Andhra Pradesh:పది నెలలైనా ఇంతేనా.. తమ్ముళ్లలో పెరుగుతున్న అసహనం:తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతుంది. అయితే ఇప్పటికే క్యాడర్ లో ఒకరకమైన అహసనం కనపడుతుంది. తమకు ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించడమేంటని క్యాడర్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలతో కొందరు కుమ్మక్కై వెనకాడుతున్నారని కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు నమోదు చేసిన వారిపై ఇప్పటి వరకూ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు సూటిగానే ప్రశ్నిస్తున్నారు.
పది నెలలైనా ఇంతేనా
తమ్ముళ్లలో పెరుగుతున్న అసహనం
గుంటూరు మార్చి 21
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతుంది. అయితే ఇప్పటికే క్యాడర్ లో ఒకరకమైన అహసనం కనపడుతుంది. తమకు ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించడమేంటని క్యాడర్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలతో కొందరు కుమ్మక్కై వెనకాడుతున్నారని కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు నమోదు చేసిన వారిపై ఇప్పటి వరకూ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. అయితే చట్ట ప్రకారమే చర్యలకు దిగుతామని చంద్రబాబు పదే పదే చెబుతున్నా తమ్ముళ్లు మాత్రం తొందరపడుతున్నారన్న టాక్ వినపడుతుంది. ఇదిలా ఉండగానే ఎమ్మెల్యేలు కూడా అసహనం వ్యక్తం చేస్తుండటం పార్టీని ఇరకాటంలోకి నెట్టేసింది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ పార్టీలో కాక రేపుతున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలను పార్టీ అగ్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఏదైనా ఉంటే ఇటువంటి విషయాలు అంతర్గతంగా మాట్లాడాలి తప్పించి ఇలా అసెంబ్లీలో మాట్లాడటేమేంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యామన్న ఆనందం లేదని, తమ పనులు ఒక్కటి కూడా జరగడం లేదని, ఎందుకు ఎన్నికయ్యామో కూడా అర్థం కావడం లేదని వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లా డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్ గా పనిచేశారు. ఆ సమయంలో అనేక సంస్కరణలను చేపట్టారు. అయితే ఆయన తర్వాత వైసీపీకి రాజీనామా చేసి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరిపోయారు. వెంకట్రావు రాజీనామా చేసిన తర్వాత బ్యాంకులో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. పెద్దయెత్తున అవినీతి జరిగిందని యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి రావడంతో వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. కానీ కొన్ని నెలలు గడుస్తున్నా అధికారులు డీసీసీబీలో జరిగిన అవకతవకలపై విచారణ జరపకపోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఉన్నతాధికారుల తప్పిదమా? లేక అగ్రనేతల నిర్లక్ష్యమా? అన్నది తేలకుండా ఉంది. .. ఇది ఒక యార్లగడ్డ వెంకట్రావు మాత్రమే కాదు టీడీపీలో ఉండి గత ప్రభుత్వంలో కేసులు నమోదు చేయించుకుని, జైలుకు వెళ్లి వచ్చిన వారు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చట్టం పేరుతో కాలయాపన చేస్తూ పోతుంటే క్యాడర్ లో తాము పలచన అవ్వక తప్పదని వారు చెబుతున్నారు. రాయలసీమలోని కొందరు ఎమ్మెల్యేలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా మంత్రుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే తొందరపడవద్దని వరసగా వేధించిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తామని బుజ్జగించి పంపుతున్నారు. దీంతో టీడీపీలో ఇటు క్యాడర్ తో పాటు అటు ఎమ్మెల్యేలు కూడా పెల్లుబుకుతున్న ఆగ్రహంపై నీళ్లు చల్లాల్సిన అవసరం అధినాయకత్వంపై ఉంది.
Read also: వెతుకుతున్న నిఘా కళ్లు
విజయవాడ, మార్చి 21
ట్రాఫిక్ పోలీసులు లేరని లైట్ తీసుకున్నారు.. నిబంధనల్ని పట్టించుకోలేదు. కట్ చేస్తే ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే వాహనాలకు భారీగా చలానాలు కనిపించాయి. విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్ ఒక రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా జంప్ చేశాడు. రెండు రోజుల తర్వాత ఈ-చలానా చెక్ చేస్తే రెడ్ సిగ్నల్ జంప్ చేసినందుకు రూ.వెయ్యి జరిమానా పడింది. మరో విద్యార్థి హెల్మెట్ లేకుండా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఒకే బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేశారు. దీంతో ఈ బైక్‌కు రూ.2000 జరిమానా పడింది. పోలీసులు లేకుండా జరిమానాలు ఎలా సాధ్యమంటూ ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.విజజయవాడలో ట్రాఫిక్ కూడళ్లపై పోలీసులు నిఘాను పెంచారు. మొన్నటి వరకు సిగ్నల్స్ దగ్గర వాహనదారులకు అవగాహన కల్పించిన పోలీసులు.. తాజాగా ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ/ ఐటీఎంఎస్ (ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)ల ద్వారా నిఘా పెంచారు. ఐటీఎంఎస్ ద్వారా ఈ చలానాలను నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు లేరని గీత దాటితే జరిమానాలు పండుతున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ఈ ఐటీఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మార్చి 1 నుంచి అమల్లోకి రాగా.. ముందే అధికారులు ప్రకటనలు కూడా ఇచ్చారు. ఐటీఎంఎస్ విధానం ఉందని చాలామందికి తెలియలేదు.. దీంతో కెమెరాలకు అడ్డంగా దొరికిపోతున్నారు.విజయవాడలో ట్రాఫిక్ పెరిగిపోయింది.. పోలీసు సిబ్బంది కూడాసరిపడా లేరు.
అయినా సరే మొన్నటి వరకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. అయితే పోలీసులు లేనిచోట్ల కొందరు వాహనదారులు రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లడంతో మిగిలిన వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. నిబంధనల్ని పాటించనివారిని కట్టడి చేసేందుకుఐటీఎంఎస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు ట్రాఫిక్ పోలీసులు. విజయవాడలోని ఆరు కూడళ్లలో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేయగా.. మరో 10 చోట్ల కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని.. చలనాలు కొని తెచ్చుకోవద్దంటున్నారు పోలీసులు.రెడ్ సిగ్నల్ పడిన తర్వాత వెళితే జరిమానా పడుతుందన్నారు. ట్రాఫిక్ పోలీసులు లేరని ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వెళితే కెమెరాకు దొరికిపోతారంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు రెడ్ సిగ్నల్ జంప్, హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఆటోడ్రైవర్‌కు యూనిఫాం లేకపోవడం, వన్ వే నిబంధన ఉల్లంఘన, ఓవర్‌లోడ్ వంటి అంశాలను గమనిస్తున్నారు. మార్చి 6 నుంచి ఈ ఐటీఎంఎస్ చలానాల విధింపును అమలు చేస్తున్నారు. విజయవాడలో వారం రోజుల్లో 211 మంది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడంతో జరిమానా విదించారు. ఏ ఉల్లంఘనకైనా రూ.1000లు కట్టాల్సిందే.. ఒకవేళ ట్రాఫిక్ ఉల్లంఘన అత్యంత తీవ్రమైనదైతే.. కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు పోలీసులు. వాహనదారులు ఈ విషయాలను గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read more:Andhra Pradesh:అఖిలప్రియ సొంత పార్టీలో శత్రువులు.. బయిట పడేదెలా.