Andhra Pradesh:బెజవాడలో సేవ్ బీసెంట్ రోడ్

Save Besant Road in Bezawada

Andhra Pradesh:బెజవాడలో సేవ్ బీసెంట్ రోడ్:విజయవాడలో ప్రధాన వాణిజ్య ప్రాంతమైన బీసెంట్‌ రోడ్డులో అనధికారిక వ్యాపారాలు రాజకీయ నాయకులకు కాసులు పండిస్తున్నాయి. మునిసిపల్‌ రోడ్డును హాకర్లకు అద్దెలకిస్తూ ప్రతి నెల లక్షలు పోగేసుకుంటున్నారు. ఈ దందా శృతి మించడంతో వ్యాపారులు సేవ్ బీసెంట్‌ రోడ్డు కాంపెయిన్ ప్రారంభించారు.విజయవాడ బీసెంట్‌ రోడ్డులో వ్యాపారులు ప్రారంభించిన సేవ్ బీసెంట్‌ రోడ్డు ఉద్యమం చర్చనీయాంశంగా మారింది. పేదల ఉపాధి మాటున సాగుతున్న దందాను తెరపైకి తెచ్చింది. దశాబ్దాలుగా సాగుతున్న వ్యవస్థీకృత దందాను బయటపెట్టింది.

బెజవాడలో సేవ్ బీసెంట్ రోడ్

విజయవాడ, మార్చి 20

విజయవాడలో ప్రధాన వాణిజ్య ప్రాంతమైన బీసెంట్‌ రోడ్డులో అనధికారిక వ్యాపారాలు రాజకీయ నాయకులకు కాసులు పండిస్తున్నాయి. మునిసిపల్‌ రోడ్డును హాకర్లకు అద్దెలకిస్తూ ప్రతి నెల లక్షలు పోగేసుకుంటున్నారు. ఈ దందా శృతి మించడంతో వ్యాపారులు సేవ్ బీసెంట్‌ రోడ్డు కాంపెయిన్ ప్రారంభించారు.విజయవాడ బీసెంట్‌ రోడ్డులో వ్యాపారులు ప్రారంభించిన సేవ్ బీసెంట్‌ రోడ్డు ఉద్యమం చర్చనీయాంశంగా మారింది. పేదల ఉపాధి మాటున సాగుతున్న దందాను తెరపైకి తెచ్చింది. దశాబ్దాలుగా సాగుతున్న వ్యవస్థీకృత దందాను బయటపెట్టింది. సొంత భవనాల్లో పరాయి వారిలా వ్యాపారాలు చేసుకునే దుస‌్థితి యజమానులదైతే, పొట్ట కూటి కోసం రోడ్లపై వ్యాపారాలకు కూడా అద్దె చెల్లించాల్సిన పరిస్థితి బడుగు జీవులది.విజయవాడ వీధుల్లో వ్యాపారాలు కూడా రోజుకు లక్షలు సంపాదించి పెడతాయంటే నమ్మశక్యం కాదు. ఈ లాభాలు వ్యాపారాలు చేసే వారికి కాకుండా వారికి అండగా ఉంటామని చెప్పే నేతలకు కావడం విశేషం. ఏళ్ల తరబడి వ్యవస్థీకృతంగా సాగుతోన్న ఈ దందాలో తాజాగా రాజకీయ పోరు మొదలైంది.విజయవాడలో ప్రధాన మార్గలైన ఏలూరు రోడ్డు-బందరు రోడ్డులను కలుపుతూ ఉండే బీసెంట్‌ రోడ్డులో వందలాది వాణిజ్య సంస్థలు ఉంటాయి.గుండు సూది మొదలుకుని వస్త్రాలు, ఆభరణాలు ఇలా ఏమి కావాలన్నా ఈ మార్కెట్‌కు వెళితే దొరుకుతాయి.

రోడ్డుకు ఇరువైపులా ఉండే దుకాణాల ముందు మరో దందా ఉంటుంది. ఈ రోడ్డులో ప్రతి దుకాణం ముందు నాలుగైదు బుట్టలు, టేబుళ్లు, తోపుడు బళ్లు ఉంటాయిబీసెంట్‌ రోడ్డులో ఉండే రద్దీతో పాటు ఆ తాత్కలిక దుకాణాలకు కూడా దశాబ్దాల చరిత్ర ఉంది. భవనాల్లో సాగే వ్యాపారాలకు మునిసిపల్, కమర్షియల్‌ టాక్స్‌లు, ఎలక్ట్రికల్ బిల్లులు ఉంటే రోడ్లపై సాగే వ్యాపారాలకు ప్రజాప్రతినిధుల టాక్స్‌ ఉంటుంది. వ్యాపారం స్థాయిని బట్టి రోజు వారీ అద్దెను వసూలు చేస్తుంటారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారాలను కొందరు కార్మిక సంఘాల నాయకులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధి పంచేసుకుని.. వాటిని విభజించి తమ అనుచరులకు ప్రాంతాల వారీగా అప్పగించారు.ఇలా ఒక్కో వ్యాపారానికి రోజుకు రూ.500 నుంచి రూ.1500 వరకు అద్దె వసూలు చేస్తారు. దాదాపు కిలోమీటరు పొడవు ఉండే బీసెంట్‌ రోడ్డుకు ఇరువైపులా 200వందల మందికి పైగా చిరు వ్యాపారులు ఉంటారు.ఈ వీధి వ్యాపారులపై భవనాల్లో వ్యాపారాలు చేసే వారికి అక్కసుగా ఉన్నా వారి వెనుక ఉన్న నేతలకు భయపడి ఎవరు ప్రశ్నించే సాహసం కూడా చేసేవారు కాదు.బీసెంట్‌ రోడ్డుకు ఇరువైపులా రెండు మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సొమ్ము చేసుకోవడం కూటమి ప్రభుత్వంలో ఓ నాయకుడికి ఆగ్రహం కలిగించింది. తాము అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వారు దందా చేయడం ఏమిటని భావించడంతో తాజా రగడ మొదలైంది. ప్రజా ప్రతినిధి అండతో రోడ్డు మధ్యలో కొత్తగా తోపుడు బళ్లను ఏర్పాటు చేయించడంతో వివాదం మొదలైంది.

మార్చి 12న కొత్తగా 20 తోపుడు బళ్లను రోడ్డు మధ్యలో ఏర్పాటు చేయడంతో వివాదం ముదిరింది.నిజానికి బీసెంట్‌ రోడ్డులో షోరూమ్‌లలో చేసే వ్యాపారాలకు, రోడ్లపై చేసే వ్యాపారాలకు సంబంధం ఉండదు. రోడ్లపై విక్రయించే వస్తువులు ప్రధానంగా పేదలు, మధ్య తరగతి వర్గాలకు అవసరమైనవి ఉంటాయి. దుస్తులు, చెప్పులు, పళ్లు, అలంకార వస్తువులు, ఫ్యాన్సీ వస్తువులు, గార్మెంట్స్‌ విక్రయాలు జరుగుతుంటాయి. చిరు వ్యాపారులకు ఉపాధి కావడంతో వ్యాపారులు కూడా సర్దుకుపోతూ వచ్చారు. చివరకు పరిస్థితి కాస్త ఒంటె, గుడారం తరహాలో తయారైందిఇన్నాళ్లు రెండు వరుసల వ్యాపారాలతో రోడ్డు అడుగు తీసి అడుగు వేయలేనంత రద్దీగా ఉంటే తాజాగా మూడో వరుసలో వ్యాపారాలు ప్రారంభించడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ వివాదం వెనుక ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు ఉండటంతో అధికారులు కూడా వేచి చూసే ధోరణి ఆవలంబిస్తున్నారు. మార్చి 12 నుంచి బీసెంట్‌ రోడ్డులో వ్యాపారాలపై పట్టు కోసం ఘర్షణలు జరుగుతున్నాయి. కొత్తగా 20 తోపుడు బళ్లను స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరులు ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది.రోడ్డు వ్యాపారాల వివాదంపై అధికారులకు పూర్తి సమాచారం ఉన్నా చోద్యం చూస్తున్నారు. ఈ రోడ్డులో అనధికారిక వసూళ్లలో విజయవాడ పోలీసులకు కూడా భాగం ఉండటంతో వివాద పరిష్కారం జోలికి పోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

రోడ్లపై అనధికారిక వ్యాపారాలను తొలగిస్తే అందరి జేబులకు చిల్లు పడుతుందనే ఉద్దేశం నాయకులకు ఉంది. దీంతో ఎవరు వెనక్కి తగ్గడం లేదు. కొత్తగా వ్యాపారాల కోసం తీసుకొచ్చిన బళ్లపై దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి.బీసెంట్‌ రోడ్డు వివాదంపై వ్యాపారులు, భవన యజమానులు మంత్రి నారా లోకేష్‌ను ఆశ్రయించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్‌, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నారా లోకేష్ వివాద పరిష్కార బాధ్యతను విజయవాడ ఎంపీకి అప్పగించారు. పగలు, రాత్రి తేడా లేకుండా రోడ్లను పూర్తిగా ఆక్రమించి ఉంచడంతో దుకాణాలకు సరుకు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు.వీధి వ్యాపారుల నుంచి వసూళ్లు ప్రతి నెల రూ.40.50లక్షల వరకు ఉండటంతో వాటి మీద పట్టుకోసం పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. పేరుకు పేదల బతుకు దెరువు ఉన్నా వాటి వెనుక రాజకీయ నాయకుల వసూళ్ల దందా ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. వివాదం పరిష్కారమైనా ఉన్న దాంట్లో అందరి వాటాల లెక్క తేలినా చాలని భావిస్తున్నారు. మరోవైపు ఆక్రమణలు పెరిగి పోవడంతో వ్యాపారులు సేవ్ బీసెంట్ రోడ్డు అంటూ తమ దుకాణాల ముందు ప్రచారం చేస్తున్నారు. బ్రాండ్ ఏపీ అని ప్రచారం చేస్తోన్న ప్రభుత్వం అక్రమ వసూళ్ల దందాకు ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి.

Read more:Andhra Pradesh:గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలి

Related posts

Leave a Comment