Andhra Pradesh:పవన్ డిఫెన్స్ లో పడిపొయారా:జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తాను అనుకున్నది సాధించలేకపోతున్నారు. లక్ష్యం కూడా ఎంత దూరంలో ఉందో తెలియదు. ముఖ్యమంత్రి గా పవన్ కల్యాణ్ ను చూడాలని కాపు సామాజికవర్గం, పవన్ అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ లో అటువంటి ఆలోచన లేకపోవడంపై వారిలోనే చర్చ జరుగుతుంది.
పవన్ డిఫెన్స్ లో పడిపొయారా
విజయవాడ, మార్చి 18
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తాను అనుకున్నది సాధించలేకపోతున్నారు. లక్ష్యం కూడా ఎంత దూరంలో ఉందో తెలియదు. ముఖ్యమంత్రి గా పవన్ కల్యాణ్ ను చూడాలని కాపు సామాజికవర్గం, పవన్ అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ లో అటువంటి ఆలోచన లేకపోవడంపై వారిలోనే చర్చ జరుగుతుంది. తాము అనుకున్నది వేరని, ప్రతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కాపు సామాజికవర్గానికి చెందిన వారుంటారని, ఇక పవన్ కల్యాణ్ కు మద్దతిచ్చినందుకు ప్రత్యేకంగా సాధించింది ఏముందన్న ప్రశ్న ఆ సామాజికవర్గం నుంచి ఈ మధ్య కాలంలో బలంగా వినిపిస్తుంది. వైసీపీ విమర్శలు చేస్తూ కాలం గడిపేసే రోజులు పోయాయి. ఎందుకంటే జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలుపై కూడా పవన్ కల్యాణ్ ప్రశ్నించకపోవడంతో పాటు టీడీపీకి బలమైన మద్దతుదారుగా మారడాన్ని కూడా జనసేన కార్యకర్తల నుంచి సామాజికవర్గం నేతలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము ఊహించింది ఒకటి.. జరుగుతున్నదొకటిలా తయారయిందన్న నిరాశ నిస్పృహలు వారిలో కనిపిస్తున్నాయి. అయితే తాము ఏ మాత్రం దాచుకోకుండా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా కుండబద్దలు కొట్టేస్తున్నారు. పదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని చేసిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యల దగ్గర నుంచి ఇటువంటి పరిస్థితి తలెత్తింది.
ఇక కాపు, బలిజ సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య కూడా పవన్ కల్యాణ్ ను నేరుగా తప్పుపడుతూ బహిరంగ లేఖను రాస్తున్నారు. ఇది కొంత పవన్ తో పాటు జనసేనకు కూడా ఇబ్బందికరంగా మారింది. రాజధాని నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్న ప్రభుత్వం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అభివృద్ధిపై పవన్ కల్యాణ్ పెదవి విప్పకపోవడంపై జనసేన అధినేత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని నిర్మాణం అనేది దశల వారీగా జరగాలని, అంతే తప్ప నిధులన్నీ అక్కడ వెచ్చించి మిగిలిన ప్రాంతాలకు, సంక్షేమ పథకాలను అందించకుండా ప్రజలను మోసం చేయడం కాదా? అని కాపు నేతలే ప్రశ్నిస్తున్నారు.వరసగా అగ్రనేతలు తప్పని కష్టాలు ఇరకాటంలో పెట్టేదే… ఇది కొంత పవన్ కల్యాణ్ ను ఇరకాటంలో పెట్టేదే. ఎందుకంటే పవన్ కల్యాణ్ పై ఎన్నికలకు ముందు వరకూ ఎన్నో హోప్స్ ఉన్నాయి. 2014 నుంచి ఆయన ప్రసంగాలు, ఆవేశపూరిత పంచ్ లు విని ఊగిపోయిన వారు నేడు జరుగుతున్న తీరు చూసి ఉసూరుమంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనే అర్థమవుతుంది. ఎఫెన్స్ లో ఉంటేనే పవన్ కల్యాణ్ ఇమేజ్ పెరుగుతుంది తప్పించి, డిఫెన్స్ లో ఉంటే ఖచ్చితంగా డ్యామేజీ అవ్వకతప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుందని అంచనా వేసిన వారికి నేడు ఆయన నుంచి వస్తున్న స్పందన చూసి డల్ అయినట్లే కనిపిస్తుంది.
Read also:భోగాపురం ఎయిర్ పోర్టులో అపశృతి
విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణ పనుల్లో ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి చనిపోయాడు. భోగాపురం విమానాశ్రయం లోపల రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. అయితే రోడ్ల నిర్మాణానికి బండరాళ్లు అడ్డుగా రావటంతో వాటిని తొలగించే పనులు చేపట్టారు. అందులో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లోపలి ప్రాంతంలో బండరాళ్లను బాంబులు పెట్టి పేల్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరగటంతో రామచంద్రపేటకు చెందిన బోర కొత్తయ్య అనే వ్యక్తి చనిపోయాడు. ఘటనలో బోర కొత్తయ్యకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం చేస్తూ 15 రహదారుల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వీఎంఆర్డీఏ పరిధిలోని అన్ని నియోకజవర్గాల్లోనూ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతిపాదించిన 15 రహదారుల్లో ఇప్పటికే మారికవలస రహదారి నిర్మాణం పూర్తైందని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి మిగతా వాటిని పూర్తిచేస్తామన్నారు.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2200 ఎకరాలలో నిర్మిస్తున్నారు. మూడు దశల్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు చేపడుతున్నారు. మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండో దశలో ఈ సంఖ్యను రెట్టింపు చేయనున్నారు. ఇక మూడో దశలో మరో 60 లక్షల మంది ప్రయాణికులు అంటే.. ఏడాదికి కోటీ 80 లక్షల మంది రాకపోకలు సాగించేలా ఎయిర్పోర్టు సామర్థ్యాన్ని పెంచనున్నారు. రూ.4592 కోట్లతో మొదటి విడత పనులు చేస్తున్నారు. 2023 మే నెలలో ఈ పనులకు శంకుస్థాపన జరగ్గా.. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.