Bangalore:కర్ణాటకలో లైంగిక విద్య.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు:పాఠశాల స్థాయి విద్యకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు లైంగిక విద్యను ప్రవేశపెట్టనుంది. కౌమారదశలో ఉన్న విద్యార్థులకు శారీరక భావోద్వేగ ,హార్మోన్ల మార్పులు గురించి కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరముందని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో పాఠశాలల్లో లైంగిక విద్యను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం నిలిచింది. వీటితోపాటు సైబర్ పరిశుభ్రత, విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
కర్ణాటకలో లైంగిక విద్య..
వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు..
బెంగళూరు, మార్చి 22
పాఠశాల స్థాయి విద్యకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు లైంగిక విద్యను ప్రవేశపెట్టనుంది. కౌమారదశలో ఉన్న విద్యార్థులకు శారీరక భావోద్వేగ ,హార్మోన్ల మార్పులు గురించి కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరముందని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో పాఠశాలల్లో లైంగిక విద్యను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం నిలిచింది. వీటితోపాటు సైబర్ పరిశుభ్రత, విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది.పాఠశాల విద్యలో 8వ తరగతి నుంచి 12వ తరగతుల విద్యార్థులకు లైంగిక విద్యను వచ్చే విద్యాసంవత్సరం నుంచి బోధించనున్నట్లు కర్ణాటక విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. విద్యార్థుల్లో కౌమార దశలో చోటుచేసుకునే శారీరక, భావోద్వేగ, హార్మోన్ల మార్పుల గురించి అవసరమైన జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వైద్య నిపుణుల ద్వారా వారానికి రెండుసార్లు లైంగిక విద్య తరగతులు నిర్వహించనున్నాట్లు మంత్రి చెప్పారు.
ఏడాదికి రెండుసార్లు విద్యార్థులు ఆరోగ్యం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరిశుభ్రతపై విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది విద్యార్థులకు పరిశుభ్రత, అంటు వ్యాధులు, డ్రగ్స్ వినియోగం, ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తారని చెప్పారు. లైంగిక విద్యతో పాటు.. డిజిటల్ ఎడిక్షన్, ప్రీమెచ్యూర్ సెక్సువల్ యాక్టివిటీ, టీనేజ్ ప్రెగ్నెన్సీ వంటి సమస్యలపై ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నైతిక విద్య సబ్జెక్టును తప్పనిసరి చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారానికి రెండుసార్లు సెషన్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పాఠ్యాంశాలు సమగ్రత, నిజాయితీ,సహనం వంటి విలువలను విద్యార్థుల్లో అలవర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు
Read also:కర్ణాటకను కుదిపేస్తున్న హనీ ట్రాప్
బెంగళూరు, మార్చి 22
కర్ణాటక సహకార శాఖ మంత్రి కె.ఎన్. రాజన్న అసెంబ్లీలో రాజకీయ నేతలపై హనీ ట్రాప్ జరిగిందని ఆరోపించారు. 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ లో పడ్డారన్నారు. వీరిలో రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర స్థాయి నాయకులు కూడా ఉన్నారని చెప్పారు. స్వయంగా మంత్రి అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. విచారణ చేయించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సీడీలను చూపించి హనీ ట్రాప్ వీడియోలు అని ఆరోపించారు. అయితే రోజుల్లో సీడీలు, సీడీ ప్లేయర్లు లేవు కాబట్టి .. వాటిని వినియోగిచేవారు దాదాపుగా లేరు కాబట్టి అవన్నీ ఉత్తవేనని భావిస్తున్నారు.సహకార మంత్రి రాజన్న చేసిన ఆరోపణలపై హోం మంత్రి జి. పరమేశ్వర్ స్పందించారు. తోటి మంత్రి చేశారు కాబట్టి ఆధారాలను తీసుకుని దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. అవసరమైతే ఉన్నత స్థాయి దర్యాప్తును ఆదేశిస్తామని ప్రకటించారు. కానీ ఇంకా విధి విధానాలు ప్రకటించలేదు. హనీ ట్రాప్ రాజకీయాలు కర్ణాటకలో కొత్తేమీ కాదు.
పరువులు రాజకీయ నేతలు గతంలో హానీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. 2019లో బెంగళూరు పోలీసులు ఒక హనీ ట్రాప్ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని, వారి వ్యక్తిగత క్షణాల వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసిందని పోలీసులు ప్రకటించారు. అయితే సహకార మంత్రి రాజన్న రాజకీయ ఉద్దేశాలతో హనీ ట్రాప్ ఆరోపణలు చేశారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరు ఈ ఆరోపణలకు కారణం అని భావిస్తున్నారు. బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ ఈ హనీ ట్రాప్ ఆరోపమలు.. ఓ కాంగ్రెస్ సీనియర్ సీఎం పదవి కోసం చేస్తున్న రాజకీయం అని ఆరోపించారు. హనీ ట్రాప్ ఆరోపణలపై సీఎం సిద్దరామయ్య స్పందించారు. హనీ ట్రాప్ కు ఎవరైనా పాల్పడి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
Read more:Andhra Pradesh:ముగ్గురు ముఖ్య నేతల బ్యాక్ స్టెప్ ఎందుకు