Andhra Pradesh:వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే

ys jagan mohanreddy

Andhra Pradesh:వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే:ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రానున్న కాలమంతా గడ్డుకాలమే. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలపై విచారణ ప్రారంభించిన ప్రస్తుత ప్రభుత్వం అన్ని విభాగాల్లో జరిగిన అవినీతిపై లోతైన దర్యాప్తు చేయనుంది. అయితే ఆధారాలను స్పష్టంగా సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయనున్నారు. న్యాయస్థానాల్లో వీగిపోకుండా పకడ్బందీగా అగ్రనేతల మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకునే ఛాన్స్ ఉంది.

వైసీపీకి రానున్నదంతా గడ్డుకాలమే

విజయవాడ, మార్చి 18
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రానున్న కాలమంతా గడ్డుకాలమే. ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలపై విచారణ ప్రారంభించిన ప్రస్తుత ప్రభుత్వం అన్ని విభాగాల్లో జరిగిన అవినీతిపై లోతైన దర్యాప్తు చేయనుంది. అయితే ఆధారాలను స్పష్టంగా సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయనున్నారు. న్యాయస్థానాల్లో వీగిపోకుండా పకడ్బందీగా అగ్రనేతల మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకునే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వంలో అనుసరించిన లిక్కర్ అమ్మకాలపైనే ఈ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. లిక్కర్ స్కామ్ లో నిందితులను వరసగా అరెస్ట్ లు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించనున్నారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే జరిపింది. నాసిరకం మద్యాన్ని అధిక ధరకు విక్రయించడం, డిజిటల్ పేమెంట్స్ కు అంగీకరించకపోవడం వంటి అంశాలు ఈ విచారణలో కీలకంగా మారనున్నాయి. ప్రయివేటు సిబ్బందిని లిక్కర్ దుకాణాల్లో నియమించి జరిపిన అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం ఎటు వెళ్లిందన్న దానిపై ఇప్పటికే ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఇటీవల మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును కూడా బయటపెట్టారు. ఆయనలే లిక్కర్ వ్యాపారంలో కీలకంగా వ్యవహరించారని సాయిరెడ్డి ఆరోపించారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ ఫైలు వేగంగా ముందుకు కదులుతుంది.

కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేశారు. అతనే ప్రధాన సూత్రధారి అంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ కోణంలో అధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. తెర వెనక ఉండి ఆయనే అంతా నడిపించారని, లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడకు వెళ్లాయన్నది కసిరెడ్డిని విచారిస్తే ఖచ్చితంగా తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో వైసీపీ అగ్రనేతల ప్రమేయం ఉండే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వ పెద్దలు కొంత ఆలస్యమయినా పకడ్బందీగా కేసును రూపొందించాలని ఆదేశాలు జరీ చేసినట్లు సమాచారం. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి విదేశాల్లోనూ లిక్కర్ షాపులను నడిపిన అనుభవం ఉందని తెలియడంతో ఆయన గత ప్రభుత్వంలో ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించారంటున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత దగ్గరని, ఆప్తుడని కూడా గుర్తించారు. ఈ కోణంలోనే దర్యాప్తు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కసిరెడ్డి రాజవేఖర్ రెడ్డి దొరికితే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని విచారణ చేస్తున్న అధికారులు భావిస్తున్నారు. కసిరెడ్డి కోసం ఇప్పటికే వేట ప్రారంభమయిందని చెబుతున్నారు. ఆయన దొరికిన వెంటనే మద్యం కేసులో కీలక నేతలను కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేసే అవకాశముందని కూడా అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. డిస్టలరీలు, మద్యం అమ్మకాలు, నాసిరకం మద్యం వంటి అంశాలపై ఇప్పటికే కొంత మేరకు ఆధారాలను సేకరించిన అధికారులు స్పష్టమైన సాక్షాధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. అవి లభించినట్లే ఊహించని పరిణామాలు ఏపీలో జరిగే అవకాశముందని చెబుతున్నారు.

Read more:అవమానించినవారికి బుద్ధి చెప్పామన్న పవన్‍ Deputy CM Pawan Kalyan Speech At Pithapuram |

Related posts

Leave a Comment