Hyderabad:రైజింగ్ లో రియల్ రంగం

real estate

Hyderabad:రైజింగ్ లో రియల్ రంగం:హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందన్నది కేవలం ప్రచారం మాత్రమే. ధరలు ఏ మాత్రం తగ్గలేదు. కొనుగోళ్లు కొంత వరకూ తగ్గి ఉండవచ్చేమో కానీ, ఇతర నగరాలకంటే హైదరాబాద్ లో స్థిరపడాలనుకునే వారి సంఖ్య ఈరోజుకు కూడా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతంలోనూ భూముల ధరలు ఏమాత్రం తగ్గడం లేదన్నారు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే తెల్లాపూర్ లో చదరపు గజం ధర ఎనభై వేల రూపాయలు పలుకుతుంది.

రైజింగ్ లో రియల్ రంగం

హైదరాబాద్, మార్చి 28
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందన్నది కేవలం ప్రచారం మాత్రమే. ధరలు ఏ మాత్రం తగ్గలేదు. కొనుగోళ్లు కొంత వరకూ తగ్గి ఉండవచ్చేమో కానీ, ఇతర నగరాలకంటే హైదరాబాద్ లో స్థిరపడాలనుకునే వారి సంఖ్య ఈరోజుకు కూడా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతంలోనూ భూముల ధరలు ఏమాత్రం తగ్గడం లేదన్నారు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే తెల్లాపూర్ లో చదరపు గజం ధర ఎనభై వేల రూపాయలు పలుకుతుంది. నిజానికి రియల్ ఎస్టేట్ రంగం ఏ మాత్రం పడిపోయినా భూముల ధరలు పెరగవు.కనీసం స్థిరంగానైనా కొనసాగేవని రియల్ ఎస్టేట్ వ్యాపారులే చెబుతున్నారు.అయితే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రభావం కొంత రియల్ ఎస్టేట్ పై పడిందని కొందరు అంగీకరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయ కుటుంబాలపై ఎక్కువగా ప్రభావం చూపాయి.

దీంతో కొంత కొనుగోళ్లు ఈ ఏడాది జనవరి నెల నుంచి కొంత తగ్గింది వాస్తవమే అయినా పూర్తిగా పడిపోయాయన్నది.అవాస్తవమని, కేవలం బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పించి ఇంకా ధరలు భవిష్యత్ లో పెరుగుతున్నాయని తెలిపారు. ఇక ఫ్యూచర్ సిటీ సమీపంలోనూ ఇటీవల భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, అక్కడ ఎకరం పొలం ధర యాభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ పలుకుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజధానుల కల్లా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం నిత్యం రైజింగ్లోనే ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు నగరంలో కనీసం యాభై లక్షలకు డబుల్ బెడ్ రూం కొనలేని పరిస్థితి ఉందని, అక్కడి ట్రాఫిక్ తో పాటు తాగునీటి ఇబ్బందులు, భూగర్భజలాలు ఎండిపోవడం, వర్షాకాలంలో మునిగిపోవడం వంటివి హైదరాబాద్ లో లేని కారణంగా ఎక్కువ మంది స్థిరాస్థిపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అదే సమయంలో చెన్నై లాంటి నగరంలోని వాతావరణం కూడా సహకరించకపోవడంతో ఇప్పటికీ రియల్ ధరలు ఏమాత్రం తగ్గలేదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.

ఎప్పటికప్పుడు కొత్త వెంచర్లు పుట్టుకొస్తుండటమే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు. ఈ రెండు నగరాలు పరిధికి మించి విస్తరించడం కూడా హైదరాబాద్ లో కొనుగోళ్లు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. అయితే హైడ్రా వచ్చిన తొలినాళ్లలో కొంత రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పుడు అన్నీ సరిచూసుకుని, న్యాయవాదులతో సరి చూపించుకుని కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగా కనపడుతుందని తెలిపారు. మరోవైపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెరుగుతుందని మంత్రి చెప్పిన తర్వాత గత రెండు రోజుల నుంచి రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. గతంలో ఎన్ఆర్ఐలు కొంత ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేసినా తర్వాత తిరిగి గత రెండు నెలల నుంచి పుంజుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లితుందని, అయితే అన్ని సదుపాయలను, న్యాయపరంగా చిక్కులు ఏమీ లేవని తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తున్నందున కొంత ఆలస్యమవుతుందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు.

9 ప్లాట్ల వేలం రద్దు:

హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్లాట్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ప్లాట్లు వేలంలో సొంతం చేసుకున్న కొందరు డబ్బులు కట్టకపోవడంతో వేలం రద్దు చేయాలని హౌసింగ్ బోర్డు తాజాగా డిసైడ్ అయింది. గతేడాది డిసెంబరులో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో మిగిలిన ప్లాట్లను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 72 ప్లాట్లను వేలం వేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల 44 ప్లాట్లకు మాత్రమే వేలం వేశారు. వాటిలో కేవలం 19 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.పశ్చిమ జోన్‌లో మెుత్తం 12 ప్లాట్లు అమ్ముడుపోగా.. వాటిలో 9 ప్లాట్ల వేలం రద్దు చేయాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. రూల్స్ ప్రకారం.. వేలంలో ప్లాటు దక్కించుకున్న వారు అయిదు రోజుల్లో 25 శాతం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన డబ్బు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి. కానీ ముగ్గురు మాత్రమే పూర్తి డబ్బును చెల్లించారు. మిగిలిన వారు కొంత డబ్బు కట్టి వేలంలో పాల్గొన్నారు. ప్రస్తుతం వేలంపై తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోంది.

కోర్టు తీర్పు వచ్చాక రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులు అనుకుంటున్నారు. వేలం జరిగి రెండు నెలలు అయినా.. 9 మంది 25 శాతం కూడా డబ్బు కట్టలేదు. అందుకే ఆ ప్లాట్ల వేలం రద్దు చేయాలని తాజాగా నిర్ణయించారు. డబ్బులు చెల్లించిన వారికి నోటీసులు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు.ప్లాట్ల వేలంపై వివాదం.. అయితే, హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలంపై వివాదాలు నెలకొన్నాయి. గతేడాది వేలంపాట జరగ్గా.. ఫేజ్-15 నివాసితులు వ్యతిరేకించారు. వారు ప్లాట్ల వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వేలం వేసిన భూమిలో కొంత భాగాన్ని రోడ్డు విస్తరణ కోసం కేటాయించారని.. నిబంధనలను ఉల్లంఘించి ప్లాట్లను విక్రయిస్తున్నారని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. మొదట 80 నుండి 100 అడుగులకు రహదారిని విస్తరించాలని అనుకున్నా ప్రతిపాదిత రహదారిలోని 10 అడుగులను అమ్మకానికి పెట్టారని పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసు పూర్తయిన తర్వాత ప్లాట్లు దక్కించుకున్నవారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

Read more:New Delhi:ట్రంప్ మరో సంచలన నిర్ణయం

Related posts

Leave a Comment