Andhra Pradesh:విశాఖ స్టేడియంపై పొలిటికల్ గేమ్:విశాఖ క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై వైఎస్సార్‌సీపీ నేతలు నానా రచ్చ చేస్తున్నారు. అటు, టీడీపీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుండటంతో రచ్చ రంజుగా మారింది.విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంపై ఏపీలో పొలిటికల్ గేమ్ నడుస్తోంది. స్టేడియంకు వైఎస్సార్ పేరు తీసేయడమే లేటెస్ట్ వివాదానికి కారణం. మా నాయకుడి పేరు తొలగిస్తారంటూ వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. మేటర్ విశాఖ స్టేడియం గురించి కాబట్టి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఈ గొడవను లీడ్ చేస్తున్నారు.
విశాఖ స్టేడియంపై పొలిటికల్ గేమ్
విశాఖపట్టణం, మార్చి 20
విశాఖ క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై వైఎస్సార్‌సీపీ నేతలు నానా రచ్చ చేస్తున్నారు. అటు, టీడీపీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుండటంతో రచ్చ రంజుగా మారింది.విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంపై ఏపీలో పొలిటికల్ గేమ్ నడుస్తోంది. స్టేడియంకు వైఎస్సార్ పేరు తీసేయడమే లేటెస్ట్ వివాదానికి కారణం. మా నాయకుడి పేరు తొలగిస్తారంటూ వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. మేటర్ విశాఖ స్టేడియం గురించి కాబట్టి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఈ గొడవను లీడ్ చేస్తున్నారు. మీడియా ముందు గొంతు చించుకోవడంతో పాటు.. పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలకు రెడీ అవుతున్నారు.విశాఖ స్టేడియంకు వైఎస్సార్ పేరు తీసిపడేయడంపై సోషల్ మీడియాలో ఇరు వర్గాలు బౌన్సర్లు, సిక్సర్లతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. పేరు మార్చితే.. ఆ నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొస్తుందా అంటూ వైసీపీని కవ్విస్తున్నారు టీడీపీ, జనసేన వారియర్స్. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎన్టీఆర్ పేరు తీసేసి.. వైఎస్సార్ అని పెట్టడాన్ని గుర్తు చేసి కామెంట్లతో కుమ్మేస్తున్నారు.
1986లో హెల్త్ యూనివర్సిటీని స్థాపించిందే అప్పటి సీఎం నందమూరి తారకరామారావు. అందుకే, ఆయన పేరు మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టడంలో లాజిక్ ఉంది. అలాంటి ఎన్టీఆర్ పేరును తీసేసి.. గత సీఎం జగన్ తన తండ్రి పేరుతో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిన మేటర్ ను ఇప్పుడు మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. ఆనాడు ఆయన చేసింది తప్పు కానప్పుడు.. ఇప్పుడు విశాఖ క్రికెట్ స్టేడియంకు వైఎస్సార్ పేరు తీసేయండం కూడా తప్పు కాదని వాదిస్తున్నారు. వైజాగ్ స్టేడియం వైఎస్సార్ ఏమైనా కట్టించాడా? ఆయన పేరు ఎందుకు పెట్టారంటూ గట్టి ఫైటే నడుస్తోంది సోషల్ మీడియాలో. అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన స్టేడియం కాబట్టి ACA పేరు మీదుగా ఉండటమే కరెక్ట్ అంటూ వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్లు పడుతున్నాయి.పేరులో ఏముందిలే అని పంతానికి పోకుండా.. పవర్ లేనప్పుడు సైలెంట్‌గా పడుండాలి కానీ.. కాదూ కూడదు.. వైఎస్సార్ పేరు తీయొద్దు.. రోడ్ల మీదకు వస్తాం.. రచ్చ చేస్తాం.. అంటే కుదరదు. ఇక్కడుంది కూటమి ప్రభుత్వం. తాట తీస్తారు జాగ్రత్త.. అంటూ తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు జగన్ అభిమానులను ఓ ఆటాడుకుంటున్నారు. దమ్ముంటే విశాఖ స్టేడియంకు రండి.. అసలైన ఆడుదాం ఆంధ్రా అంటే ఏంటో చూపిస్తాం అంటూ సవాళ్లు విసురుతున్నారు.
Read also:బీజేపీతో టచ్ లోకి జూనియర్.
విజయవాడ, మార్చి 20
నందమూరి కుటుంబం పై గాసిప్స్ నడుస్తుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా ప్రచారం నడుస్తూ ఉంటుంది. అయితే దానిపై స్పందించారు ఎన్టీఆర్ కుమార్తె, బిజెపి రాష్ట్ర చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టిందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణకు, ఎన్టీఆర్ కు మధ్య దూరం బాగా పెరిగిందని.. జూనియర్ ఎన్టీఆర్ తో ఉండడం వల్ల కళ్యాణ్ రామ్ ను సైతం బాలకృష్ణ పక్కన పెట్టారని వార్తలు గుప్పుమన్నాయి. నందమూరి కుటుంబమంతా ఒకవైపు.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకవైపు అన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇటువంటి సమయంలోనే పురందేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యానించారు.బాలకృష్ణదూకుడుగా ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు అన్ స్టాపబుల్ అంటూ సందడి చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలంతా వచ్చారు. కానీ నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం రాలేదు. దీంతో ఆ కుటుంబంలో విభేదాలు చర్చకు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పురందేశ్వరి మాట్లాడారు. నందమూరి కుటుంబంలో విభేదాలు లేవని అర్థం వచ్చేలా మాట్లాడారు.
అసలు ఆ పరిస్థితి లేదన్నట్టు సంకేతాలు ఇచ్చారు. దీంతో నందమూరి కుటుంబం చుట్టూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.ఓ మీడియా ఇంటర్వ్యూలో పురందేశ్వరి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ తో మీ అనుబంధం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు.. అత్తగా తనను తారక్ ఎంతో గౌరవిస్తాడని.. పెద్దలంటే చాలా గౌరవమని.. తనంటే బాగా ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా పిల్లలందరితో ప్రతిరోజు టచ్ లో ఉంటామని.. ప్రతిరోజు ఫోన్ చేస్తుంటామని.. వీడియో కాల్స్ కూడా చేసుకుని మాట్లాడుకుంటామని వివరించారు. సినిమాలకు సంబంధించి తాను తారక్, కళ్యాణ్ రామ్ లకు ఎటువంటి సలహాలు ఇవ్వనని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.బాలకృష్ణతో ఆ ఇద్దరూ యువ హీరోలకు గ్యాప్ భారీగా పెరిగిందని.. కోల్డ్ వార్ నడుస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలతో అటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. కొద్దిరోజుల కిందట బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించారు. ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. బాలా బాబాయ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో సైతం కళ్యాణ్ రామ్ బాబాయి ప్రస్తావన తీసుకొచ్చారు. మొత్తానికైతే నందమూరి కుటుంబంలో కోల్డ్ వార్ క్లైమాక్స్ కు చేరుకున్నట్టేనని తేలిపోయింది.