Hyderabad:ఆన్ లైన్ బెట్టింగ్ షురూ.

season of IPL 2025 has begun.

Hyderabad:ఆన్ లైన్ బెట్టింగ్ షురూ.:ఐపీఎల్ 2025 కొత్త లీగ్ సీజన్ మొదలైంది. మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌ దాదాపు 2 నెలలపాటు క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచనుంది. దీంతో క్రికెట్ ప్రియులు ఆసక్తి మొత్తం అటు వైపు మళ్లుతోంది. తమ ఫేవరెట్ టీమ్స్ మ్యాచులు చూసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఈసారి సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేయనున్నారు. దీనికి కారణం ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులతో పాటు ఓ క్వాలిఫయర్, ఒక ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరగనుంది. హైదరాబాద్‌లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బ్లాక్ టికెట్ దందా జోరుగా సాగుతోంది.

ఆన్ లైన్ బెట్టింగ్ షురూ.

హైదరాబాద్, మార్చి 24
ఐపీఎల్ 2025 కొత్త లీగ్ సీజన్ మొదలైంది. మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌ దాదాపు 2 నెలలపాటు క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచనుంది. దీంతో క్రికెట్ ప్రియులు ఆసక్తి మొత్తం అటు వైపు మళ్లుతోంది. తమ ఫేవరెట్ టీమ్స్ మ్యాచులు చూసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఈసారి సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేయనున్నారు. దీనికి కారణం ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులతో పాటు ఓ క్వాలిఫయర్, ఒక ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరగనుంది. హైదరాబాద్‌లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బ్లాక్ టికెట్ దందా జోరుగా సాగుతోంది. ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు ఒకే రోజు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రేపు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు బ్లాక్ టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. భరద్వాజ్ అనే వ్యక్తిని బ్లాక్ టికెట్లు అమ్ముతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సంపత్, హరి అనే ఇద్దరు వ్యక్తులు ఐదు బ్లాక్ టికెట్లతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిందితుల నుంచి ఐదు టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంపత్, హరిలపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో నేడు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల అమ్మకాలు కూడా పెరిగాయి. పోలీసులు బ్లాక్ టికెట్ల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇలాంటి కార్యకలాపాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బ్లాక్ టికెట్ల అమ్మకాలను అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బ్లాక్ టికెట్ల అమ్మకాలను అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.స్టేడియం పరిసరాల్లో.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై పోలీసులు నిఘా ఉంచారు. బ్లాక్ టికెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద టికెట్లు అమ్ముతుండగా…. భరద్వాజ్ అనే వ్యక్తిని ఎల్బీనగర్ SOT పోలీసులు పట్టుకున్నారు. నాలుగు టికెట్లు స్వాధీనం చేసుకున్నారు.బ్లాక్ టికెట్లు కొనుగోలు చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లాక్ టికెట్లు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం.. దీనికి జరిమానా, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో అందుబాటులో ఉంటాయి. జొమాటోకు చెందిన డిస్ట్రిక్ట్ యాప్ లేదా వెబ్‌సైట్ లో టికెట్లను కొనుగోలు చేయవచ్చు.ఒకవేళ టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్ అధికారిక వెబ్‌సైట్లకు వెళ్లినా తిరిగి డిస్ట్రిక్ట్.ఇన్ వెళ్లినా సైట్‌కే లింక్ రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పటికే ఈ సీజన్‌లోని తొలి రెండు మ్యాచులకు సంబంధించిన టికెట్లను మార్చి 7న అందుబాటులో ఉంచారు. అవి హాట్ కేకుల్లా అమ్ముడ అయిపోయాయి.

Read also:100 మందికి 105 ఫోన్లు.

హైదరాబాద్, మార్చి 24
తెలంగాణలో మొబైల్ వినియోగదారులు ఉన్న జనాభా కంటే ఎక్కువ ఉన్నట్టు ట్రాయ్‌ ఓ నివేదిక విడుదల చేసింది. సెప్టెంబర్ వరకు ఉన్న డేటా ప్రకారం తెలంగాణలో టెలిఫోన్ వినియోగ‌దారుల సంఖ్య 4.19 కోట్లు. ఇందులో మొబైల్ వినియోగదారులు 4.4 కోట్ల మంది, ల్యాండ్‌లైన్ వినియోగ‌దారుల 15.25 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర వైర్‌లెస్ టెలీ డెన్సిటీ 105.32 శాతం అంటే ప్ర‌తి 100 మందికి 105కిపైగా మొబైల్ ఫోన్లు ఉన్నట్టు నివేదికలో తేలింది. ఈ డెన్సిటీలో గోవా టాప్‌లో ఉంటే తర్వాత స్థానం కేరళది. అనంతరం హర్యానా మూడో స్థానం ఉంది. తెలంగాణ నాల్గో స్థానంలో ఉంది. టాప్‌లో ఉన్న గోవాలో ప్రతి వందమందికి 152 ఫోన్‌లు కలిగి ఉన్నారు. కేర‌ళ‌-115, హ‌ర్యానా 114 శాతం ఉందన్నమాట. డిజిటల్ కనెక్టివిటీలో తెలంగాణకు ఇదో మైలురాయిగా చెప్పవచ్చు. ప్రస్తుతం జాతీయ సగటు 82 శాతమే ఉంటే తెలంగాణ వంద దాటిపోయింది. ఇది తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ సదుపాయాలు ఏ స్థాయిలో విస్తరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. టెలిఫోన్ వినియోగంలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణప్రాంతాల్లో ఎక్కువగా ఉంది.

గ్రామాల్లో 39 శాతం ఉంటే… పట్టణాల్లో 60 శాతంపైగా ఉంది. మొబైల్ ఫోన్ల వినియోగంలో గ్రామాల్లో 41శాతం ఉంటే… పట్టణాల్లో 59శాతంగా ఉంది. ల్యాండ్‌లైన్ ఫోన్‌లను గ్రామాలల్లో కేవలం నాలుగు శాతం మందే వాడుతుంటే పట్టణాల్లో పట్టణాల్లో 96 మంది యూజ్ చేస్తున్నారు. డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడానికి, ఇంటర్నెట్ యాక్సెస్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయి. మొబైల్ నెట్‌వర్క్ కవరేజీ మెరుగుపరిచి ఇంటర్నెట్ సేవలు అందడంతో ఎక్కువ మంది డిజిటల్ వైపు మొగ్గుతున్నారు. ఇది గ్రామీణ, పట్టణ జనాభాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇలా డిజిటల్ పెసిలిటీ పెరుగుదల విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యాపారం, పాలనకు సహాయకారిగా ఉంటాయి.

Read more:Hyderabad:నల్గోండలో బర్డ్ ఫ్లూ కలకలం

Related posts

Leave a Comment