Andhra Pradesh:వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజీనామా

MLC Marri resigns from YSRCP

Andhra Pradesh:వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజీనామా:అసలే ఎండాకాలం.. ఆపై వివరీతమైన ఉక్కుపోత. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో అదే జరుగుతోంది. ఫ్యాన్ గాలి సరిగా తగలక ఫ్యాన్‌కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు కొందరు నేతలు. తాజాగా పల్నాడుకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆ పార్టీకి రాంరాం చెప్పేశారు. తన లేఖను అధినేత జగన్‌కు పంపించారు. దీంతో ఇప్పటివరకు ఆ పార్టీలో రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది.పల్నాడు జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.

వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజీనామా

గుంటూరు మార్చి 20
అసలే ఎండాకాలం.. ఆపై వివరీతమైన ఉక్కుపోత. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో అదే జరుగుతోంది. ఫ్యాన్ గాలి సరిగా తగలక ఫ్యాన్‌కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు కొందరు నేతలు. తాజాగా పల్నాడుకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆ పార్టీకి రాంరాం చెప్పేశారు. తన లేఖను అధినేత జగన్‌కు పంపించారు. దీంతో ఇప్పటివరకు ఆ పార్టీలో రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది.పల్నాడు జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి సైతం ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా అధినేతతోపాటు కొందరి వ్యవహారశైలి నచ్చక రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.వైసీపీలో కీలక నేతల్లో మర్రి రాజశేఖర్ ఒకరు. 2004 చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన చరిత్ర ఆయనది. ఆ తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో సీఎం రాజశేఖర్‌రెడ్డికి దగ్గరయ్యారు. ఆ తర్వాత గుంటూరు నుంచి కీలక నేతల్లో ఒకరిగా పేరు తెచ్చారు. 2009 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రయార్టీ ఇచ్చింది.ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైఎస్ అభిమానంతో జగన్ పార్టీలోకి వెళ్లారు. పార్టీ పెట్టిన నుంచి వైసీపీలో కంటిన్యూగా ఉన్న నేతల్లో ఆయన కూడా ఒకరు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు రాజశేఖర్. 2019 ఎన్నికల సమయంలో మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.ఈసారి విడుదల రజనీని గెలిపించాలని చిలుకలూరి పేట బహిరంగసభలో చెప్పారు.

చెప్పినట్టుగా రజనీ గెలిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. కానీ మంత్రి పదవి మాత్రం ఆయనకు అందని దాక్ష అయ్యింది.2024 చిలకలూరిపేట నుంచి పోటీ చేయాలని భావించారు మర్రి రాజశేఖర్. అయితే అక్కడి నుంచి వైసీపీ తరపున మనోహర్ నాయుడు పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. చిలుకలూరిపేట పార్టీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగిస్తారని ఆయన భావించారు. మరోసారి విడుదల రజినీని నియమించారు.అప్పటి నుంచి ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి తన కెరీర్ నాశనం చేసుకున్నానని పలుమార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చి తాను ఆర్థికంగా నష్టపోయానని, పార్టీ తనను ఆదుకోలేదని తన సన్నిహితుల వద్ద వాపోయారు.ఒకానొక దశలో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు కూడా.గుంటూరు కోర్టులో న్యాయవాదిగా దర్శనమిచ్చారు మర్రి రాజశేఖర్. ఈ విషయం తెలియగానే అప్పటి సీఎం జగన్ వెంటనే పిలిచి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు.రెండేళ్ల కిందట ఆయనకు ఆ పదవి ఇచ్చారు. తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేపోమాపో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆయన టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ ఐదో వ్యక్తి. ఎమ్మెల్సీల రాజీనామాలను మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఆమోదించలేదు. వీరితోపాటు మరి కొంతమంది నేతలు రాజీనామాలకు రెడీగా ఉన్నట్లు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకెంత మంది బయటకు వస్తారో చూడాలి.

Read more:Andhra Pradesh:ఆమత్యా.. ఇంకా టైముందే

Related posts

Leave a Comment