Andhra Pradesh:టీడీపీ గూటికి రాపాక

Former Rajolu MLA Rapaka Varaprasada Rao,

Andhra Pradesh:టీడీపీ గూటికి రాపాక:జనసేన పార్టీ తొలి ఎమ్మెల్యేగా నెగ్గి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా గుర్తింపు పొందిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రస్తుతం దారెటు..? ఆయన ఏ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు కోనసీమలో ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన కదలికలు గమనిస్తున్న పలువురు ఆయన టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారననే టాక్ ఆసక్తిగా మారింది. రాజోలు నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడం ఈ ప్రచారనికి మరో కారణంగా కనిపిస్తోంది.

టీడీపీ గూటికి రాపాక

విజయవాడ, మార్చి 22
జనసేన పార్టీ తొలి ఎమ్మెల్యేగా నెగ్గి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా గుర్తింపు పొందిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రస్తుతం దారెటు..? ఆయన ఏ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు కోనసీమలో ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన కదలికలు గమనిస్తున్న పలువురు ఆయన టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారననే టాక్ ఆసక్తిగా మారింది. రాజోలు నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడం ఈ ప్రచారనికి మరో కారణంగా కనిపిస్తోంది. రాజోలులో వ్యక్తిగత ఓటు బ్యాంకు కలిగిన నాయకునిగా గుర్తింపు ఉన్న రాపాక వరప్రసాదరావుకు ఇప్పుడు ఇదే అంశం కలిసొచ్చే అవకాశాలున్నాయని పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. రాజోలు నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీకి షాకు ఇచ్చి వైసీపీలో చేరి టిక్కెట్టు దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీకి ఏకైన ఎమ్మెల్యేగా గెలుపొందిన రాపాక జనసేనకు షాక్‌ ఇచ్చి వైసీపీలో గూటికి చేరారు. 2024లో వైసీపీ టికెట్టు తనదే అనుకున్న సమయంలో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన గొల్లపల్లికి అసెంబ్లీ టికెట్టు ఇచ్చి రాపాకకు వైసీపీ షాక్‌ ఇచ్చింది. అయితే అమలాపురం ఎంపీ టికెట్టు ఇచ్చినా అయిష్టతతోనే ఆయన పోటీలో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్నికల అనంతరం ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీకు గుడ్‌బై చెప్పారు. గొల్లపల్లి వైసీపీకి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి రాజోలులో టీడీపీకి నాయకుడు లేడు. ఇప్పుడు రాపాక చూపులు టీడీపీ వైపు పడటం వెనుక కారణమిదే అంటున్నారు.

రాజోలులో టీడీపీకి ఇంచార్జ్‌ లేకపోవడం రాపాకకు కలిసొచ్చే అంశమని, రాపాక రాకకు మార్గం సుగమం అవుతుందంటున్నారు. మొన్నటి సాధరణ ఎన్నికల తరువాత వైసీపీకి గుడ్‌బై చెప్పిన రాపాక వరప్రసాదరావు టీడీపీ కీలక నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు తదితరులను కలిసినట్లు టాక్. ప్రస్తుతం రాపాక ఎటూ వెళ్లక సైలెంట్‌గా ఉన్నా కూడా ఆయన మాత్రం టీడీపీలోకి చేరేందుకు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారని మాత్రం స్థానికంగా తీవ్రంగా చర్చజరుగుతోంది.. టీడీపీలోకి రాపాక రాకను జనసేన ఓకే చెబుతుందా లేకుంటే వ్యతిరేకిస్తుందా అనేది మాత్రం క్లారిటీ లేదు. గెలిచిన వ్యక్తికి సరైన ప్రాధాన్యత ఇస్తే వెళ్లిపోవడంతో ఆయనపై జనసేన చాలా కోపంతో ఉంది. ఇప్పుడు అలాంటి వ్యక్తిని టీడీపీలోకి చేరనిస్తారా అనేది తేలాల్సిన అంశం. కూటమి పార్టీల్లో నాయకుల చేరికలు పరస్పర అంగీకారంతోనే సాగుతున్నాయనే టాక్ ఒకటి ఉంది. అందుకే చాలా మంది వైసీపీ నేతలు వివిధ పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటి మిత్ర పక్షాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లేకపోవడం ఒక కారణ. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు రెండో కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు రాపాక విషయంలో ఏం జరుగుతుందో చూడాలి

Readalso: ఆపరేష్ గరుడ..

కడప మార్చి 22
ఏపీలో మెడికల్ షాపులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై దాడులు జరుగుతున్నాయి. మెడికల్ షాపులతో పాటు ఏజెన్సీలపైనా దాడులు కొనసాగిస్తున్నారు. ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, లోకల్ పోలీసులతో పాటు డ్రగ్ కంట్రోల్ బృందాలు సంయుక్తంగా సోదాలు చేపడుతున్నారు. దాదాపు 100 బృందాలు ఏపీ వ్యాప్తంగా తనిఖీలు, దాడులు చేస్తున్నాయి. విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి.ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కడప, ఒంగోలు, విజయవాడల్లో విజిలెన్స్, ఈగల్, డ్రగ్ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 100కు పైగా బృందాలతో మెడికల్ షాపుల్లో తనిఖీలు చేశారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్న మెడికల్ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా.. 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. ఆపరేషన్ గరుడ అనేది ఆంధ్రప్రదేశ్ లోని వివిధ నేరాలను అరికట్టడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమం. ఇది ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వాడకం, అమ్మకం పెరగడం వల్ల యువత చెడిపోతున్నారు. దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “ఆపరేషన్ గరుడ” పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాను అరికట్టడానికి, డ్రగ్స్ వాడేవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ షాపులలో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, ఇతర డ్రగ్స్ అమ్మడం వంటి వాటిపై దాడులు చేసి, తనిఖీలు చేస్తున్నారు.వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం నేరం. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 ప్రకారం.. కొన్ని రకాల మందులను వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించడం చట్టవిరుద్ధం. ఇలాంటి మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే.. అమ్మిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో, మందులు కొన్న వ్యక్తిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఈ చట్టం కింద, కొన్ని రకాల మందులు మాత్రమే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడానికి అనుమతి ఉంది. వీటిని ఓవర్ ది కౌంటర్ మందులు అంటారు. ఈ మందులు సాధారణంగా జ్వరం, తలనొప్పి, జలుబు వంటి చిన్న ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు. అయితే, కొన్ని రకాల మందులు మాత్రం తప్పనిసరిగా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ తోనే కొనాలి. వీటిలో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, యాంటీఫంగల్స్, యాంటీడిప్రెసెంట్స్, యాంటీసైకోటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్, హార్మోన్ థెరపీ మందులు మొదలైనవి ఉన్నాయి.

Read more:Amalapuram:ఆత్రేయపురం పూతరేకులకు కల్తీ నెయ్యి

Related posts

Leave a Comment