Andhra Pradesh News: వెంటాడుతున్న పాపాలు ?

ap political news

Andhra Pradesh News: వెంటాడుతున్న పాపాలు ?:సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆరోజే వైసీపీ ఓటమి ఖరారయింది. 2022 జులై లేదా ఆగస్టు నెలలో నలుగురైదుగురితో ఒక కీలక మీటింగ్ .. నాకు సన్నిహితుడైన ఒక అన్న నువ్వు కచ్చితంగా రావాలి అని తీసుకెళ్లాడు.. 2023 మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మీద చర్చ నడిచింది.. అధికారపార్టీ పరిస్థితి బాగాలేదు అని అందరి అభిప్రాయం.

వెంటాడుతున్న పాపాలు ?

సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆరోజే వైసీపీ ఓటమి ఖరారయింది. 2022 జులై లేదా ఆగస్టు నెలలో నలుగురైదుగురితో ఒక కీలక మీటింగ్ .. నాకు సన్నిహితుడైన ఒక అన్న నువ్వు కచ్చితంగా రావాలి అని తీసుకెళ్లాడు.. 2023 మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మీద చర్చ నడిచింది.. అధికారపార్టీ పరిస్థితి బాగాలేదు అని అందరి అభిప్రాయం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగులుతుందని తేల్చి చెప్పారు.. ఆ కీలక నేత మాత్రం సర్లే చూద్దాం అంటూనే అయినా ఏమవుతుందిలే అనేశారు. ఈ మీటింగ్ జరిగిన రెండు నెలల తరువాత ఊహించని అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలోకి వచ్చారు..పశ్చిమ రాయలసీమ మరియు తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరూ నాకు సన్నిహితులే.

రాజధాని పనులను సొంత ప్లానింగ్ తోనే… మరోవైపు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రచారం మీద మంచి రిపోర్ట్ అందుతుంది.. మంచి ప్లానింగ్ ,ఓట్ల ఎన్ రోల్ మెంట్ , ప్రతి మండల కేంద్రంలో ఆయన టీమ్ తరుపున మీటింగులు పెట్టడం .. పని బాగుంది.. ఎక్కడ కూడా టీడీపీ పెద్ద స్థాయి నాయకుల మీద ఆధారపడకుండా ఆయన టీమ్ పనిచేసుకుంటూ వెళ్తుంది.. గెలుపుకు ఏమి చేయాలో అది చేస్తున్నారు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డితో వ్యక్తిగత పరిచయం లేదు కానీ ఆయన క్లాస్ మేట్స్ ,మిత్రులు చాలా మంది నాకు ఫ్రెండ్స్ .. మా శంకరన్న ,బి టెక్ రవి & భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి క్లాస్ మేట్స్ .. సో రాంగోపాల్ రెడ్డి గురించి బాగా తెలుసు మరో వైపు తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ చిన్నప్పుడు అంటే తాను చదివేటప్పుడు తెలుసు.. వాళ్ళ మేనబావ నాకు ఇంటర్లో క్లాస్ మేట్.. శ్రీకాంత్ తండ్రి ఈనాడు రామయ్య గురించి కూడా అప్పటి నుంచే తెలుసు.

ఈనాడు రామయ్య దగ్గుబాటి చంద్రబాబు వర్గాల వైరం మధ్య నలిగిపోయి ఏ పదవి పొందలేకపోయారు కానీ జిల్లాలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి.. మా మార్కాపురం కూడా తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కిందికే వస్తుంది.. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా కుటుంబం కీలకంగా పనిచేస్తుంది.. మొదటి ఎమ్మెల్సీ (2007)విఠపు బాలసుబ్రహ్మణ్యం మా తండ్రి కాలేజ్ మేట్స్. 2023 జనవరి వచ్చింది.. అధికార వైసీపీ అభ్యర్థుల ప్రచారం ఎవరికీ అర్ధం కాలేదు.. ఒక నియోజకవర్గం పోవటం స్థానిక ఎమ్మెల్యేతో కలసి వంద రెండు వందల మందితో మీటింగ్ పెట్టటం జగన్ కోసం ఓటు వేయండని అడగటం.. ఒక టీమ్ కానీ వార్ రూమ్ కానీ లేకుండా ప్రచారం జరిగింది.. టీడీపీ అభ్యర్థుల గెలుపు జనవరికే నిర్ధారణ అయ్యింది..

అనుకున్నట్లే సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజు. 18 మార్చి 2023న కౌంటింగ్ జరిగింది ,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మూడు వైసీపీ ఓడిపోయింది. విద్యా శాఖలో ఒక కీలక అధికారి ప్లానింగ్ వలన టీచర్స్ ఎమ్మెల్సీ లు రెండు వైసీపీ గెలిచింది.సరే.. ఎందుకు ఓడిపోయాం అని అంతర్మధనం జరిగిందా అంటే నాకు తెలిసి లేదు… మా ఓటర్లు వేరే ఉన్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు అన్నారు.. అది సజ్జల గారి నిజమైన అభిప్రాయం కాకపోవచ్చు.. మీడియాకు ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి ఆమాట అన్నారనిపించింది.. అప్పటి నుంచే పునాదులు… 2023 జనవరి నుంచే వైసీపీ ఓటమికి పునాదులు పడ్డాయి.. అప్పటి నుంచి టీడీపీ ప్రతి స్టెప్ 2024 అసెంబ్లీ ఎన్నికల గెలుపు వైపే పడింది.. వైసీపీ 2023 జనవరిలో మేలుకొని ఉంటే గెలిచినా గెలవకున్నా ఇంత ఘోరమైన ఓటమి పాలయ్యేది కాదు .మొన్న మార్చి రెండో తేదీన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారిని ఒక పెళ్ళిలో కలిసి మాట్లాడాను.. నాలుగో తారీఖున కౌంటింగ్ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఆయన అభిప్రాయం అడిగాను .. గుంటూరు-కృష్ణా & గోదావరి గ్రాడ్యుయేట్ గెలుస్తాం, ఉత్తరాంధ్ర టీచర్స్ ఓడిపోతాం అని చెప్పారు.

భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికకు, కంచర్ల శ్రీకాంత్ గుంటూరు-కృష్ణా ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంచార్జులుగా పనిచేశారు.. ఉత్తరాంధ్ర టీచర్స్ లో అభ్యర్థి వీరి మాట వినలేదు.. అందుకే ఓడిపోతాం అని ఆయన అంచనా.. ఆయన అంచనాలు నిజమయ్యాయి.. పోలింగ్ రోజున… గుంటూరు-కృష్ణ పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు నాకు ,మా అన్నకు చాలా కాలంగా పరిచయం.. ప్రతి ఎన్నికకు ఆయనకు మేము చేయగల మద్దతు ఇస్తాం.. మొన్న కూడా ఫిబ్రవరి పదిహేనున కలిశాను .. టీడీపీ బలాన్ని తట్టుకోగలమా అనే అనుమానం అందరిలో ఉంది. అనుకున్నట్లే పోలింగ్ రోజు అధికారపార్టీ బలాన్ని చూపించింది.. సార్ ఓడిపోయిన రెండుసార్లు టీడీపీ అభ్యర్థి మీదనే కావటం విశేషం.

ఉత్తరాంద్ర టీచర్స్ ఓటమి ప్రభుత్వానికి టీచర్లు కర్రు కాల్చి వాత పెట్టారు అని నాటి ప్రతిపక్షం విమర్శించింది. ఈ మూడు అంటే టీడీపీ గెలిచిన రెండు గ్రాడ్యుయేట్ , ఓడిపోయిన టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు ప్రభుత్వం మీద ప్రజా అభిప్రాయంగా చూడవలసిన అవసరం లేదు. సమర్ధులైన నాయకులు.. ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉంది కాబట్టి గెలిచారనో ప్రభుత్వ పనితీరు బాగాలేదు అందుకే టీచర్స్ ఓడించారనో భావించవలసిన అవసరం లేదు..ఆ స్థాయి అభిప్రాయలు గ్రౌండ్లో ఇంకా ఏర్పడలేదు. టీడీపీ ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకుంటుంది & ఏ స్థాయిలో ఎన్నికలు చేయగలదో ఈ ఫలితాలు చెబుతాయి.భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి & కంచర్ల శ్రీకాంత్ రూపంలో మాత్రం టీడీపీకి ఎన్నికలు చేయగలిగిన ఇద్దరు సమర్ధమైన నాయకులు దొరికారు … పూర్వ ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కంచర్ల శ్రీకాంత్ మూడేళ్ళ నుంచీ కుప్పంలోనే కాపురం ఉంటూ చంద్రబాబు గారి ఎన్నిక కోసం పనిచేశారు.. ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నారు.

Read more:Andhra Pradesh:మంత్రి పదవికి ఇంకా టైముంది

Related posts

Leave a Comment