Hyderabad:క్రాస్ రోడ్స్ లో తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna at the Crossroads

Hyderabad:క్రాస్ రోడ్స్ లో తీన్మార్ మల్లన్న:తీన్ మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. కాంగ్రెస్ పార్టీ నుంచి తాజాగా బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ. కులగణన సర్వేని బహిరంగంగా తగులబెట్టి అధిష్టానం ఆగ్రహనికి గురైన మల్లన్న, తేగేవరకూ లాగి చివరకు అధికార కాంగ్రెస్‌కు దూరమయ్యారు. కానీ ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయబోనంటూ, అలా కంటిన్యూ అవుతున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఎమ్మెల్సీ మల్లన్న, ఆ తీన్‌మార్ మల్లన్నేనా అనేంతలా పరిస్థితులు మారిపోయాయి.

క్రాస్ రోడ్స్ లో తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మార్చి 20
తీన్ మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. కాంగ్రెస్ పార్టీ నుంచి తాజాగా బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ. కులగణన సర్వేని బహిరంగంగా తగులబెట్టి అధిష్టానం ఆగ్రహనికి గురైన మల్లన్న, తేగేవరకూ లాగి చివరకు అధికార కాంగ్రెస్‌కు దూరమయ్యారు. కానీ ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయబోనంటూ, అలా కంటిన్యూ అవుతున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఎమ్మెల్సీ మల్లన్న, ఆ తీన్‌మార్ మల్లన్నేనా అనేంతలా పరిస్థితులు మారిపోయాయి. లేకా పరిస్థితులకు అనుకూలంగా మల్లన్న మారిపోయారా అనిపిస్తోంది ఆయనను దగ్గరగా గమనిస్తున్నవారికి. తాజాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. మండలికి పంపిన బిల్లు సైతం ఆమోదం పొందింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..ఏ కులగణన సర్వే తప్పుల తడక అంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై దుమ్మెత్తిపోశాడో మల్లన్న, అదే కులగణన సర్వే ఆధారంగా బీసీలకు కేటాయించిన 42శాతం రిజర్వేషన్లకు మాత్రం మద్దతు తెలిపేశారు. బీసీ జనాభా సర్వేలో తగ్గించారు. లక్షల మంది బీసీలు, బతికున్న చనిపోయినట్లుగా సర్వేలో తప్పుడు లెక్కులు చూపించారు అంటూ రోజుల తరబడి ప్రచారం చేసిన మల్లన్నకు ఇప్పుడు ఏమైంది. కులగణన సర్వేపై ఆగ్రహంతో ఆ ప్రతులు కాల్చివేసి, బహిరంగంగా చేసిన విమర్శలే కదా మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యేలా చేసింది.

జరిగిన నష్టం జరిగిపోయిన తరువాత ఇప్పడు మళ్లీ సర్వే ఆధారంగా కేటాయించిన రిజర్వేషన్లపై మల్లన్న ఎందుకు మెత్తబడ్డారు. బీసీలకు మద్ధతుగా ఒక్క గొంతు అరచి గీపెట్టుకున్నా ఫలితం లేదు అనుకుని సర్దుకుపోయారా, లేక ఒకవేళ తాను బిల్లును వ్యతిరేకిస్తే ఎవరైతే తన బలంగా భావించి రాజకీయాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నాడో అటువంటి బిసిలను దూరం చేసుకుంటే రాజకీయం మనుగడ కష్టమని భావించారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడిగింది ఎలాగో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వదు, ఇచ్చిన దానితోనే సర్దుకుపోదామని వెనక్కి తగ్గారు అనే వాదలు కూడా ఉన్నాయి. ఇలా మల్లన్న నాలుక మడతపెట్టడంపై రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా… బిసిలకు వ్యతిరేకత లేకండా సేఫ్ గేమ్ అడుతున్నారని అర్ధమవుతోంది. తాజాగా కేటిఆర్‌ను మల్లన్న అసెంబ్లీ లాబీలో కలవడం పెనుదుమారం రేపింది. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు రోజూ కేసిఆర్, కేటీఆర్,హరీష్‌రావు ఇలా గత ప్రభుత్వాన్ని తిట్టినతిట్టు తిట్టకుండా తన సోషల్ మీడియా వేదికపై దుమ్మెత్తిపోశారు మల్లన్న. ఆయన చేసిన ఆరోపణలు అన్నీఇన్నీ కాదు, ఒక్కమాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం కూలిపోవడంలో మల్లన్న విమర్శలు సైతం కొంతవరకూ పని చేశాయి. ఇప్పుడు కేటీఆర్‌ను కలిసిన మల్లను చూస్తుంటే తీన్‌మార్ మల్లనేనా అనిపిస్తోంది.

బిసి బిల్లుకు బిఆర్‌ఎస్ మద్ధతు కోరడంతోపాటు జంతర్‌మంతర్ దీక్షకు రావాలంటూ కేటీఆర్‌ను ఆహ్వానించడం, గతం గతః అన్నట్లు కేటీఆర్ సైతం నవ్వుతూ మల్లన్నతో మంతనాలు చేయడం చూస్తున్నవారు సైతం షాకైయ్యారు. బిఆర్ఎస్ మద్దతు ఎలాగో కాంగ్రెస్ కోరుతుంది. కానీ పని గట్టుకుని మల్లన్న కేటీఆర్‌ను కలవడం చూస్తుంటే బిఆర్‌ఎస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారా అనే టాక్ కూడా వినిపిస్తోింది. ఇదిలా ఉంటే మల్లన్న తాజాగా వ్యహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు లేకపోలేదు. రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మల్లన్న ఉన్నట్లుండి ఎందుకిలా మారిపోయారు. బిఆర్ఎస్‌ను పొట్టుపొట్టున తిట్టి, రేవంత్కు జాన్ జిగిరి అయ్యాడు. మరి ఉన్నట్లుండి ఇలా రేవంత్‌కు రామ్‌రామ్ చెప్పి బిఆర్‌ఎస్ నేతలతో మంతనాలు చేయడానికి అంత వ్యక్తిగత కారణాలు లేవు. అలా అని బిసిల కోసమే అంటే ఇప్పడు ఇచ్చిన రిజర్వేషన్‌తో సరిపెట్టకుంటూ సై అంటున్నారు. ఇలా ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి చెప్పినట్లు మల్లన్న పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు అందుకే కటీఫ్ చెప్పినట్లే చెప్పి, కార్యాచరణ మాత్రం అమలు చేస్తున్నారానే విమర్శలు వినిపిస్తున్నాయి

Read also:చికెన్, మటన్ లలో కల్తీ

హైదరాబాద్, మార్చి 20,
ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. మాంసాహారులకు ఇష్టమైన చికెన్, మటన్, చేపలు వీటిలో ఏదో ఒకటి ఆ రోజు ఇంట్లో ఉడకాల్సిందే. ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు ఉదయం నుంచే ఆ దుకాణాలు ముందు బారులుదీరుతుంటారు. కొన్ని చోట్ల అయితే పొడవాటి క్యూలు దర్శనం ఇస్తుంటాయి. ఇటీవల బర్డ్ ఫ్లూ భయం ఎక్కువగా ఉండడంతో చాలా మంది చికెన్ కు బదులు మేక మాంసం కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించకుండానే మాంసం విక్రయిస్తున్నారు. అసలు ఆ జీవాలు సురక్షితమేనా.. పోనీ కోసిన మటన్ అన్నా ఫ్రెష్ దేనా అన్నది వినియోగదారులు ఓ సారి పరిశీలించాలి.మాంసాహారులకు ఇష్టమైన చికెన్, మటన్లను కల్తీ చేస్తూ కొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారి షాపులపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించని షాపులను అధికారులు సీజ్ చేస్తున్నారు.గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో లైసెన్స్‌ లేకుండా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్న వాటిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల బృందం కొన్ని చోట్లు భారీ ఎత్తున మాంసాన్ని పట్టుకుని సీజ్ చేశారు.బర్డ్‌ఫ్లూ భయం పెరిగిపోవడంతో ప్రజలు జీవాలు, చేపల మీద ఆసక్తి చూపిస్తున్నారు.

అదే అదునుగా కొందరు రూల్స్ అతిక్రమించి విక్రయాలు చేస్తున్నారు. కిలోకు ఏకంగా ధర రూ.100-200 పెంచేశారు. ఎక్కడో కోసి నగరానికి తీసుకొచ్చి దుకాణాల్లో విక్రయిస్తున్నారు.అసలు అవి బతికి ఉన్నాయా.. లేక చనిపోయిన వాటిని తెచ్చి అమ్ముతున్నారా అన్న విషయం కూడా గోప్యమే.హైదరాబాద్ మంగళహాట్ చిస్తీ చమాన్ లో ఓ మేక మాంసం దుకాణం పై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ సర్కిల్ 14 ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి మహమ్మద్ అఫ్రోజ్ (40)అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద పాయ, తలకాయ, బ్రెయిన్, కిడ్నీ, మేక గొర్రె లివర్ సుమారు 12 టన్నుల బీఫ్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.8లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అఫ్రోజ్ చెడిపోయిన మేక గొర్రెల మాంసాన్ని చిస్తీ చమాన్ లోని దుకాణం లో ఫ్రిజ్ లో నిల్వ చేసి తక్కువ ధరకే హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read more:Hyderabad:మహానగరానికి మంచినీటి గండం

Related posts

Leave a Comment