Hyderabad : భారీగా పెరుగుతున్న జీవన ప్రమాణాలు

Along with increasing technology, living standards are also increasing.

Hyderabad : భారీగా పెరుగుతున్న జీవన ప్రమాణాలు:పెరుగుతున్న టెక్నాలజీతోపాటు.. జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు కంపెనీలు కూడా ఉద్యోగులకు మంచి వేతనాలే ఇస్తున్నాయి. కూలి రేట్లు కూడా భారీగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో జీవన ప్రమాణం పెరుగుతోంది.భారతదేశంలో జీవన వ్యయం(లివింగ్‌ కాస్ట్‌) పెరుగుతోంది. అత్యాధునిక సౌకర్యాలు, నిత్యావసర వస్తువుల ధర పెరుగుదల, అద్దెలు, పెట్రోల్‌ ధరలు, రవాణా చార్జీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీ ధర పెరిగింది. మరోవైపు వేతనాలు కూడా పెరిగియి. దీంతో మనుషుల జీవన ప్రమాణం కూడా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువగా ఉంటుంది.

భారీగా పెరుగుతున్న జీవన ప్రమాణాలు

హైదరాబాద్, మార్చి 24
పెరుగుతున్న టెక్నాలజీతోపాటు.. జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు కంపెనీలు కూడా ఉద్యోగులకు మంచి వేతనాలే ఇస్తున్నాయి. కూలి రేట్లు కూడా భారీగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో జీవన ప్రమాణం పెరుగుతోంది.భారతదేశంలో జీవన వ్యయం(లివింగ్‌ కాస్ట్‌) పెరుగుతోంది. అత్యాధునిక సౌకర్యాలు, నిత్యావసర వస్తువుల ధర పెరుగుదల, అద్దెలు, పెట్రోల్‌ ధరలు, రవాణా చార్జీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీ ధర పెరిగింది. మరోవైపు వేతనాలు కూడా పెరిగియి. దీంతో మనుషుల జీవన ప్రమాణం కూడా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువగా ఉంటుంది. లివింగ్‌ కాస్ట్‌ ఎక్కువగా ఉన్న నగరాలు సాధారణంగా మెట్రోపాలిటన్‌ నగరాలు, ఆర్థిక కేంద్రాలుగా పరిగణించబడతాయి. ఇవి గృహ ఖర్చులు, రవాణా, ఆహారం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల ఆధారంగా నిర్ణయించబడతాయి. దేశంలో లివింగ్‌ కాస్ట్‌ ఎక్కువగా ఉన్న కొన్ని ప్రధాన నగరాలు ఇక్కడ ఉన్నాయి.

ముంబై :
భారతదేశ ఆర్థిక రాజధానిగా పిలవబడే ముంబైలో గహ ఖర్చులు (రెంట్, రియల్‌ ఎస్టేట్‌ ధరలు) చాలా ఎక్కువ. ఇక్కడ జీవనశైలి, రవాణా, వినోద ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా పరిగణించబడుతుంది.

న్యూ ఢిల్లీ :
రాజధాని నగరంగా, ఢిల్లీలో గృహ ఖర్చులు, రవాణా, మరియు జీవన సౌకర్యాలు ఖరీదైనవి. ఇక్కడ అధునాతన సౌకర్యాలు, విద్యా సంస్థలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల జీవన వ్యయం పెరుగుతుంది.

బెంగళూరు : 
ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో గత కొన్నేళ్లలో జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. అద్దెలు, రవాణా, ఆహార ఖర్చులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా ఐటీ ప్రాంతాలైన వైట్‌ఫీల్డ్, కోరమంగళలలో జీవన ప్రమాణం చాలా ఎక్కువ.

చెన్నై :
దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన చెన్నైలో గృహ ఖర్చులు, జీవన సౌకర్యాలు సాపేక్షంగా ఎక్కువ. ఇది వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి.

హైదరాబాద్‌ :
ఐటీ, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో జీవన వ్యయం ఇటీవలి సంవత్సరాల్లో పెరిగింది. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అద్దెలు, జీవన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.

పూణే :
విద్యా, ఐటీ, మరియు తయారీ రంగాలకు కేంద్రంగా ఉన్న పూణేలో జీవన వ్యయం క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ అద్దెలు, రవాణా, జీవనశైలి ఖర్చులు గణనీయంగా ఉంటాయి.

కోల్‌కతా :
తూర్పు భారతదేశంలోని ప్రధాన నగరమైన కోల్‌కతాలో జీవన వ్యయం ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొంత తక్కువ అయినప్పటికీ, ఇటీవలి అభివృద్ధి వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి.

విశ్లేషణ ఇలా..
ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని న్యూ ఢిల్లీ సాధారణంగా అగ్రస్థానంలో ఉంటాయి, ఎందుకంటే ఇవి ఆర్థిక, రాజకీయ కేంద్రాలు మరియు జనాభా సాంద్రత ఎక్కువ. బెంగళూరు మరియు హైదరాబాద్‌ వంటి ఐటీ నగరాలు ఉద్యోగ అవకాశాలు మరియు ఆధునిక జీవనశైలి వల్ల ఖరీదైనవిగా మారాయి. ఈ నగరాల్లో జీవన వ్యయం ప్రాంతం, జీవనశైలి, మరియు వ్యక్తిగత ఎంపికలపై ఆధారపడి మారవచ్చు.

Read also:కేసీఆర్ ధీమా….ఏంటీ

హైదరాబాద్, మార్చి 24
మళ్లీ నేనే సీఎం.. రాస్కో సాంబా.. అంటూ గబ్బర్‌సింగ్ రేంజ్‌లో డైలాగులు కొడుతున్నారు కేసీఆర్. ఫాంహౌజ్‌లో తనను కలిసిన బీఆర్ఎస్ నాయకుల ముందు మాటల గారడీ చేస్తున్నారా? కేడర్‌ను కాపాడుకునేందుకు తనదైన స్టైల్‌లో కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మాయల మరాఠీ, టక్కుటమారం విద్యలు ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ చెప్పే ముచ్చట్లు.. ఆయన ముచ్చట తీర్చేనా?కేసీఆర్ లేటెస్ట్ కామెంట్స్ పొలిటికల్‌గా కాక రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్‌దే అన్నారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు సీఎం అయ్యేవారే కాదని.. తాము మాత్రం సింగిల్‌గా పవర్‌లోకి వస్తామని చెప్పారు. ఆనాడు మోదీ తన మెడపై కత్తి పెట్టినా.. తెలంగాణ కోసం తాను ఎక్కడా వెనకడుగు వేయలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని ఆరోపించారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని.. ఇప్పుడు తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు.కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కస్సున లేచారు.

బీఆర్ఎస్ కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచండి.. మీరేమో ఫాంహౌజ్‌లోనే ఉండండి అంటూ సెటైర్లు వేశారు. మీరు ఎన్ని కలలు కన్నా.. అధికారంలోకి రావడం అసంభవం అని తేల్చి చెప్పారు సీతక్క.అటు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం గులాబీ బాస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని.. కేసీఆర్ పగటి కలలు మానుకోవాలని హితవు పలికారు. సింగిల్‌గానే కాదు.. కేసీఆర్ బీజేపీతో జతకట్టినా గెలవలేరని.. మళ్లీ అధికారం కాంగ్రెస్ పార్టీదేనని తేల్చి చెప్పారు. ఫాంహౌజ్‌లో ఉండి కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ సృష్టించిన ఆర్ధిక విధ్వంస పునాధుల మీద.. రైజింగ్ తెలంగాణను పునర్ నిర్మిస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూసి బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. కుటుంబం కోసం తెలంగాణ ప్రయోజనాలను పదేళ్ల పాటు ప్రధాని మోదీ ముందు తాకట్టు పెట్టారని మండిపడ్డారు మహేశ్ కుమార్ గౌడ్.రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. కేసీఆర్ వైఖరి మాత్రం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీకి రాకున్నా, ప్రజల్లోకి వెళ్లకున్నా.. ఫాంహౌజ్‌లో మకాం వేసి రాజకీయ మంటలు రాజేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

మళ్లీ గెలుస్తామని.. తాను మరోసారి ముఖ్యమంత్రి అవుతానంటూ.. కేసీఆర్ మైండ్ గేమ్ అడుతున్నారని అంటున్నారు. అమావాస్యకో, పున్నమికో.. ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు పార్టీ నేతలను రప్పించుకోవడం.. వచ్చేది మన ప్రభుత్వమే అంటూ వారికి భరోసా ఇవ్వడం కేసీఆర్‌కు రొటీన్ ప్రోగ్రామ్‌గా మారింది.కాంగ్రెస్‌లో ఏదో అయిపోతోంది.. అన్నివర్గాల్లో వ్యతిరేకత వస్తోంది.. అంటూ ఫేక్ ప్రచారాన్ని ప్రజలపై బలంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నారు. ఈ కుట్రను గుర్తించే.. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారంపై ఫైర్ అవుతున్నారు. దోచుకుని దాచుకున్న బ్లాక్ మనీతో కేటీఆరే ఇదంతా చేయిస్తున్నారని మండిపడుతున్నారు. కేటీఆర్ సోషల్ మీడియాలో.. కేసీఆర్ ఫాంహౌజ్‌లో.. ఇద్దరూ కలిసి రేవంత్ సర్కార్‌ను బద్నామ్ చేసే కుతంత్రం అమలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు కాక మీదున్నాయి. మళ్లీ తానే సీఎం అవుతానంటూ కేసీఆర్ చేస్తున్న ఈ కామెంట్స్ మైండ్ గేమ్ మినహా మరోటి కాదని.. బీఆర్ఎస్‌కు అంత సీన్ లేదని.. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చిచెబుతున్నారు హస్తం నేతలు.

Read more:Hyderabad: తెలంగాణలో ఎన్డీయే.. ఎంట్రీ..

Related posts

Leave a Comment