Andhra Pradesh:వైసీపీలో కలకలం.. దొంగ సంతకాలపై చర్చ:ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్‌సీపీ బహిష్కరించింది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రం రహస్యంగా వచ్చి హాజరైనట్లుగా రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లారు. మొత్తంగా ఉన్నకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం సంతకాలు చేయలేదు. అసెంబ్లీ చివరి రోజున ఈ విషయం స్పీకర్ అయ్యన్న పాత్రుడు దృష్టికి వచ్చింది. ఆయన సభలో ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి రిజిస్టర్ లో సంతకాలు పెట్టి కోవాల్సిన అవసరం ఏముదంని ప్రశ్నించారు.
వైసీపీలో కలకలం
దొంగ సంతకాలపై చర్చ
విజయవాడ, మార్చి 21
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్‌సీపీ బహిష్కరించింది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రం రహస్యంగా వచ్చి హాజరైనట్లుగా రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లారు. మొత్తంగా ఉన్నకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం సంతకాలు చేయలేదు. అసెంబ్లీ చివరి రోజున ఈ విషయం స్పీకర్ అయ్యన్న పాత్రుడు దృష్టికి వచ్చింది. ఆయన సభలో ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి రిజిస్టర్ లో సంతకాలు పెట్టి కోవాల్సిన అవసరం ఏముదంని ప్రశ్నించారు. ఆయన బయట పెట్టడంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరో తెలిసిపోయింది. స్కూలు, ఆఫీసుల్లో విద్యార్థులు, ఉద్యోగులు పంచ్ కొట్టి బయటకు వెళ్లిపోయినట్లుగా ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఉండటంతో ఎమ్మెల్యేల్లోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అసెంబ్లీకి వెళ్లకూడదని అనుకున్నప్పుడు వెళ్లకుండా ఉండాలి కానీ రహస్యంగా సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏమిటన్నది చర్చనీయాంశం అయింది. అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతా వేటు పడుతుందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదే పదే చెబుతున్నారు. అందుకే వారు గవర్నర్ ప్రసంగం రోజున హాజరై కొంత సేపు ఉండి వెళ్లిపోయారు. అయితే తర్వాత ఆ రోజు వర్కింగ్ డే కాదని అసెంబ్లీ వర్గాలు చెప్పాయి. దాంతో మరో రోజు హాజరు కావాల్సిన అవసరం పడింది.
అలా హాజరు కాకుండా.. ఎప్పుడు వచ్చారో కానీ.. నేరుగా అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. ఒక్క నిమిషం కూడా సభలోకి రాలేదు. ఈ సంతకాలు చెల్లుతాయా లేదా అన్నది స్పీకర్ రూలింగ్ ను బట్టి ఉంటుంది. చెల్లుబాటు అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో అసెంబ్లీకీ హాజరైనప్పుడు ప్రత్యేకంగా జీతభత్యాలు వస్తాయి. వాటి కోసం సంతకాలు చేసి ఉంటారని అంటున్నారు. ఎమ్మెల్యేలకు జీతభత్యాలు లక్షల్లోనే ఉంటాయి. అసెంబ్లీకి హాజరు కాని కారణంగా వాటిని ఆపేస్తే.. సమస్యలు వస్తాయని వచ్చి సంతకాలు పెట్టి ఉంటారని భావిస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసి పంపించింది..అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలు చర్చించడానికి. అయితే ఎమ్మెల్యేలు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న కారణంగా అసెంబ్లీకి వెళ్లడం లేదు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామంటున్నారు. వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలలో చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు. అసెంబ్లీకి హాజరై అధ్యక్ష అని ప్రసంగించాలని అనుకుంటున్నారు. కానీ అధినేత అంగీకరించకపోవడంతో అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నారు
దొంగ సంతకాలపై వైసీపీ సైలెన్స్
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి సభలోకి రాకుండా పారిపోతున్నారంటూ సాక్షాత్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చాలా పెద్ద కామెంట్ చేశారు. సహజంగా ఇలాంటి కామెంట్లపై వెంటనే వైసీపీ నుంచి రియాక్షన్ రావాలి. సభకు వస్తున్నామనో, లేక రాలేకపోతున్నామనో, అసలు తాము సంతకాలు పెట్టలేదనో, లేక తమ పేరుతో ఇంకెవరైనా పెడుతున్నారనో అనాలి. కానీ ఇంత వరకు వైసీపీ నుంచి సౌండ్ లేదు. అంటే దొంగ సంతకాలు నిజమేనని ఆ పార్టీ ఒప్పుకున్నట్టైందని టీడీపీ ఎద్దేవా చేస్తోంది. ఆఖరికి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేతలు కూడా ఇంత చీప్ గా ప్రవర్తిస్తారా అంటూ కౌంటర్లిస్తున్నారు.వైసీపీ వాళ్లు జగన్ ని సింగిల్ సింహంతో పోలుస్తుంటారు. ప్రతి ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా జగన్ సింగిల్ గా బరిలో దిగుతారనేది వారి మాటల సారాంశం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ని ఒంటరి చేశారంటూ టీడీపీ ఓ రేంజ్ లో కౌంటర్లివ్వడం విశేషం. ఎమ్మెల్యేలుగా తమపై అనర్హత వేటు పడుతుందేమోననే భయంతో కొంతమంది అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకాలు పెడుతున్నారు. అయితే సభకు మాత్రం రావడం లేదు. ఇది జగన్ తీర్మానానికి విరుద్ధం. తనను ప్రతిపక్షనేతగా గుర్తిస్తేనే సభకు వస్తామని భీష్మించుకు కూర్చున్నారాయన. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఆయన శపథం పట్టించుకోకుండా తమ సీట్లు కాపాడుకోవడం కోసం పాకులాడటం విశేషం.జగన్ కి ప్రతిపక్ష నేత హోదా కావాలి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం తమ పదవులు మిగలాలి.
ఈ క్రమంలో స్పష్టంగా అక్కడ సంఘర్షణ మొదలైంది. ఒకవేళ జగన్ పై అనర్హత వేటు పడినా.. ఆయన మాత్రం తన సీటులో గెలిచే అవకాశాలు ఎక్కువ. అదే సమయంలో మిగతా వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే.. ఆయా ప్రాంతాల్లో వారు గెలవాలంటే కత్తిమీద సాము చేయాలి. ఆర్థికంగా బాగా చితికిపోతారనేది వేరే విషయం. దీంతో వారంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు. అయితే ఇక్కడ సంతకాలపై వైసీపీ పూర్తిగా కార్నర్ అయిపోయింది. తమ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారనే విషయంపై కనీసం స్పందించడానికి కూడా ఆ పార్టీ తరపున ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. ఈ విషయంలో వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా తేలు కుట్టిన దొంగలా మారింది. కనీసం దానిపై స్పందించేంత సాహసం కూడా వైసీపీ నేతలెవరూ చేయట్లేదు. జగన్ పేరెత్తితేనే అంతెత్తున ఎగిరిపడే సోషల్ మీడియా మేథావులు కూడా ఈ దొంగసంతకాలను కవర్ చేయలేక కష్టపడుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ స్పందించలేదంటే దానర్థం దొంగ సంతకాలు నిజమనే. దీంతో ఆ పార్టీ పరువు పూర్తిగా మంటగలిసిందని అంటున్నారు. అయితే ఇక్కడ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రం స్పందించారు. ఇక్కడ కూడా ఆయన బహుజన ఎమ్మెల్యేలను దొంగలన్నారంటూ టాపిక్ ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం విశేషం. ఆయన రెస్పాన్స్ ని మాత్రం వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటోంది కానీ, పార్టీ తరపున ఎవ్వరూ మాట్లాడే సాహసం చేయడం లేదు.