Andhra Pradesh:సామర్లకోట దగ్గర ఆర్వోబీ:ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్టేట్ హైవేలు, నేషనల్ హైవేలు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన ఆర్వోబీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇకపై గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పని లేకుండా.. సామర్లకోట రైల్వే గేటు దగ్గర వాహనదారుల నిరీక్షణకు తెర పడనుంది.
సామర్లకోట దగ్గర ఆర్వోబీ
రాజమండ్రి, మార్చి 18
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్టేట్ హైవేలు, నేషనల్ హైవేలు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన ఆర్వోబీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇకపై గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పని లేకుండా.. సామర్లకోట రైల్వే గేటు దగ్గర వాహనదారుల నిరీక్షణకు తెర పడనుంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)కి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు భూ సేకరణతో పాటుగా పలు ఇతర అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టారు.ప్రతి రోజూ రాజమహేంద్రవరం, కాకినాడ మార్గాల నుంచి వచ్చే వాహనాలు సామర్లకోట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు ఈ రాకపోకలు సాగించడానికి కష్టాలుపడ్డారు.. ఆర్వోబీ రావడంతో వాహనదారులకు విముక్తి కల్పించడానికి ఆర్వోబీ నిర్మించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. గతంలోనే రైల్వే గేటు దగ్గర బ్రిడ్జి నిర్మించాలని ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని కోరారు, ప్రతిపాదనలుకూడా పంపారు.
కాకినాడ జనసేన పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సామర్లకోట ఆర్వోబీ గురించి చర్యలు తీసుకోవాలని ఇటీవల కోరడంతో రైల్వే శాఖ నుంచి సానుకూలత వచ్చింది.ఈ ఆర్వోబీ అందుబాటులోకి వస్తే.. రైల్వే గేటు దగ్గర వాహనదారుల నిరీక్షణకు చెక్ పడుతుందంటున్నారు. ఈ మేరకు ఆర్వోబీ నిర్మించడానికి స్థల సేకరణ చేయాలని, పనులకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని రైల్వే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ‘గేటు సకాలంలో పడకపోవడం వల్ల సిగ్నల్ వ్యవస్థకు ఇబ్బంది కలిగేది.. ఫలితంగా రైళ్ల రాకపోకలకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యేవి. త్వరలో నిర్మించే ఆర్వోబీతో ఈ ఇబ్బందులు తొలగుతాయని’ అన్నారు. ఈ ఆర్వోబీ పూర్తి చేస్తే వాహనదారుల కష్టాలు తొలగిపోతాయంటున్నారు.ఈ సామర్లకోట రైల్వే గేటు దగ్గర ప్రజలునిత్యం నరకం అనుభవిస్తున్నారు.. గేటుపడితే చాలు వాహనాలు మొత్తం అక్కడ నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో ఇక్కడ ఆర్వోబీ నిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మొత్తానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read also: గిద్దలూరులో ఇన్నర్ ఫైట్
ఒంగోలు,
గిద్దలూరులో ఇంత గొడవ జరుగుతున్నా వైసీపీ పెద్దల మౌనం? ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కేంద్రంగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుండమార్పిడి రాజకీయాలు చేసింది వైసీపీ అధిష్టానం. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కా పురం అభ్యర్ధిగా ప్రకటించింది. అక్కడితో ఆగక మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని.. గిద్దలూరు కేండేట్ గా ప్రకటించింది. ఆయా అభ్యర్ధులకు ఇష్టమున్నా లేకున్నా తాంబూలాలిచ్చేశాం తన్నుకు ఛావండంటూ వదిలేసింది. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు ఆయా వర్గాల వారు. చేసేది లేక.. ఆ ఎన్నికల్లో అలా పోటీ చేశారు కూడా.జగన్ అప్లై చేసిన ఈ కుండమార్పిడి ఫార్ములా.. ఇటు గిద్దలూరు, అటు మార్కాపురం రెండు సెగ్మెంట్లలో వర్కవుట్ కాలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఘోర పరాజయం పాలైంది వైసీపీ. ఓటమి తర్వాత అన్నా రాంబాబు, నాగార్జున రెడ్డి.. తాము పోటీ చేసిన నియోజకవర్గాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ క్రమంలో ఎన్నికల ముగిసి.. 9 నెలలు దాటుతున్నా.. కార్యకర్తల మంచి చెడ్డ.. పట్టించుకునే నాథులే లేకుండా పోయారని సమాచారం.
ఈ మధ్య గిద్దలూరు ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలు ఇదే విషయంపై భగ్గుమన్నారు కూడా. అంతే కాదు ప్రస్తుత గిద్దలూరు ఇంచార్జిగా ఉన్న నాగార్జున రెడ్డి మాకు వద్దే వద్దంటూ.. నినాదాలు హోరెత్తించారటగిద్దలూరు వైసీపీ ఇంచార్జిగా తిరిగి మాజీ ఎమ్మెల్యే రాంబాబుకే ఇవ్వాలనీ డిమాండ్ చేశారట. లేకుంటే స్థానిక నేతలకు ఈ బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయట స్థానిక ఫ్యాను పార్టీ వర్గాలు. నియోజకవర్గంలో లేని, ఉండటానికే ఇష్టపడని.. నేతకు ఈ పోస్టు అప్పగించడంలో అర్ధమే లేదని వాపోవడమూ కనిపిస్తోందట. జగన్ అసంబద్ధ నిర్ణయాలతో పార్టీ అడ్రెస్ గల్లంతయ్యే ప్రమాదమూ లేక పోలేదన్న హెచ్చరికలూ అందుతున్నాయట. ఈ దిశగా కొందరు ఓపెన్ గానే మాట్లాడుతున్నట్టు సమాచారం.ఇదిలా ఉంటే నాగార్జున రెడ్డి నిర్వహించిన ఒక సమావేశానికి కొందరు వైసీపీ లీడర్లు హాజరు కాలేదట. నాగార్జున రెడ్డి సైతం వీరిని కావాలనే ఆహ్వానించలేదట. గత ఎన్నికల్లో వైసీపీలోనే ఉంటూ.. టీడీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డికి వీరు సపోర్ట్ చేశారనీ. అందుకే వీరిని పిలవలేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయట. ఎవరికైతే ఆహ్వానాలు అందలేదో.. వారు అధిష్టానానికి ఈ విషయమై ఫిర్యాదు కూడా చేశారట.
నాగార్జున రెడ్డి ఒంటెత్తు పోకడల వల్లే వైసీపీ 600 ఓట్ల తేడాతో ఓడిపోవల్సి వచ్చిందని.. తమ కంప్లయింట్ లో వీరు ప్రముఖంగా ప్రస్తావించారట. అందుకే ఆయన్ను తిరిగి మార్కాపురానికి పంపించేయాలని వీరు రాసిన లేఖలు ప్రెజంట్ హాట్ టాపిగ్గా మారాయట.సలే అధికారం లేక ఆపసోపాలు పడుతుంటే.. ఈ గ్రూపు గొడవలేంటని వైసీపీ పెద్దలు తలలు బాదుకుంటున్నారట. ఇటు అన్నా రాంబాబుకు గిద్దలూరులో 15 ఏళ్ల అనుబంధముంది. ఇక గిద్దలూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగానూ గెలిచారు. కాబట్టి.. స్థానిక వైసీపీలోని ఒక వర్గం.. మళ్లీ ఆయనే రావాలని కోరుకుంటున్నారట. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన గిద్దలూరులో.. రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని.. రాంబాబు కూడా అనుకుంటున్నట్టు ఆయన అనుచర వర్గాల సమాచారం. రాంబాబు అయితేనే ఇటు ఆర్ధికంగా అటు రాజకీయంగానూ బలమైన నేత గా నిలబడగలరనీ. తమకు అండగానూ ఉండగలరనీ.. వీరు భావించడం వల్లే.. అధిష్టానానికి ఈ దిశగా లేఖలు రాస్తున్నారట.గిద్దలూరు వైసీపీలోని మరో వర్గం మాత్రం.. స్థానిక రెడ్డి నేతలకే ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని కోరుతోందట. ఈ రేసులో.. ఎన్నారై నేత ఐవీ రెడ్డి, కడప వంశీధరరెడ్డి, పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారట. ప్రస్తుతానికి వస్తే.. గిద్దలూరు ఇంచార్జీగా ఉన్న నాగార్జున రెడ్డి ఎవరూ చెప్పకుండానే.. మార్కాపురానికి పరమితమయ్యారట.
దీంతో తాము అతీ గతీ లేని అనాథలమయ్యామనీ వాపోతున్నారట ఫ్యాను పార్టీ కార్యకర్తలు. ఐవీ రెడ్డి అయితే గతంలో గిద్దలూరు వైసీపీ బాధ్యతలు చూశారు. దానికి తోడు ఎన్నారై కూడా కావడం.. గిద్దలూరు లోకల్ పర్సన్ అవడంతో.. ఈయనే బెస్ట్ అంటూ.. ఓ వర్గం ఇప్పటికే అధిష్టానానికి సూచిస్తోందట. ఐవీ రెడ్డి సైతం.. పార్టీ అగ్రనాయకత్వం ఇంచార్జి బాధ్యతలు తనకే ఇస్తారని చెప్పుకుంటున్నారట.ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క ఒంగోలు కు తప్ప.. మిగిలిన 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్ధుల మార్పు చేర్పులు జరిగాయి. ప్రస్తుతం గొడవ గొడవగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గాన్ని టచ్ చేస్తే మిగిలిన అన్నిటిలోనూ డిమాండ్లు వెల్లువెత్తుతాయి. దీంతో మొత్తం తారుమారు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారట.. వైసీపీ పెద్దలు. అసలే వలసల కారణంగా.. లీడర్లు కరవైన ఈ సిట్యువేషన్లో.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మార్చడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారట అధిష్టానం పెద్దలు. అందుకే గిద్దలూరులో ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారట. దీంతో గిద్దలూరు వైసీపీ కేడర్ కి ఏం చేయాలో పాలు పోవడం లేదని సమాచారం.