Hyderabad:సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలి.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ:సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫిజిక్స్ విభాగం “మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్” అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. పరిశోధన ఫలితాలు సాధారణ పౌరులు, ముఖ్యంగా గిరిజనులను అందాలని అభిప్రాయపడ్డారు.
సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్
సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫిజిక్స్ విభాగం “మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్” అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. పరిశోధన ఫలితాలు సాధారణ పౌరులు, ముఖ్యంగా గిరిజనులను అందాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలిసి పనిచేయటం అత్యంత ముఖ్యమని.. అప్పుడే చౌకగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఆరోగ్యం, వైమానిక రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని… తద్వారా ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయని వివరించారు. ఓయూ ఫిజిక్స్ విభాగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ఓ వేదికగా మలచుకుని అనేక పరిశోధనలకు సంబంధించిన చర్చ జరగాలని… మరిన్ని కొంగ్రొత్త ఆలోచనలకు అంకురార్పణ జరగాలని ఆకాంక్షించారు.
సదస్సుకు అధ్యక్షత వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ… పరిశోధనల్లో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోందని అన్నారు.
Read also:నకిలీ కరాచీ గోరింటాకు స్వాధీనం
హైదరాబాద్
టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు టప్పాచబుత్ర పోలీసులు సంయుక్తంగా ఓ ఇంటిపై దాడి నిర్వహించి నకిలీ కరాచీ మెహందీ ని పట్టుకున్నారు. *యాసీన్ మరియు మోసిన్ అనే ఇద్దరు వ్యక్తులు నటరాజ్ నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ కరాచీ మహేంది తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. సుమారు 70 కార్టూన్ల మెహందీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర అక్షరాల ఐదు లక్షలు ఉంటుందని అంటున్నారు రంజాన్ పండుగ రానున్న సమయంలో ఈ నకిలీ మెహందీ ని మార్కెట్లో అమ్మడానికి తయారుచేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Read also:ప్రజలు ఉన్నంతకాలం కమ్యూనిజం వుంటుంది
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్
తాను టూరిజం డెవలప్మెంట్ చేయాలని చేసిన మాటలను ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు వక్రీకరించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం వల్ల టూరిజం ద్వారా నిధులు సమకూరుతాయని చెప్పానని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని అన్నారు.
గతం కంటే సజావుగా అసెంబ్లీ జరిగింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయం కంటే సజావుగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అందరికి మాట్లాడే అవకాశం లభించింది. గతంలో మాట్లాడే వారిని మార్షల్స్ తో బయటకు పంపించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… అందరికి అవకాశం ఇచ్చిన స్పీకర్ కు ధన్యవాదాలు.
బడ్జెట్ ఏమి కొత్తగా లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమి కొత్తగా లేదు.విద్య రంగానికి 14 శాతం నిధులు కేటాయించాలని అడిగాము… కానీ 8 శాతం మాత్రమే కేటాయించారు. నిధుల కొరత ఉందని కొన్ని రంగాలకే ప్రాధాన్యత ఇచ్చారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని సాకులు చెప్పడం కాకుండా… ఉన్న బడ్జెట్ ను ఎలా వినియోగించాలి అనే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎక్కువ హామీలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికి జరగడం లేదు. టెక్నీకల్ సమస్యలు ఉన్నాయని అంటున్నారు… వాటిని పరిష్కరించి రుణమాఫీ అయ్యేలా చూడాలి. అసంఘటిత కార్మికులకు కనీస వేతనం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. .
Read more:Hyderabad:రైజింగ్ లో రియల్ రంగం