Andhra Pradesh:విశాఖపట్టణం కోసం మాస్టర్ ప్లాన్:విశాఖపట్నం.. వేగంగా అభివృద్ధి చెందే నగరం. అందుకే ప్రభుత్వం వైజాగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజాగా మంత్రి నారాయణ విశాఖ కొత్త మాస్టర్ ప్లాన్‌పై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్టు స్పష్టం చేశారు.నాలుగు నెలల్లో విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖ కొత్త మాస్టర్ ప్లాన్‌పై సచివాలయంలో ఆయన అధికారులు, విశాఖపట్నం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
విశాఖపట్టణం కోసం మాస్టర్ ప్లాన్
విశాఖపట్టణం, మార్చి 22
విశాఖపట్నం.. వేగంగా అభివృద్ధి చెందే నగరం. అందుకే ప్రభుత్వం వైజాగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజాగా మంత్రి నారాయణ విశాఖ కొత్త మాస్టర్ ప్లాన్‌పై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్టు స్పష్టం చేశారు.నాలుగు నెలల్లో విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖ కొత్త మాస్టర్ ప్లాన్‌పై సచివాలయంలో ఆయన అధికారులు, విశాఖపట్నం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘మే నెలాఖరులోగా విశాఖపట్నం మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఫైనాన్షియల్ సిటీ విశాఖ మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించాం. ప్రజలు, నేతల అభిప్రాయాలతో నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం. విశాఖ మెట్రో రైల్‌పైనా సమావేశంలో చర్చించాం. టీడీఆర్ బాండ్ల విషయంలో గతంలో అక్రమాలు జరిగాయి. విశాఖలో 600కు పైగా టీడీఆర్ బాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని విశాఖ కలెక్టర్ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించాం. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తాం. వైసీపీ హయాంలో మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా డీవియేషన్ జరిగింది’ మంత్రి నారాయణ ఆరోపించారు.
6 ముఖ్యమైన అంశాలు..
1.విశాఖపట్నం అభివృద్ధికి వీఎంఆర్‌డీఏ కొత్త విజన్‌ను రూపొందించింది.
2.విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నారు.
3.విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల అసెంబ్లీలో రోడ్ల అభివృద్ధి గురించి ప్రశ్నలు వేశారు.
4.విశాఖపట్నం మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయని, 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
5.విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించి, అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్-2041పై కొత్త ప్రభుత్వం దృష్టిసారించింది.
6.విశాఖపట్నం, భీమునిపట్నం, భోగాపురం, విజయనగరం, అనకాపల్లి, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాలు కొనుగోలు చేసిన వైసీపీ నేతలు వాటికి భవిష్యత్తులో మేలు జరిగేలా మాస్టర్ ప్లాన్‌ను మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విశాఖ అభివృద్ధికి ఏం చేయాలి..
మెరుగైన రహదారులు, వంతెనలు, ప్రజా రవాణా వ్యవస్థను నిర్మించాలి. నీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచాలి. విమానాశ్రయం, ఓడరేవులను విస్తరించాలి. ఐటీ, ఫార్మాస్యూటికల్స్, పర్యాటక రంగాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలి.
ప్రోత్సాహం ఇవ్వాలి..
విశాఖపట్నం సహజ అందాలను, చారిత్రక ప్రదేశాలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. పర్యాటకుల కోసం మెరుగైన వసతి, రవాణా సౌకర్యాలు కల్పించాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాలి. కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలి. చెట్లు నాటడం, పచ్చదనాన్ని పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడు విశాఖ తొందరగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read more:Andhra Pradesh:రాధా.. రాం..రాం..