Andhra Pradesh:ముగ్గురు ముఖ్య నేతల బ్యాక్ స్టెప్ ఎందుకు:అపోజిషన్‌లో ఉన్న పార్టీ నుంచి వలసలు కామన్. తెలుగు స్టేట్స్‌లో గత కొంతకాలంగా మనం ఇది చూస్తూనే ఉన్నాం. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంపింగ్స్ జరిగితే..ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వెళ్తున్నారు లీడర్లు. ఇదంతా రాజకీయాల్లో కొత్తేమి కాకపోయినా..వైసీపీని వీడిన, వీడుతున్న పలువురు నేతల విషయంలోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ముగ్గురు ముఖ్య నేతల బ్యాక్ స్టెప్ ఎందుకు..
ఒంగోలు, మార్చి 22
అపోజిషన్‌లో ఉన్న పార్టీ నుంచి వలసలు కామన్. తెలుగు స్టేట్స్‌లో గత కొంతకాలంగా మనం ఇది చూస్తూనే ఉన్నాం. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంపింగ్స్ జరిగితే..ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వెళ్తున్నారు లీడర్లు. ఇదంతా రాజకీయాల్లో కొత్తేమి కాకపోయినా..వైసీపీని వీడిన, వీడుతున్న పలువురు నేతల విషయంలోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీని వీడిన ముగ్గురు నేతల ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, లేటెస్ట్‌గా మర్రి రాజశేఖర్‌రెడ్డి..ఈ ముగ్గురు వైసీపీని వీడారు. ఇందులో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి జగన్‌కు వరుసకు మామయ్య అవుతారు. విజయసాయిరెడ్డి జగన్‌తో పాటు 16నెలలు జైలులో ఉండి వచ్చారు. ఇక మర్రి రాజశేఖర్ అయితే జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడిచి లాయల్‌గా ఉన్నారు.పదవులు వచ్చినా రాకున్నా..టికెట్ ఇచ్చిన ఇవ్వకున్నా అధినేత మాటే శాసనంగా పార్టీలో కొనసాగారు. తనకు ఇష్టం లేకపోయినా 2019లో విడదల రజినికి టికెట్ ఇస్తే ఆమె గెలుపునకు సహకరించారు. తనకు మంత్రి పదవి ఇస్తానన్న హామీ నిలబెట్టుకోకపోగా.. విడదల రజినికి మినిస్ట్రీ ఇచ్చినా కూడా సర్ధుకుపోయారు మర్రి రాజశేఖర్ఇలా ఎన్ని త్యాగాలు చేసినా గుర్తింపు లేదు.. కనీసం బుజ్జగింపులు లేవని ఆయన తన దారి తాను చూసుకుంటున్నారు.
ఈ ముగ్గురు నేతలు పార్టీ వీడటం వైసీపీ క్యాడర్‌తో పాటు ఏపీ పాలిటిక్స్‌లోనూ చర్చనీయాంశంగా ఉంది. అయితే పార్టీని వీడుతూనే..జగన్ టార్గెట్‌గా వాళ్లు చేస్తున్న విమర్శలు వైసీపీలో చర్చకు దారి తీస్తున్నాయి.నిజానికి బాలినేని వైసీపీని వీడుతారని చాలా రోజులు ప్రచారం జరిగింది. ఆయన పవన్ కల్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లారని వార్తలు వచ్చాయి. జనసేనలో ఆయన చేరిక కొన్నిరోజులు వాయిదా కూడా పడింది. అయినా బాలినేని బుజ్జగించలేకపోయారు. జగన్ బాలినేనిని పిలిచి మాట్లాడ లేదంటున్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి విషయంలోనూ ఇదే జరిగిందంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన చెప్పగా..అందుకు అభ్యంతరం చెప్పలేదని మీ ఇష్టం అన్నట్లుగా రెస్పాండ్ అయినట్లు టాక్ నడుస్తోంది.ఇక లేటెస్ట్‌గా మర్రి రాజశేఖర్ వైసీపీని వీడి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు. ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ఆరు నెలలుగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. అయినా మర్రి రాజశేఖర్‌ను సెట్ రైట్ చేయలేకపోయారు. ఆయన చివరకు టీడీపీలో చేరాలని డిసైడ్ చేసుకున్నాక..బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నేతలతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వైసీపీలో ఉండేది లేదని తేల్చి చెప్పారు.ఈ ముగ్గురు కీలక నేతలు. బాలినేని, విజయసాయి, మర్రి రాజశేఖర్ జగన్‌కు ఆప్తులు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడిచిన ముఖ్యులు.
ఈ ముగ్గురు పార్టీని వీడుతారని తెలిసినా వైసీపీ అధిష్టానం ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదన్న చర్చ జరుగుతోంది. అసంతృప్తిగా ఉన్నారని తెలిసినా పోతే పోనీలే అని లైట్ తీసుకున్నారన్న అన్న టాక్ వినిపిస్తోంది. లేకపోతే ఉన్నోళ్లే మనోళ్లు..వెళ్లాలనకునేవారిని ఆపోద్దని డిసైడ్ అయ్యారా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.వైసీపీ అధినేత తీరుకు కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ చర్చగా మారింది. తానే పార్టీ..పార్టీనే తాను అన్నట్లుగా జగన్ ఆలోచన అని..పోయేవాళ్లు పోతే కొత్త నాయకులను తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదన్న థాట్‌లో ఫ్యాన్ పార్టీ అధినేత ఉన్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు. తాను పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఉండే..ఇప్పుడు ఎంత మంది ఉన్నారో లెక్కలు వేసుకుంటున్నారట. పార్టీ బీఫామ్ ఇస్తామంటే క్యూ కట్టే వాళ్లలో ఒక్కో నియోజకవర్గంలో పదుల మంది నేతలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారట. పైగా తనను చూసే జనం ఓట్లేస్తారని జగన్ అభిప్రాయమట. 2019 ఎన్నికలకు ముందు ఓ ఇంటర్వ్యూలో జగన్ ఇదే విషయం చెప్పారని గుర్తు చేస్తున్నారు.సిచ్యువేషన్స్, ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్.. అన్నీ చూసుకున్నాకే అసంతృప్తుల జంపింగ్స్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది.
ఉండేవాళ్లు ఉంటారు.. పోయే వాళ్లు పోతారు..బతిమాలి పార్టీలో ఉంచితే.. వాళ్ల డిమాండ్స్ నెక్స్ట్ లెవల్ ఉంటాయని భావిస్తున్నారట. అందుకే ఎవరూ పార్టీని వీడుతున్నారని తెలిసినా..వైసీపీ పెద్దలుగా పేరున్నా నేతలే వారితో మాట్లాడుతున్నారట.మళ్లీ మనమే అధికారంలోకి వస్తామ్..ఆలోచించండి అని చెప్పడం తప్ప..అసంతృప్తుల నేతలను అధినేత పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవంటున్నారు. అందుకే పార్టీ మారిన నేతలు కూడా జగన్‌ను టార్గెట్ చేస్తున్నారట. ఇబ్బంది పడుతున్నామ్..తమకు న్యాయం జరగలేదని అని చెప్తే మీ ఇష్టం..మీరెక్కడున్నా బాగుండాలని కోరుకుంటానంటూ చెప్తున్నారట ఫ్యాన్ పార్టీ బాస్. కనీసం ఉండండి..భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఇస్తామన్న మాట కూడా చెప్పట్లేదట.ఒకరు పోతే పది మంది నాయకులు పుట్టుకొస్తారనే ధీమాలో ఉన్నారట. ఏదైనా పార్టీ పెట్టినప్పటి నుంచి..జగన్ వెంట నడిచిన నేతలు వైసీపీని వీడటం క్యాడర్‌కు నిరాశ కలిగిస్తోందట. కానీ అధినేతే అల్టిమేట్..ఆయనే బలం, అతడే ఓ సైన్యం..అని లైన్స్‌కు లీడర్లు, క్యాడర్ కట్టుబడి ఉంటున్నారట. అలకబూనుతున్న జగన్ ఆప్తుల లిస్టులో ఇంకెవరెవరు ఉన్నారో చూడాలి మరి.
Read more:Andhra Pradesh:టీడీపీ గూటికి రాపాక