Andhra Pradesh:ప్రైవేటీకరణపై ఇంకా ఆందోళనే:గత కొద్దిరోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కుదిపేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడంతో ప్రైవేటీకరణ నిలిచిపోయిందని అంతా భావిస్తున్నారు. అయితే కార్మికులతో పాటు ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన కొనసాగుతోంది. ఇలా ప్యాకేజీ ఇచ్చే కంటే విశాఖ స్టీల్ కు సొంత గనులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేయాలని కోరుతున్నారు. ఇప్పటికీ ప్రైవేటీకరణ ఆగలేదన్నది కార్మికుల అభిప్రాయం. ఈ విషయంలో కేంద్రం కూడా పూర్తి స్పష్టత ఇవ్వలేదు.
ప్రైవేటీకరణపై ఇంకా ఆందోళనే
విశాఖపట్టణం, మార్చి 21
గత కొద్దిరోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కుదిపేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడంతో ప్రైవేటీకరణ నిలిచిపోయిందని అంతా భావిస్తున్నారు. అయితే కార్మికులతో పాటు ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన కొనసాగుతోంది. ఇలా ప్యాకేజీ ఇచ్చే కంటే విశాఖ స్టీల్ కు సొంత గనులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేయాలని కోరుతున్నారు. ఇప్పటికీ ప్రైవేటీకరణ ఆగలేదన్నది కార్మికుల అభిప్రాయం. ఈ విషయంలో కేంద్రం కూడా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. పాడి త్రినాథ్ అనే కార్మిక సంఘం నేత కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాశారు. ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత కోరుతూ ఆయన ఈ లేఖ రాశారు. తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చేసింది. దీంతో కార్మిక సంఘాలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్యమించడానికి సిద్ధపడుతున్నాయి.వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర పైకి వచ్చింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయిందని కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చంద్రబాబుతో పాటు పవన్ హామీ ఇచ్చారు.
అందుకు తగ్గట్టుగానే విశాఖ ఉక్కు కు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందని విస్పష్ట ప్రకటన చేయలేదు కేంద్రం. దీంతో కార్మిక సంఘాల్లో ఒక రకమైన అనుమానం ఉంది. ఫాక్ట్ చెక్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కార్మిక సంఘం నేత లేఖ రాశారు. అయితే దానికి రిప్లై ఇచ్చే క్రమంలో ఉక్కు పరిరక్షణకు తమ వంతు కృషి ఉంటుందని చెప్పిందే కానీ.. ఇక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. పైగా విశాఖ ఉక్కును కేంద్రం విక్రయిస్తుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఉద్యమాలు తీవ్రంగా సాగుతున్న సమయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రంగంలోకి దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. అనంతరం విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరించబోమని తేల్చి చెప్పారు. అటు తరువాత పదివేల కోట్లకు పైగా నిధులను కూడా కేటాయించారు. దీంతో ఇక ప్రైవేటీకరణ అనేది ముందుకు సాగదని అంతా భావించారు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై పూర్తి స్పష్టతనివ్వడం లేదు కేంద్రం. నిలుపుదల చేస్తామని నేరుగా చెప్పడం లేదు. ప్రైవేటీకరణ ఆగదని సంకేతాలు ఇచ్చేలా చెప్పడంతో మరోసారి అనుమానాలు ప్రారంభమయ్యాయి.
Read alsoకడప జెడ్పీ పీఠంపై కూటమి.. ?
కడప, మార్చి 21
వైయస్సార్ కాంగ్రెస్( పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో సవాల్ ఎదుర్కొంటున్నారు. కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో జడ్పీ పీఠం నిలబెట్టుకోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ గా మారనుంది. జడ్పీ చైర్మన్ గా ఉన్న అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో జడ్పీ చైర్మన్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి భారీ విజయం నమోదు చేసుకుంది. ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, బద్వేలు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల కు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయింది. ఈ తరుణంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్తు స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అమర్నాథ్ రెడ్డికి వరించింది. 2024 ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో అమర్నాథ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇంకా 15 నెలలపాటు జిల్లా పరిషత్ కు గడువు ఉంది. ప్రస్తుతం వైస్ చైర్పర్సన్ గా ఉన్న శారద చైర్ పర్సన్ గా వ్యవహరిస్తూ వచ్చారు.ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పిటిసి సభ్యులు ఐక్యంగా కనిపిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా వారిని శిబిరాలకు తరలించే పనిలో పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే జడ్పీ చైర్మన్ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలు వేరువేరు శిబిరాలుగా విడిపోయారు. ప్రధానంగా బ్రహ్మంగారిమఠం జడ్పిటిసి సభ్యుడు రామ గోవిందరెడ్డి అభ్యర్థిత్వం వైపు జగన్ మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ ఆయన వైపు చాలామంది జడ్పిటిసిలు ఆసక్తి చూపడం లేదు. ఈ తరుణంలో చాలామంది జడ్పిటిసిలు కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమయింది. తమ పార్టీ జడ్పిటిసి లను కాపాడుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే భారీగా తాయిలాలు సైతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.ఉమ్మడి కడప జిల్లాలో50 మంది జడ్పిటిసి సభ్యులు ఉన్నారు. 2021 లో జరిగిన ఎన్నికల్లో 49 మంది సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. గోపవరం మండలం నుంచి మాత్రమే టిడిపి అభ్యర్థి అప్పట్లో విజయం సాధించారు. అయితే చాలామంది జడ్పిటిసిలు కూటమి పార్టీలకు అనుకూలంగా వ్యవహరించారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో తిరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనుమానం కూడా అదే. అయితే కడప జిల్లా పరిషత్తు చైర్మన్ పీఠాన్ని వదులుకుంటే మాత్రం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి మరింత ఇబ్బందులకు గురిచేసి అంశమే. అందుకే జగన్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా మొత్తం 50 మంది సభ్యులకు గాను.. 47 మంది జడ్పీటీసీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కూటమి పార్టీల వైపు జడ్పీటీసీలు వెళ్లిపోయారని. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు ఉండడంతో విజయం తమదేనని కూటమి భావిస్తోంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ జడ్పిటిసి లను తీసుకుని క్యాంపు రాజకీయానికి బయలుదేరినట్లు సమాచారం. మరి కడప జిల్లా రాజకీయం ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.
Read more:Andhra Pradesh:జైలు పక్షిలా పోసాని. పాపం.. పట్టించుకొనేవారేరి