ఉంటాను అని సంతకాలు పెట్టేవాడట. అలా నష్టపోయిన నిర్మాతలతో సినిమాలు చేసి, వాళ్లకు సూపర్ హిట్స్ ని అందించి వాళ్ళ జీవితాలను నిలబెట్టాడు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. దేశంలో ఏ హీరో అయినా ఇలా ఉంటాడా చెప్పండి?.కృష్ణ లాంటి అతి మంచి తనం చూపించకపోయిన, ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం నుండి నిర్మాతలను ఆదుకునేందుకు ఒక సరికొత్త పద్దతిని అనుసరిస్తున్నాడు. స్టార్ హీరోలందరూ అడ్వాన్స్ ఇస్తే కానీ డేట్స్ ఇవ్వని పరిస్థితి ఉన్న ఈరోజుల్లో, మహేష్ బాబు ఒక్క రూపాయి అడ్వాన్స్ కూడా తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాడట.
దూకుడు నుండి ఆయన ఇదే ఫార్ములా ని అనుసరిస్తూ ఉన్నాడు. సినిమా కి బిజినెస్ జరిగి, అది విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత మాత్రమే ఆయన వచ్చే లాభాల్లో వాటాలు తీసుకుంటాడట. నష్టాలు వస్తే తీసుకోడట. ఇప్పుడు రాజమౌళి తో చేస్తున్న సినిమా విషయం లో కూడా ఆయన ఇదే ఫార్ములా ని అనుసరిస్తున్నాడు. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక లాభాల్లో 35 శాతం మహేష్ కి వెళ్తుంది. ఈ సినిమా బంపర్ హిట్ అయితే మహేష్ బాబుకు వందల కోట్ల రూపాయిలు వచ్చి చేరుతాయి.ఫ్లాప్ అయినా కూడా వస్తాయి కానీ, అది చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఉంటుందట. మహేష్ బాబు లాగా మిగతా హీరోలు ఎందుకు చేయకూడదు?, నిర్మాతల మేలు కోరి అడ్వాన్స్ తీసుకోకుండా ఉండలేరా. ఒక హీరోకి అడ్వాన్స్ ఇస్తే, సదరు నిర్మాత ఆ సినిమా పూర్తి అయ్యి బిజినెస్ జరిగే వరకు వడ్డీలు కడుతూ ఉండాలి, ఎంత నష్టం మీరే ఆలోచించండి?, అదే హీరోలు అడ్వాన్స్ తీసుకోకుండా చేస్తే నిర్మాతకు బోలెడంత ఒత్తిడి తగ్గుతుంది. నిర్మాత లేనిదే సినిమా లేదు, సినిమా ఇండస్ట్రీ లేదు. నిర్మాత దేవుడితో సమానం అంటారు, మన మానవ జాతి మనుగడకు రైతు ఎంత ముఖ్యమో, సినీ ఇండస్ట్రీ కి నిర్మాత కూడా అంతే ముఖ్యం. అలాంటి నిర్మాతను మహేష్ బాబు తరహాలో అలోచించి ఇతర స్టార్ హీరోలు కూడా అనుసరిస్తారో లేదో చూడాలి.
Read more:Bangalore:కర్ణాటకలో లైంగిక విద్య.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు