Hyderabad:కోతులు..బాబోయ్.. కోతులు:ఇప్పుడు పంటలు సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు. వరి మినహా.. ఇతర పంటలు సాగు చేయాలేకపోతున్నారు. ఇప్పుడు వరిపై కూడా దాడి చేస్తున్నాయి. వరి చేలపై దాడి చేస్తున్న వానరాలు, పొట్ట దశలోనే తింటున్నాయి. కోతులు భయానికి.. కూరగాయాలతో పాటు వేరుశనగ, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు లాంటి పంటలు వేయలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులకు కొత్త సమస్య తలెత్తుతోంది.
కోతులు..బాబోయ్.. కోతులు
కరీంనగర్, మార్చి 20
ఇప్పుడు పంటలు సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు. వరి మినహా.. ఇతర పంటలు సాగు చేయాలేకపోతున్నారు. ఇప్పుడు వరిపై కూడా దాడి చేస్తున్నాయి. వరి చేలపై దాడి చేస్తున్న వానరాలు, పొట్ట దశలోనే తింటున్నాయి. కోతులు భయానికి.. కూరగాయాలతో పాటు వేరుశనగ, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు లాంటి పంటలు వేయలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులకు కొత్త సమస్య తలెత్తుతోంది. దాదాపు 250కు పైగా గ్రామాల్లో కోతులు బెడద తీవ్రమైంది. ఇటీవల గ్రానైట్ తవ్వకాల కారణంగా కొండల్లో ఉండాల్సిన కోతులు గ్రామాల్లోకి చేరిపోయాయి. ఇక తిండి కోసం యుద్ధం చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో వీటి సంతానం భారీగా పెరిగిపోయింది. మనుషుల కంటే.. కోతుల సంఖ్యనే ఎక్కువగా కనబడుతుంది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో.. వేరుశనగ, మొక్కజొన్న, కంది, పెసర్లు, బబ్బెర్లు, మినుము, ఇతర ఆరుతడి పంటలను సాగు చేసేవారు. ఇటీవల మొక్కజొన్న మినహా మిగతా పంటలకు మద్దతు ధరను పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ పంటలను సాగు చేద్దామంటే, కోతులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి పంటలు సాగు చేసే అవకాశం ఉన్న ఎర్ర నేల భూములు కూడా.. నారుమల్లుగా మారిపోతున్నాయి. అంతేకాదు, ఇప్పుడు బీడుగా పెడుతున్నారు.
భారీ వర్షం కురిస్తే మాత్రం నాటు వేయనున్నారు. ఆరు తడి పంటలు వేయాలంటేనే రైతులు జంకుతున్నారు.పంటపొలాలపై కోతులు దాడి చేసి నాశనం చేస్తున్నాయి. ఒక్క వేళా విత్తనాలు వేసిన వెంటనే తినేస్తున్నాయి. కష్టంగా కాపాడిన.. పంట చేతికి వచ్చే సమయంలో మళ్లీ దాడులు చేసే తినేస్తున్నాయి. దాదాపు ఇలాంటి పంటలను సాగు చేయడం మానేశారు రైతులు. ఒక కూరగాయల సాగు కూడా చేయడం లేదు. కూరగాయాలు చేతికొచ్చే సమయానికి.. మొత్తం తినేస్తున్నాయి కోతులు. చివరకు.. మిర్చిని కూడా తింపి కింద పడవేస్తున్నాయని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ముఖ్యంగా మానకొండూరు, తిమ్మాపూర్, శంకరపట్నం. చిగురుమామిడి, రామడుగు, గంగాధర, మల్యాల, కొడిమ్యాల తదితర మండలాల్లో అధికంగా ఉన్నాయి కోతులు.కోతుల భయానికి ఇతర పంటలు వేస్తున్నారు రైతులు. ఈ సంవత్సరం కోతుల ప్రభావం ఉన్న గ్రామాల్లో వరి మినహా.. ఇతర పంటలు వేయడం లేదు. పప్పుదినుసులకు మద్దతు ధర ఉన్నా.. సాగు చేసుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కోతులను పట్టుకుని దట్టమైన ప్రాంతాల్లో వదిలిపెట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. కోతుల కారణంగా కూరగాయాల సాగుతో పాటు వరి మినహా.. ఇతర పంటలను సాగు చేసుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. కోతులను తరిమేసిన పంటలను కాపాడాలని రైతన్నలు వేడుకుంటున్నారు..
Read also:కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
కరీంనగర్
మానకొండూర్ నియోజకవర్గంలో అధికార విపక్ష పార్టీలు కాంగ్రెస్- బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అవినీతికి పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించడంతో, ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చకు రావాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఆరు మండలాల నుంచి బెజ్జంకి కి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని రసమయి రావాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్- బీఆర్‌ఎస్ హంగామాతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. కొందరు రసమయి ఫామ్ హౌస్ వైపు దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరోవైపు బిఆర్ఎస్ శ్రేణులు పరస్పర ఆరోపణలు విమర్శలతో ఆందోళన దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ ఇరుపార్టీల నాయకులను కార్యకర్తలను అరెస్టు చేశారు.అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా కాలువ నీళ్ళను గుండారంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్ కు రసమయి తరలించుకుపోయాడని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రసమయి తీరుపై ఆరు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పై చేసిన ఆరోపణలు నిరూపించకుంటే తరిమికొట్టక తప్పదని హెచ్చరించారు.
బహిరంగ చర్చకు రాకుంటే ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామన్నారు.మాజీ ఎమ్మెల్యే రసమయి తోపాటు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ వైఖరిని ఎండ గట్టేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. బెజ్జంకి మండలం గుండారంలోని ఫామ్ హౌస్ లో ఉన్న రసమయిని గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ తీరు, ఎమ్మెల్యే వైఖరిపై రసమయి బాలకిషన్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను చేసిన ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని విచారణ జరిపిస్తే అన్ని బయటపడుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి 6 మండలాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు తన ఫామ్ హౌస్ పై దాడి చేసి తనను చంపేందుకు ఉసిగొలిపాడని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా మానకొండూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మద్యం మాటల యుద్ధం కొనసాగుతుంది. చివరకు బహిరంగ చర్చకు సవాళ్ళ పర్వం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు పార్టీల శ్రేణులను అరెస్టు చేసిన పోలీసులు తాత్కాలికంగా ఆందోళనకు కట్టడి చేశారు. ఇరు పార్టీలు తగ్గేదేలేదంటు ఎంతటికైనా తెగించడంతో రాజకీయ పోరాటం ఎటువైపు దారి తీస్తుందోనని సర్వత్రా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Read more:Hyderabad:61 లక్షల ట్రావెల్ అలవెన్స్