Andhra Pradesh:మంత్రి పదవికి ఇంకా టైముంది

Nagababu news update

Andhra Pradesh:మంత్రి పదవికి ఇంకా టైముంది:నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడు? ఉగాదికి ఇస్తారా? లేకుంటే జూన్ లో పదవి ఇస్తారా? లేకుంటే మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి కేటాయిస్తారా? అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు ఏ సభలోను సభ్యుడు కారు. అందుకే ముందుగా ఎమ్మెల్సీ ని చేసి.. ఆపై మంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది.

మంత్రి పదవికి ఇంకా టైముంది

విజయవాడ, మార్చి 19
నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడు? ఉగాదికి ఇస్తారా? లేకుంటే జూన్ లో పదవి ఇస్తారా? లేకుంటే మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి కేటాయిస్తారా? అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు ఏ సభలోను సభ్యుడు కారు. అందుకే ముందుగా ఎమ్మెల్సీ ని చేసి.. ఆపై మంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కావడంతో మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు అన్నది ప్రశ్న.మరోవైపు బిజెపికి ఒక మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. సంఖ్యాబలం బట్టి తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని బిజెపి పట్టుబడుతోంది. బిజెపికి ఒకే ఒక మంత్రి పదవి కేటాయించారు. కానీ ఆ పార్టీ నుంచి దాదాపు 8 మంది గెలిచారు.

సుజనా చౌదరి తో పాటు విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి ఆశిస్తున్నారు. క్యాబినెట్ లో ఉన్నది ఒకే ఒక్క మంత్రి పదవి. అందుకే ఆ పదవి జనసేనకు ఇవ్వాలా? బిజెపికి ఇవ్వాలా? అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.అయితే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి. అయితే అది ఇప్పుడు ఇస్తారా? కొద్ది కొద్ది రోజులపాటు ఆగిన తర్వాత ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులు పదిమంది కొత్తగా గెలిచినవారే. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో సీనియర్లకు అవకాశం కల్పించి జూనియర్లకు పక్కన పెడతారని కూడా టాక్ నడుస్తోంది. అయితే అంతవరకు మంత్రి పదవి అందని ద్రాక్షగా ఉంటుందన్నది ఒకసారి కొత్త టాక్.నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన పదవీకాలం ఆరేళ్లు. అందుకే మంత్రివర్గ విస్తరణ వరకు ఆయనకు వెయిట్ చేయిస్తారని తెలుస్తోంది. అప్పట్లో 25 మంది మంత్రుల్లో సగానికి పైగా ఉద్వాసన చెబుతారని.. వారి బదులు సీనియర్లకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ లెక్కన నాగబాబు అప్పటివరకు ఆగాల్సిందేనని కూటమి వర్గాలు చెబుతున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

 Read also:లోకేశ్ కు పార్టీలో భారీ ఇమేజ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఇప్పుడు క్యాడర్ కు ఆశాజనకంగా ఉన్నారు. లోకేశ్ తోనే సాధ్యమవతుందని క్యాడర్ బలంగా నమ్ముతుంది. చంద్రబాబు నాయుడు చట్టాలు, చట్టుబండలంటూ కాలయాపన చేస్తారని, లోకేశ్ మాత్రం గత వైసీపీ ప్రభుత్వంలో తమపై జరిగిన కక్ష సాధింపు చర్యలకు దిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే నారా లోకేశ్ వల్లనే సాధ్యమవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. లోకేశ్ ఏడాదిన్నర పాటు యువగళం పాదయాత్ర జరిపినప్పుడు కూడా క్యాడర్ కు దగ్గరయ్యారని, వారి మనోభావాలను తెలుసుకుని వీలయినంత త్వరగానే క్యాడర్ ను తృప్తి పర్చేందుకు ప్రయత్నిస్తారని చెబుతున్నారు. టీడీపీ సోషల్ మీడియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మే నెలలో కడపలో జరగనున్న మహానాడులో లోకేశ్ కు కీలక బాధ్యతలను అప్పగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. రాజధాని పనులను గత ప్రభుత్వ హయాంలో… గత ప్రభుత్వ హయాంలో అనేక మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఊళ్లను వదిలి పారిపోయారు. అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు. జైళ్లకు వెళ్లి వచ్చారు. యువగళం పాదయాత్రలోనూ, తర్వాత ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ లోకేశ్ బదులుకు బదులు తీర్చుకుంటానని హెచ్చరించారు.

వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ తయారవతుందని, అందులో జాబితా ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తూ క్యాడర్ ను పోలింగ్ కేంద్రాల వైపునకు వేగంగా నడపగలిగారు. లోకేశ్ వల్ల సాధ్యమవుతుందని క్యాడర్ కూడా నమ్మింది. చంద్రబాబు ఊరుకున్నప్పటికీ లోకేశ్ ఊరుకోరని, తమను వేధించేవారిని వరసగా జైలుకు పంపేందుకు నారా లోకేశ్ వెనుకాడరని క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.చంద్రబాబు నాయుడు ఒకింత ఆలోచన చేస్తారు. రాజకీయంగానే కాకుండా ఆయన ప్రతీకారం వంటి వాటికంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. చంద్రబాబు నాయుడును కూడా గత ప్రభుత్వం వదల్లేదని, అలాంటి వారిని కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని క్యాడర్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒకరకంగా చంద్రబాబుకు యాంటీగా పోస్టులు పెడుతున్నారు. అదే లోకేశ్ విషయానికి వచ్చే సరికి లోకేశ్ ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తారంటూ నమ్ముతున్నారు. అందుకే క్యాడర్ లో రోజురోజుకూ లోకేశ్ కు ఇమేజ్ మరింత పెరుగుతుంది. చంద్రబాబుకు కూడా కావల్సింది అదే కావడంతో టీడీపీ క్యాడర్ లో మరింత ఉత్సాహం కనపడుతుంది.

Read more:Hyderabad:దళితుల దశాబ్దాల వర్గీకరణ కల నెరవేర్చాం

Related posts

Leave a Comment