Business news:ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తున్న భారత్

India rules the automobile market

Business news:ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తున్న భారత్:దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది ప్రధానంగా పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తుంది. ధర చాలా వరకు అందుబాటులో ఉంచడం దీని ప్రత్యేకత. అందుకే గత దశాబ్దాల కాలంగా కూడా మారుతీ అంటే ప్రజలకు ఎనలేని అభిమానం. కారు కొనాలని కోరిక ఉండి కొనలేక భాదపడుతున్న వారికీ మారుతీ తక్కువ ధరలోనే తన ప్రసిద్ధ మోడళ్లను అందిస్తూ సొంత కారు కలిగి ఉండాలనే కోరికను నెరవేర్చుతుంది. అమ్మకాల్లో ప్రతేడాది కూడా మొదటి స్థానంలో నిలవడం మారుతీకే చెందుతుంది.

ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తున్న భారత్

ముంబై, మార్చి 20
దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది ప్రధానంగా పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తుంది. ధర చాలా వరకు అందుబాటులో ఉంచడం దీని ప్రత్యేకత. అందుకే గత దశాబ్దాల కాలంగా కూడా మారుతీ అంటే ప్రజలకు ఎనలేని అభిమానం. కారు కొనాలని కోరిక ఉండి కొనలేక భాదపడుతున్న వారికీ మారుతీ తక్కువ ధరలోనే తన ప్రసిద్ధ మోడళ్లను అందిస్తూ సొంత కారు కలిగి ఉండాలనే కోరికను నెరవేర్చుతుంది. అమ్మకాల్లో ప్రతేడాది కూడా మొదటి స్థానంలో నిలవడం మారుతీకే చెందుతుంది. మార్కెట్లో చాలా కార్ల తయారీ కంపెనీలు ఉన్నప్పటికీ మారుతి సుజుకీ కార్లంటేనే మన దేశంలో చాలా మందికి ఇష్టం.సాధారణంగా ఏ రంగంలో అయినా పోటీ అనేది కామన్ గా ఉంటుంది. అయితే ఆటోమొబైల్ రంగంలో ఇది మరికాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉత్పత్తి, ఆదాయం పొందడంలో ఎవరికీ వారు పోటీగానే ఉంటారు. ఆటోమొబైల్ రంగంలో ప్రధాన తయారీదారులుగా యూరోపియన్, అమెరికన్, జపనీస్, కొరియన్, చైనా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో అగ్ర స్థానంలో ఉన్న టాప్ కంపెనీలను గురించి తెలుసుకుందాం.
టయోటా : జపాన్లో అత్యధికంగా 40శాతం మార్కెట్ షేర్ తో టయోటా కార్లే ఉంటాయి. కిచిరో టయోడా 1937లో దీన్ని స్థాపించారు.ప్రస్తుతం మన ఇండియాలో మారుతి సుజుకీ భాగస్వామ్యంతో కార్లను విక్రయిస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ : కాస్ట్లీ కార్లకు పెట్టింది పేరు మెర్సిడెస్ బెంజ్. జర్మనీకి చెందిన కార్ల్ బెంజ్, గొట్టి లీబ్ డెయిమ్లర్ మెర్సిడెస్ బెంజ్ ను నెలకొల్పారు. 1926లో ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన
తొలికారు మార్కెట్లోకి వచ్చింది.

బుగాటి : లగ్జరీ కార్లను ఉత్పత్తి చేయడంతో దీనికి సాటి మరొకటి లేదు. 1909లో ఫ్రాన్స్కి చెందిన ఎట్టోర్ బుగాటి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. స్పోర్ట్స్ కార్లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంటుంది.
బీఎండబ్ల్యూ : సెలబ్రిటీలు కోరుకునే కారు ఇది. కార్ల్ రాప్, గుస్తోవ్ ఓట్టో 1916లో జర్మనీలో బీఎండబ్ల్యూ కంపెనీనీ స్థాపించారు. ఈ సంస్థ ప్రారంభంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లను తయారుచేసేది.
లంబోరిని : స్టేటస్ సింబల్ గా కార్లను వాడాలనుకునే వారు ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేస్తుంటారు. లంబోర్గిని మెర్రుష్సియో 1963లో ఇటలీలో స్థాపించారు. లగ్జరీ కార్లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంటుంది.
రోల్స్ రాయ్స్ : 1906లో బ్రిటిష్కి చెందిన చార్లెస్ రోల్స్, హెన్రీ రాయ్స్ రూపొందించిన లగ్జరీ కార్ల కంపెనీ ఇది. వీరి పేర్ల మీదుగానే రోల్స్ రాయ్స్ అయ్యింది. ఈ కార్లు ధరకు తగ్గట్లే రాయల్ లుక్ ను కలిగి ఉంటాయి.
ఆడి : జర్మనీకి చెందిన ఆగస్ట్ హోర్స్ అనే వ్యక్తి 1909లో ఈ సంస్థను నెలకొల్పారు. ఫోక్స్ వాగన్ గ్రూప్ కు చెందిన సంస్థ ఇది.
టెస్లా : 2003లో మార్టిన్ ఎబహార్ట్, మార్క్ టార్పెన్నింగ్ కలిసి టెస్లాను స్థాపించారు. 2004లో ఎలాన్ మస్క్ టెస్లాలో పెట్టుబడిదారుడిగా చేరి 2008కి సీఈఓ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు టెస్లా మస్క్ సొంతం.
ల్యాండ్ రోవర్ : 1947లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అనే వ్యక్తి బ్రిటన్లో ఈ కంపెనీని స్థాపించారు. తొలి కారు 1948లో మార్కెట్లోకి వచ్చింది. 2008లో టాటా ఈ సంస్థని కొనుగోలు చేసింది.

Read more:సునీతా విలియమ్స్, బుచ్ విల్మార్ మొదటి రొటీన్ వర్క్ ఎలా ఉంటుందంటే స్ప్లాష్‌డౌన్ తరువాత

Related posts

Leave a Comment